ETV Bharat / entertainment

'విరాట పర్వం' రిలీజ్​ డేట్​ వచ్చేసింది.. 'కొమురం భీముడో' ఫుల్‌ వీడియో - komaram bheemudu song video

ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'విరాట పర్వం' సినిమా విడుదల తేదీని ఎట్టేకేలకు ప్రకటించింది చిత్ర బృందం. ​ఆర్​ఆర్​ఆర్​ సినిమాలోని మోస్ట్‌ అవైటెడ్‌ సాంగ్‌.. ‘కొమురం భీముడో’ ఫుల్‌ వీడియో వచ్చేసింది.

updates
మూవీ అప్డేట్స్​
author img

By

Published : May 6, 2022, 7:22 PM IST

Updated : May 6, 2022, 10:55 PM IST

నటులు రానా, సాయి పల్లవి తమ అభిమానులకు శుభవార్త వినిపించారు. ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న తమ 'విరాట పర్వం' సినిమా విడుదల తేదీని ప్రకటించారు. జులై 1న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. 'తెలుగు నేల నడిచిన కొత్త దారుల నెత్తుటి జ్ఞాపకం.. మనలోంచి మన కోసం సాగిన ఓ చారిత్రక సందర్భం.. ప్రేమ యుద్ధమై సాగిన విరాటపర్వం' అంటూ చిత్ర దర్శకుడు వేణు ఊడుగుల సోషల్‌ మీడియా వేదికగా ఓ పోస్టర్‌ను పంచుకున్నారు. పోరాట నేపథ్యానికి సంబంధించిన ఈ లుక్‌లో రానా ఓ చేత్తో తుపాకీని, మరో చేత్తో సాయి పల్లవిని పట్టుకుని కనిపించాడు. తెలంగాణలో 90లనాటి నక్సలైట్‌ ఉద్యమాల స్ఫూర్తితో రూపొందిన ఈ చిత్రంలో ప్రియమణి, నవీన్‌ చంద్ర, నందితా దాస్‌, ఈశ్వరీ రావు తదితరులు కీలక పాత్రలు పోషించారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రాన్ని సురేశ్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై సురేశ్ బాబు సమర్పిస్తున్నారు. పోస్టర్లు, ప్రచార చిత్రాలతో ఎంతో ఆసక్తి రేకెత్తించిన ఈ ప్రాజెక్టు గతేడాదే విడుదల కావాల్సి ఉండగా కొవిడ్‌ దృష్ట్యా పలుమార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

కొమురం భీముడో..: సూపర్‌హిట్‌ పాన్‌ ఇండియా చిత్రం ఆర్​ఆర్​ఆర్​ నుంచి వారానికో ఫుల్‌ వీడియో సాంగ్‌ విడుదలవుతున్న సంగతి తెలిసిందే. సోషల్‌ మీడియా వేదికగా చిత్ర బృందం ఏ పాటను విడుదల చేసినా 'కొమురం భీముడో ఎప్పుడు?', 'కొమురం గీతం త్వరగా విడుదల చేయండి' అంటూ సినీ అభిమానులు, నెటిజన్లు వరుస కామెంట్లు చేసేవారు. వీటిపై ఓ సందర్భంలో సినీ టీమ్‌ స్పందించింది. 'రావాల్సిన సమయానికి వస్తుంది' అంటూ ఇన్ని రోజులు ఊరించి, తాజాగా ఆ కానుకను అందించింది. హావభావాలకు అధిక ప్రాధాన్యమున్న ఈ గీతం అందరి హృదయాలను హత్తుకునేలా ఉంది. సుద్దాల అశోక్‌తేజ సాహిత్యం, కాలభైరవ గానం, ఎం. ఎం. కీరవాణి సంగీతానికి లిరికల్‌ వీడియో విడుదలైనప్పుడే శ్రోతల నుంచి చక్కటి ఆదరణ దక్కింది. ఎన్టీఆర్‌..కొమురం భీమ్‌గా, రామ్‌చరణ్‌.. అల్లూరి సీతారామరాజుగా రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా రూ.1000 కోట్లలో చేరి తెలుగు సినిమా ఖ్యాతిని పెంచింది.

ఇదీ చదవండి: Review: 'అశోకవనంలో అర్జున కల్యాణం' ఎలా ఉందంటే..?

Last Updated : May 6, 2022, 10:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.