Liger Mass song promo: పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన చిత్రం 'లైగర్'. కరణ్ జోహర్, చార్మి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా లైగర్ ప్రచారాన్ని మొదలుపెట్టిన చిత్ర బృందం... తాజాగా ఆ చిత్రంలోని మొదటి పాట ప్రోమోను విడుదల చేసింది. 'అక్డీ పక్డీ' అంటూ సాగే ఆ పాటను భాస్కరభట్ల రవికుమార్ రచించగా అనురాగ్ కులకర్ణ, రమ్య బెహరా ఆలపించారు. ఈ పాటలో విజయ్ దేవరకొండ, అనన్య పాండే స్టెప్పులు మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగించనున్నాయి. పూర్తి పాటను ఈ నెల 11న సాయంత్రం 4 గంటలకు విడుదల చేయనున్నట్లు లైగర్ చిత్ర బృందం వెల్లడించింది. ఇక ఈ సాంగ్‌కు విపరీతంగా లైక్స్, కామెంట్స్ వస్తున్నాయి. ఫ్యాన్స్ అదిరిపోయిందని కామెంట్లు చేస్తూ సాంగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు.
కాగా, ఈ సినిమాలో విజయ్ మిక్స్డ్‌మార్షల్ ఆర్ట్స్ ఫైటర్‌గా కనిపించనున్నారు. ఈ పాత్ర కోసం ఆ విద్యలో ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నారు. కఠిన కసరత్తులు చేసి సిక్స్ ప్యాక్ లుక్‌లోకి మారారు. ఈ సినిమాకి కేచ- స్టంట్స్, జునైద్ సిద్ధిఖీ-కూర్పు, విష్ణు శర్మ-ఛాయాగ్రహణం అందించారు. దిగ్గజ బాక్సక్ మైక్ టైసన్ కీలక పాత్ర పోషించారు. ఇక ఈ చిత్రంతో పాటు విజయ్-పూరి కాంబోలో 'జనగణమన' తెరకెక్కుతోంది. ఇందులో పూజాహెగ్డే హీరోయిన్. ఆర్మీ నేపథ్యంలో రూపొందుతోందీ మూవీ.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: ఆయ్ బాబోయ్ సిగ్గేస్తోంది.. నాకో బాయ్‌ఫ్రెండ్ కావాలి: కృతిశెట్టి