ETV Bharat / entertainment

Vrushabha Movie Producer : శ్రీకాంత్ తనయుడి కోసం​ ఆస్కార్​ ప్రొడ్యూసర్​.. పాన్​ ఇండియా లెవెల్​లో ప్లాన్​.. - మోహన్​ లాల్​ వృషభ మూవీ

Vrushabha Movie Producer : మలయాళ స్టార్​ మోహన్‌లాల్‌, టాలీవుడ్‌ యంగ్‌ హీరో రోషన్‌ కాంబోలో తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా సినిమా కోసం ఓ హాలీవుడ్‌ ప్రొడ్యూసర్‌ వచ్చారట. ఇంతకీ ఆయన ఎవరంటే..

mohanlal vrushaba
mohanlal vrushaba
author img

By

Published : Aug 8, 2023, 7:01 AM IST

Updated : Aug 8, 2023, 7:20 AM IST

Vrushabha Movie Producer : మలయాళ స్టార్​ హీరో మోహన్‌లాల్‌ లీడ్​ రోల్​లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'వృషభ'. దర్శకుడు నంద కిషోర్‌ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో టాలీవుడ్‌ నటుడు శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ కూడా నటిస్తున్నాడు. ఇక బాలీవుడ్‌ ప్రొడ్యూసర్​ ఏక్తాకపూర్‌ ఈ చిత్రానికి నిర్మాణ బాధ్యతలు చేపట్టగా.. ఇప్పుడు ఈ టీమ్‌లోకి హాలీవుడ్‌కు చెందిన నిక్‌ థర్లో చేరారు. ఆయన ఈ సినిమాకు ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించనున్నారు. ఈ సందర్భంగా ఆయన తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

"నేను పనిచేస్తున్న తొలి ఇండియన్​ సినిమా ఇది. చాలా ఆనందంగా ఉంది. ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా పనిచేసే నేను ఫిల్మ్‌ మేకింగ్‌కు సంబంధించిన అన్ని విభాగాలను గమనిస్తాను. ప్రతి సినిమా నాకు ఓ కొత్త అనుభూతి పంచుతుంటుంది" అని నిక్​ పేర్కొన్నారు.

కాగా.. హాలీవుడ్‌లో పలు సూపర్‌హిట్‌ సినిమాలకు నిక్‌ నిర్మాతగా, సహ నిర్మాతగా వ్యవహరించారు. అంతే కాకుండా ఆయన ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా చేసిన 'మూన్‌లైట్‌' తదితర చిత్రాలకు 'ఆస్కార్‌' అవార్డులు కూడా దక్కడం విశేషం.

ఇక 'వృషభ' సినిమా విషయానికి వస్తే.. తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్​లో తెరకెక్కించేందుకు మేకర్స్​ ప్లాన్​ చేస్తున్నారు. జులై ఆఖరి వారంలో ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్​ ఇప్పుడు శరవేగంగా సాగుతోంది. యాక్షన్‌ థ్రిల్లర్​గా రూపొందుతున్న ఈ సినిమాలో మోహన్‌లాల్‌ తనయుడిగా టాలీవుడ్ యంగ్​ హీరో రోషన్‌ కనిపించనున్నాడు. మరో కీలక పాత్రలో బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ కపూర్‌ కుమార్తె శనయ కపూర్‌ నటిస్తోంది. ఈ సినిమాతో ఆమె తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనుంది.

మరోవైపు ఈ సినిమాలో విజువల్‌ ఎఫెక్ట్స్‌ కీలక పాత్ర పోషించనున్నాయి. వచ్చే ఏడాది ప్రపంచ వ్యాప్తంగా 4,500 థియేటర్లలో ఈ సినిమా విడుదల కానుంది.

Mohanlal Jailer Movie : తాజాగా 'జైలర్‌' సినిమాలో మోహన్‌లాల్‌ ఓ కీలక పాత్ర పోషించారు. ఆ సినిమా జులై 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. రజనీకాంత్‌ లీడ్​ రోల్​లో దర్శకుడు నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ తెరకెక్కించిన ఈ సినిమాలో కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్‌, బాలీవుడ్‌ నటుడు జాకీష్రాఫ్‌, టాలీవుడ్‌ నటులు సునీల్‌, రమ్యకృష్ణ లాంటి స్టార్స్​ కీలక పాత్రలు పోషించారు.

Last Updated : Aug 8, 2023, 7:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.