ETV Bharat / entertainment

Waheeda Rehman Dadasaheb Phalke : ప్రముఖ నటి, డ్యాన్సర్​ వహీదా రెహ్​మాన్​కు​ దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు - దాదా సాహెబ్​ లైఫ్​ టైమ్​ అవార్డ్ వహీదా రెహ్మాన్

Waheeda Rehman Dadasaheb Phalke : బాలీవుడ్​ సీనియర్​ నటి, డ్యాన్సర్​ వహీదా రెహ్​మాన్​ కేంద్ర ప్రభుత్వం ఓ అరుదైన గౌరవాన్ని అందించనుంది. ఈ ఏడాది దాదాసాహెబ్ ఫాల్కే లైఫ్‌ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుకు ఆమెను ఎంపిక చేసింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు.

Waheeda Rehman Dadasaheb Phalke
Waheeda Rehman Dadasaheb Phalke
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 26, 2023, 12:55 PM IST

Updated : Sep 26, 2023, 1:37 PM IST

Waheeda Rehman Dadasaheb Phalke : మన దేశంలో సినీ రంగానికి సంబంధించి ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డుల్లో దాదా సాహెబ్‌ ఫాల్కే ప్రధానమైనది. ఆ అవార్డుకు బాలీవుడ్‌ ప్రముఖ నటి డ్యాన్సర్​ వహీదా రెహమాన్‌ ఎంపిక చేసినట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ మంగళవారం ప్రకటించారు. దాదాసాహెబ్ ఫాల్కే లైఫ్‌ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందజేయనున్నట్లు వెల్లడించారు.

తన నటనతో ప్రేక్షకుల మదిలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న వహీదా.. తెలుగుతో పాటు హిందీ, మరాఠీ సినిమాల్లో నటిగా రాణించారు. డాక్టర్‌ కావాలనుకుని యాక్టర్‌ అయిన వారిలో వహీదా ఒకరు. 1938 ఫిబ్రవరి 3న తమిళనాడులోని చెంగల్పట్టులో జన్మించారు. చిన్నప్పుటి నుంచే చురుగ్గా ఉండే ఆమె నాట్యం నేర్చుకున్నారు. 1955లో ఎన్టీఆర్‌ తన సొంత సంస్థలో 'జయసింహ' అనే సినిమా తీసేందుకు రెడీ అవ్వగా.. ఇందులో రాజకుమారి పాత్రలో ఓ కొత్త నటిని తీసుకుకోవాలని భావించారట. అలా ఆ పాత్ర వహీదా రెహమాన్‌ను వరించింది. ఇదే సినిమాతో తెరంగేట్రం చేసిన వహీదా, అంతకుముందు 'రోజులు మారాయి' అనే సినిమాలో ఏరువాక సాగాలో అంటూ సాగే పాపులర్​ సాంగ్​లో డ్యాన్స్​ చేసి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

'బంగారు కలలు' సినిమాలో అక్కినేని నాగేశ్వర్​ రావు సోదరిగా నటించారు వహిదా. ఆ తరువాత 1986లో సూపర్​ స్టార్ కృష్ణ దర్శకత్వం వహించిన 'సింహాసనం'లో రాజమాతగా కనిపించారు. 2006లో సిద్ధార్థ్ హీరోగా వచ్చిన 'చుక్కల్లో చంద్రుడు'లో మళ్లీ నాగేశ్వర్​ రావుతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు .

ఇక దేవ్ ఆనంద్ లీడ్​ రోల్​లో తెరకెక్కిన 'CID' సినిమాతో ఆమె హిందీ సినిమా రంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత 'ప్యాసా', 'గైడ్', 'కాగజ్ కే ఫూల్', 'ఖామోషి', 'త్రిశూల్' వంటి చిత్రాల్లో నటించి బీటౌన్​లో సెటిలైపోయారు. అలా తన ఐదు దశాబ్దాల సినీ కెరీర్‌లో 90కి పైగా చిత్రాల్లో వహీదా నటించారు. 'రేష్మా అండ్ షేరా' అనే సినిమాలో ఆమె నటనకుగాను 1971లో నేషనల్​ అవార్డును అందుకున్నారు. ఆ తర్వాత 1972లో పద్మశ్రీ, 2011లో పద్మభూషణ్‌ పురస్కారాలు వచ్చాయి. ఇప్పటికీ సినీ ఇండస్ట్రీకి సేవలందించేందుకు సిద్ధంగా ఉన్న ఆమె.. చివరిసారిగా 2021లో 'స్కేటర్ గర్ల్' అనే స్పోర్ట్స్​ డ్రామాలో కనిపించారు.

ఎనిమిది పదుల వయసులో ఆ నటి స్కూబా డైవింగ్

బ్లాక్​ అండ్​ వైట్​లో ట్రెండింగ్​ భామలు వీరే..

Last Updated : Sep 26, 2023, 1:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.