ETV Bharat / entertainment

వరదల్లో చిక్కుకున్న హీరోలు ఆమిర్ ఖాన్, విష్ణు విశాల్- అతికష్టం మీద బయటపడ్డారిలా! - ఆమిర్ ఖాన్ చెన్నై వరదలు

Vishnu Vishal Twitter Post Chennai Rains : బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్​ ఖాన్, కోలీవుడ్ కథానాయకుడు విష్ణు విశాల్ వరదల్లో చిక్కుకున్నారు. అతికష్టం మీద బయటపడ్డారు. ఆ వివరాలు మీకోసం.

Vishnu Vishal Twitter Post Chennai Rains

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 5, 2023, 5:30 PM IST

Updated : Dec 5, 2023, 7:33 PM IST

Vishnu Vishal Twitter Post Chennai Rains : బాలీవుడ్ అగ్ర కథానాయకుడు ఆమిర్​ ఖాన్, కోలీవుడ్ హీరో విష్ణు విశాల్ వరదల్లో చిక్కుకున్నారు. కరెంట్​, సెల్​ఫోన్ సిగ్నల్స్​ లేక దాదాపు 24 గంటల పాటు చిక్కుకుపోయారు. తమకు సహాయం చేయాలని సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. రెస్క్యూ బృందాలు స్పందించి సహాయక చర్యలు చేపట్టడం వల్ల చివరకు అతి కష్టం మీద బయటపడ్డారు.

దాదాపు 24 గంటల పాటు వరదల్లో చిక్కుకున్నారు కోలీవుడ్ హీరో విష్ణు విశాల్. ఆ తర్వాత చెన్నైలో​ తాను నివాసం ఉంటున్న పరిసరాల్లో వరద పరిస్థితిని వివరిస్తూ ఎక్స్​లో ఓ పోస్టు పెట్టారు. వర్ష బీభత్సానికి సంబంధించిన ఫొటోలు షేర్‌ చేశారు. తాను నివసిస్తున్న కారప్పాకంలోని ఇంట్లోకి వరద నీరు వచ్చిందని తెలిపారు. క్రమంగా వరద ఉద్ధృతి పెరుగుతోందని పోస్టులో పేర్కొన్నారు. 'కరెంట్, ఇంటర్నెట్‌ లేదు. ఫోన్‌ సిగ్నల్‌ కూడా సరిగా అందడం లేదు. ఇంటిపై ఓ చోట మాత్రమే సిగ్నల్‌ వస్తుంది. అక్కడ నుంచే ఇది పోస్ట్‌ చేస్తున్నా. నాకు, ఇదే ప్రాంతంలో ఉంటున్న వారికి సాయం అందుతుందని ఆశిస్తున్నా. చెన్నై ప్రజల అవస్థను చూస్తుంటే బాధగా ఉంది' అని విష్ణు విశాల్‌ తన పోస్ట్‌లో తెలిపారు.

ఈ పోస్ట్‌ పెట్టిన కొద్ది సేపటికే ఫైర్‌, రెస్క్యూ విభాగాలు స్పందించాయి. రంగంలోకి దిగి కారప్పాకం ఏరియాలో సహాయక చర్యలు చేపట్టాయి. హీరోలు అమిర్​ ఖాన్​, విష్ణు విశాల్​లో పాటు తదితరులను కారప్పాకం నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. ఈ విషయాన్ని తెలియజేస్తూ హీరో విష్ణు విశాల్‌ మరో పోస్ట్‌ పెట్టారు. తమను రక్షించిన తమిళనాడు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియిజేశారు. కష్ట సమయంలో ఆదుకుందని ప్రభుత్వాన్ని ప్రశంసించారు. అయితే ఆమిర్​ ఖాన్​ చెన్నైలో ఏం చేస్తున్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

  • Thanks to the fire and rescue department in helping people like us who are stranded

    Rescue operations have started in karapakkam..
    Saw 3 boats functioning already

    Great work by TN govt in such testing times

    Thanks to all the administrative people who are working relentlessly https://t.co/QdoW7zaBuI pic.twitter.com/qyzX73kHmc

    — VISHNU VISHAL - VV (@TheVishnuVishal) December 5, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదిలా ఉండగా, మిగ్​జాం తుపాను కారణంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. చెన్నైతో పాటు కాంచీపురం, నాగపట్టినం, కడ్డళూరు, తిరువళ్లూర్​ను వరదలు ముంచెత్తాయి. చెన్నైలోని చాలా ప్రాంతాల్లో ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. సహాయక సిబ్బంది ఎంత శ్రమిస్తున్నా రోడ్లు వరదతో జలమట్టమవుతున్నాయి. దీంతో సత్వర సహాయక చర్యల కోసం రూ.10 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు తమిళ నటులు సూర్య, కార్తి.

Vishnu Vishal Movie List : విష్ణు విశాల్‌ తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం ఉన్న నటుడే. 'అరణ్య', 'ఎఫ్‌ఐఆర్‌', 'మట్టి కుస్తీ' వంటి సినిమాలతో అలరించారు. ఈ హీరో త్వరలో 'లాల్‌ సలామ్‌' తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రంలో సూపర్ స్టార్ రజనీకాంత్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. రజనీకాంత్‌ కుమార్తె ఐశ్వర్య దర్శకత్వం వహించిన ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.

'యానిమల్'​ మూవీలో సుందరమైన ప్యాలెస్​ - ఆ స్టార్​ హీరోదేనట

సాయిపల్లవికి క్రేజీ ఆఫర్​- యశ్​ సినిమాలో హీరోయిన్​గా ఛాన్స్​!

Last Updated : Dec 5, 2023, 7:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.