ETV Bharat / entertainment

'టికెట్‌ ధరల పెంపు అర్థంలేని పని.. చాలా నష్టపోతున్నాం'

author img

By

Published : Jun 10, 2022, 7:08 AM IST

కమల్ హాసన్ కథానాయకుడిగా సక్సెస్ ఫుల్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన భారీ యాక్షన్ థ్రిల్లర్ 'విక్రమ్'. విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత సుధాకర్ రెడ్డి తెలుగులో భారీగా విడుదల చేశారు. జూన్ 3న విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. ఈ నేపథ్యంలో నిర్మాత సుధాకర్ రెడ్డి.. విక్రమ్ విజయంతో పాటు కొత్త సినిమాల సంగతులు ముచ్చటించారు. ఆయన చెప్పిన విశేషాలివే.

vikram producer
vikram producer

Vikram Movie Producer: "టికెట్‌ ధరలు మరీ అధికంగా పెంచకూడదన్నది నా పాలసీ. ఏదో బడ్జెట్‌ పెరిగిందని ధరలు పెంచేయడం అర్థం లేని పని. దీని వల్ల కుటుంబ ప్రేక్షకులు థియేటర్లకు రాక నష్టపోవాల్సి వస్తోంది'' అన్నారు నిర్మాత సుధాకర్‌ రెడ్ఢి ఇప్పుడాయన నిర్మాణ సంస్థ శ్రేష్ఠ్‌ మూవీస్‌ నుంచి వచ్చిన చిత్రం 'విక్రమ్‌'. కమల్‌హాసన్‌ హీరోగా నటించిన ఈ సినిమాని లోకేష్‌ కనగరాజ్‌ తెరకెక్కించారు. ఫహద్‌ ఫాజిల్‌, విజయ్‌ సేతుపతి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా ఇటీవలే విడుదలైంది. ఈ నేపథ్యంలోనే గురువారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు సుధాకర్‌ రెడ్డి.

'విక్రమ్‌'ను తీసుకోవాలన్న ఆలోచన ఎందుకొచ్చింది? చిత్ర ఫలితం సంతృప్తినిచ్చిందా?

''లోకేష్‌ కనగరాజ్‌ కమల్‌హాసన్‌కు వీరాభిమాని. కాబట్టి తను తీశాడంటే కచ్చితంగా మంచి సినిమా అవుతుందనే నమ్మకం కలిగింది. నితిన్‌ ట్రైలర్‌ చూసి.. 'తీసుకోండి నాన్న' అని నమ్మకంగా చెప్పాడు. కమల్‌ మమ్మల్ని నమ్మి సినిమా మా చేతుల్లో పెట్టారు. ఇప్పుడు ప్రేక్షకుల ఆదరణ, వసూళ్లు చూశాక.. 'మేము మంచి నిర్ణయం తీసుకున్నామ'ని ఆనందంగా అనిపించింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో రూ.20కోట్ల గ్రాస్‌ వచ్చింది. మేము, కమల్‌, ఎగ్జిబిటర్లు.. అందరం హ్యాపీ''.

ప్రేక్షకులు మునుపటిలా థియేటర్లకు రావడం లేదు కదా. ఇలాంటి టైమ్‌లో డబ్బింగ్‌ చిత్రం రావడం రిస్క్‌ అనిపించలేదా?

''20శాతం రిస్క్‌ ఉంటుందని భావించాం. అయితే మంచి చిత్రాల్ని ఆదరిస్తారనే నమ్మకం ఉంది. ఇది దర్శకుడి సినిమా. తన బలమేంటో నాకు బాగా తెలుసు. తను 'ఖైదీ', 'మాస్టర్‌' లాంటి రెండు హిట్స్‌ ఇచ్చి ఉన్నాడు. వీటికి తోడు విజయ్‌ సేతుపతి, ఫహద్‌ ఫాజిల్‌, సూర్య లాంటి పెద్ద స్టార్స్‌ ఉన్నారు. కాబట్టి ఈ చిత్రాన్ని మేమే విడుదల చేస్తే బాగుంటుంది అనిపించింది''.

సినీ కెరీర్‌లో నితిన్‌ ఎన్నో ఎత్తుపల్లాలు చూశాడు. ఓ తండ్రిగా మీ ఫీలింగ్‌ ఏంటి?

''ఎత్తుపల్లాలు సహజం. అందుకే సొంత బ్యానర్‌లో సినిమాలు చేసుకుంటున్నాం. బడ్జెట్‌ మనమే వేసుకోవడానికి వీలుంటుంది. అనుకున్న విధంగా ప్రచారం చేసుకోవచ్ఛు ఇప్పుడు రూ.2కోట్లు పెట్టి యాక్షన్‌ సీక్వెన్స్‌ తీయాలనుకోండి.. వేరే నిర్మాత అయితే ఎందుకంతని వెనకడుగేస్తాడు. అదే నా చిత్రమనుకోండి ఆ ఇబ్బంది ఉండదు. ప్రస్తుతం నితిన్‌ చాలా కష్టపడుతున్నాడు. మంచి ప్లానింగ్‌తో ముందుకెళ్తున్నాడు''.

టికెట్‌ రేట్ల విషయంలో కొంతమంది తప్పటడుగులు వేశారని టాక్‌ ఉంది? దానిపై మీ ఉద్దేశమేంటి?

''టికెట్‌ రేట్స్‌ విషయంలో మేము ప్రభుత్వాల్ని అడిగాం. రూ.200 నుంచి రూ.350 వరకు పెంచుకోవచ్చని చెప్పారు. కొందరు నేరుగా రూ.350 రేటు పెట్టేశారు. నేను రూ.200 ఉంచా. ఇంతకు ముందు 'బాహుబలి-2' నైజాంలో రూ.55కోట్లు వసూళ్లు సాధించింది. అదీ సాధారణ టికెట్‌ ధరల్లోనే. అలాంటిది ఇప్పుడెందుకు పెంచుతున్నారో అర్థం కావడం లేదు. బడ్జెట్‌లు పెరిగాయని టికెట్‌ రేట్స్‌ పెంచడం వల్ల.. రెండు, మూడు సార్లు చూసేవారు, ఫ్యామిలీస్‌ థియేటర్లకు రావడం లేదు. ఎలాగూ రెండు, మూడు వారాల్లో ఓటీటీలోకి వచ్చేస్తుంది కదా అని ఆలోచిస్తున్నారు''.

ఓటీటీ విడుదల విషయంలో ఏమైనా నిబంధనలు పెట్టుకున్నారా?

''చిన్న చిత్రాల్ని 5వారాలకు, పెద్ద సినిమాల్ని 50రోజులకు విడుదల చేయాలని నిబంధనలు పెట్టుకున్నారు. ఇప్పుడు సినిమా ఆడకపోతే వెంటనే మంచి ఆఫర్‌కు ఓటీటీకి ఇచ్చేసుకుంటున్నారు. దీని వల్ల థియేటర్‌ వ్యవస్థ తీవ్రంగా నష్టపోతుంది. నిర్మాతల మధ్య సమన్వయం లేదు. ఎన్ని అగ్రిమెంట్లు ఉన్నా.. బిజినెస్‌ లెక్కల్ని బట్టి ఎవరు ఎక్కువ రేటు ఇస్తే వారికే ఇచ్చేసుకుంటున్నారు. అలా కాకుండా పెద్ద చిత్రాలు విడుదల తర్వాత 50రోజుల వరకు ఓటీటీకి ఇవ్వకూడదని నిబంధన పెట్టుకుంటే పరిశ్రమకు చాలా మంచిది''.

మీ నిర్మాణ సంస్థలో రూపొందుతోన్న కొత్త చిత్రాలేంటి?

''ప్రస్తుతం 'మాచర్ల నియోజకవర్గం' చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుంది. ఇది ఆగస్ట్‌లో ప్రేక్షకుల ముందుకొస్తుంది. వక్కంతం వంశీ సినిమా ఓ పాట చిత్రీకరణ పూర్తి చేసుకుంది. త్వరలో మరో కొత్త షెడ్యూల్‌ మొదలవుతుంది. దీని తర్వాత నితిన్‌ - సురేందర్‌ రెడ్డి కాంబినేషన్‌లో ఓ చిత్రం పట్టాలెక్కుతుంది''.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి: 'అంటే సుందరానికీ.. కడుపుబ్బా నవ్వించి, కన్నీళ్లు పెట్టించే సినిమా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.