నిఖిల్ కథానాయకుడిగా చందూ మొండేటి తెరకెక్కించిన సస్పెన్స్ థ్రిల్లర్ 'కార్తికేయ 2'. ఇటీవలే ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం సూపర్‌హిట్ టాక్‌ను అందుకుంది. టాలీవుడ్ టు బాలీవుడ్ అన్ని చోట్లా బాక్సాఫీస్ ముందు అదిరిపోయే కలెక్షన్లను వసూలు చేస్తూ దూసుకెళ్తోంది. నార్త్‌లో అయితే ఏకంగా అగ్ర కథానాయకులైన ఆమిర్ ఖాన్ లాల్‌సింగ్ చడ్డా, అక్షయ్‌కుమార్ రక్షాబంధన్ సినిమాలను సైతం పక్కకు నెట్టి ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పిస్తోంది.
అయితే ఈ మూవీ సూపర్ సక్సెస్‌ను ఆస్వాదిస్తున్న దర్శకుడు చందూ ముందేటికి తన జీవితంలో మరచిపోలేని మరో సంఘటన ఎదురైంది. బాలీవుడ్ దిగ్గజ నటుడు బిగ్ బీ అమితాబ్ బచ్చన్‌ను కలిసే అవకాశం దక్కింది.
తాజాగా బిగ్‌బీ.. కార్తికేయ మూవీటీమ్పై ప్రశంసలు కురిపించారు. స్వయంగా చందూ మొండేటిని ఆహ్వానించి అభినందించారు. సరదాగా కాసేపు ముచ్చటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ చందూ.. అమితాబ్‌తో కలిసి దిగిన ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసి ఆనందాన్ని వ్యక్తం చేశారు. "ఆ దీవెనలు!! ధన్యవాదాలు అమితాబ్ జీ ఇది నా జీవితంలో మరచిపోలేని సంఘటన" అన్న వ్యాఖ్య రాసుకొచ్చారు. ఇప్పుడా ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ ఫొటో చూసిన నెటిజన్లు.. అమితాబ్ కార్తికేయ 2 చిత్రాన్ని వీక్షించి ఉంటారని భావిస్తున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఇక కార్తికేయ 2 కలెక్షన్స్ విషయానికొస్తే.. బాక్సాఫీస్ ముందు అదరగొడుతోంది. నార్త్‌లో అయితే హిందీ చిత్రాలను పక్కకు నెట్టి మరీ మంచి వసూళ్లను అందుకుంటోంది. సినిమా సూపర్‌హిట్ టాక్ తెచ్చుకోవడం వల్ల రోజురోజు స్క్రీన్స్ సంఖ్య కూడా పెరుగుతోంది. దీంతో మరిన్ని కలెక్షన్లు పెరుగుతూ, థియేటర్లకు ప్రేక్షకులు వచ్చే సంఖ్య పెరుగుతోంది. ఆగస్టు 13న విడుదలైన ఈ చిత్రం ఆరు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 42.58 నుంచి 43.58 కోట్ల గ్రాస్ అందుకుందని అంచనా. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర, తెలంగాణ కలిపి 24.33 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని తెలిసింది.
ఇదీ చూడండి:
మహేష్ త్రివిక్రమ్‌ల కొత్త చిత్రం ఎప్పుడంటే
Krish 4 సర్ప్రైజ్, ఈ సారి హృతిక్‌తో పాటు ఆ సౌత్ స్టార్ హీరో