Vishal Marriage Rumors : తమిళ స్టార్ హీరోయిన్‌తో తనకు పెళ్లి అని వస్తున్న రూమర్స్‌పై హీరో విశాల్ స్పందించారు. గత కొంత కాలంగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదంటూ నెట్టింట క్లారిటీ ఇచ్చారు. దానికి ముందు విశాల్ టీమ్ కూడా ఈ వార్తలను కొట్టిపారేసింది. అయినప్పటికీ ఈ రూమర్స్‌కు బ్రేక్ పడలేదు. దీంతో స్వయంగా విశాల్ వీటిపై స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ఆ వార్తలను ఖండించారు.
-
Usually I don’t respond to any fake news or rumors about me coz I feel it’s useless. But now since the rumour about my marriage with Laksmi Menon is doing the rounds, I point blankly deny this and it’s absolutely not true and baseless.
— Vishal (@VishalKOfficial) August 11, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
The reason behind my response is only…
">Usually I don’t respond to any fake news or rumors about me coz I feel it’s useless. But now since the rumour about my marriage with Laksmi Menon is doing the rounds, I point blankly deny this and it’s absolutely not true and baseless.
— Vishal (@VishalKOfficial) August 11, 2023
The reason behind my response is only…Usually I don’t respond to any fake news or rumors about me coz I feel it’s useless. But now since the rumour about my marriage with Laksmi Menon is doing the rounds, I point blankly deny this and it’s absolutely not true and baseless.
— Vishal (@VishalKOfficial) August 11, 2023
The reason behind my response is only…
"సాధారణంగా నా గురించి వచ్చే ఫేక్ న్యూస్, రూమర్స్ గురించి స్పందించను. అది అనవసరమని నేను భావిస్తున్నాను. అయితే ఇప్పుడు లక్ష్మీ మేనన్‌తో నా పెళ్లి అన్న రూమర్స్ వచ్చినందున.. దీన్ని నిర్మొహమాటంగా ఖండిస్తున్నాను. ఆమె నటిగా కంటే ఓ అమ్మాయి అవ్వడం వల్లనే నేను స్పందిస్తున్నాను. మీరు ఒక అమ్మాయి వ్యక్తిగత జీవితాన్ని గురించి ఇలా చెప్పి తన ప్రైవసీకి భంగం కలిగిస్తున్నారు. నేను ఎవరిని, ఎప్పుడు, ఎక్కడ పెళ్లి చేసుకొంటానో తెలుసుకోవడం బెర్ముడా ట్రయాంగిల్ అంతా కష్టమేమి కాదు. సమయం వచ్చినప్పుడు నా పెళ్లిని అధికారికంగా ప్రకటిస్తాను. గాడ్ బ్లెస్." అంటూ తన మ్యారేజ్ రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చారు. ఇక విశాల్, లక్ష్మీ మేనన్ గతంలో 'పల్నాడు', 'ఇంద్రుడు' వంటి సినిమాల్లో కలిసి నటించారు. అప్పటి నుంచి వీరిద్దరిపై రూమర్స్ మొదలయ్యాయి. ఇక తాజాగా వచ్చిన ట్వీట్‌తో వీటికి చెక్పడట్లు అయ్యింది.
Vishal Upcoming Movies : ఇక విశాల్ కెరీర్ విషయానికి వస్తే.. 'అభిమన్యుడు', 'పందెం కోడి', 'ఇంద్రుడు', 'భరణి', 'పొగరు','సెల్యూట్' లాంటి పలు యాక్షన్ చిత్రాల్లో నటించి ప్రేక్షకుల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. తెలుగులో కూడా విశాల్‌కు మంచి క్రేజ్ ఉంది. ఆయన ప్రస్తుతం 'మార్క్ ఆంటోనీ'తో పాటు మరో రెండు సినిమాల్లో నటిస్తున్నారు. ఇక విశాల్ నటిస్తున్న 'మార్క్ ఆంటోనీ' ఈ ఏడాది సెప్టెంబర్‌లో విడుదల కానుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
Lakshmi Menon Movies : 'జిగురుతాండ', 'పాండియనాడు', 'కుట్టు బుల్లి, 'నాన్ సికపు మన్మన్', 'కొంబన్' లాంటి సినిమాల్లో నటించిన లక్ష్మీ మేనన్.. విజయ్ సేతుపతితో కలిసి 'రెక్కై' అనే సినిమాలో నటించారు. ఇక అజిత్‌తో వేదాలంలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇందులో ఆమె అజిత్‌కు చెల్లిగా నటించి ప్రేక్షకులను అలరించారు. ప్రస్తుతం ఆమె లారెన్స్ లీడ్ రోల్లో తెరకెక్కుతున్న 'చంద్రముఖి -2'లో నటిస్తున్నారు.
విశాల్‌కు నిజంగానే పొగరుంది.. ఎదుటివారికి హాని చేసేలా ఉండకూడదు: మోహన్ బాబు
'అందుకే విజయ్ మూవీకి నో చెప్పా.. కానీ త్వరలోనే ఆయనతో సినిమా తీస్తా'