ETV Bharat / entertainment

ఇకపై నేనే సూపర్ స్టార్, షారుక్ అభిప్రాయం తప్పు, రౌడీ హీరో పవర్ పంచ్ - షారుక్​ ఖాన్​పై విజయ్​ దేవరకొండ కామెంట్స్​

Vijaydevarkonda comments on Sharukhkhan బాలీవుడ్ స్టార్​ హీరో షారుక్​ ఖాన్​పై రౌడీ హీరో విజయ్​ దేవరకొండ షాకింగ్ కామెంట్స్​ చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్​మీడియాలో వైరల్​గా మారాయి. అవి ఏంటంటే?

Vijaydevarkonda comments on Sharukhkhan
షారుక్​ ఖాన్​ విజయ్​ దేవరకొండ
author img

By

Published : Aug 24, 2022, 4:08 PM IST

Vijaydevarkonda comments on Sharukhkhan నటుడిగా మూడు దశాబ్దాలుగా బాలీవుడ్​ చిత్ర పరిశ్రమను ఏలుతున్నారు స్టార్​ హీరో షారుక్​ ఖాన్​. ఓ మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన ఆయన సినిమాపై ఉన్న ఆసక్తితో చిత్రసీమలోకి అడుగుపెట్టి వచ్చిన ప్రతి అవకాశాన్ని స్వదినియోగం చేసుకుంటూ సూపర్​స్టార్​గా ఎదిగారు. ఆయన సినీప్రయాణం ఎంతో మంది నటులకు స్ఫూర్తిదాయకం. అందుకే ఆయన్ను అభిమానులు ముద్దుగా బాలీవుడ్ బాద్‌షా, కింగ్ ఖాన్‌ అని పిలుచుకుంటారు. అయితే తాజాగా ఓ ఇంగ్లీష్​ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో లైగర్ హీరో విజయ్​ దేవరకొండ మాట్లాడుతూ.. తనకు కూడా షారుకే స్ఫూర్తి అని చెప్పారు. దీంతో పాటే గతంలో కింగ్​ఖాన్​​ చెప్పిన ఓ మాటను తప్పు అని తాను నిరూపిస్తానని చెప్పారు.

"షారుక్ ఖాన్ సక్సెస్ నన్ను ఎంతగానో ప్రభావితం చేసింది. నన్ను ముందుకు నడిపించింది. ఆయన(షారుక్) చేయగలిగినప్పుడు నేనెందుకు చేయలేననే విషయాన్ని స్పష్టంగా తెలిసేలా చేసింది. ఉదాహరణగా తీసుకునేందుకు ఒక్క విజయవంతమైన వ్యక్తి చాలు కదా. నాకు గుర్తింపు లేనప్పుడు కూడా చాలా సినిమాలను రిజెక్ట్ చేశాను. నేనెప్పుడు ఏది చేసినా పెద్దదిగా ఉండాలనే కోరుకుంటాను. పెద్ద కలలనే కన్నాను. అప్పుడు చాలా మంది 'ఇలా చేస్తే నీకు అవకాశాలు రావు' అనేవారు. కానీ నాపై నాకు భారీ అంచనాలు ఉన్నాయి." అని విజయ్​ అన్నారు.

గతంలో ఓ ఇంటర్వ్యూలో షారుక్​ ఖాన్​ మాట్లాడుతూ చివరి సూపర్​స్టార్​ తానే అని చెప్పారు. దీని గురించి విజయ్​ మాట్లాడుతూ.. "నేను ఆయన్ను కలిసే అవకాశం వస్తే ఆయన చెప్పింది తప్పని చెప్తాను. మీరు లాస్ట్​ కాదు. నేను వస్తున్నాను అని అంటాను" అని చెప్పినట్లు ఇంగ్లీష్​ వెబ్​సైట్స్​లో కథనాలు వచ్చాయి. కాగా, పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందిన లైగర్​ సినిమాలో విజయ్‌ సరసన అనన్య పాండే నటించింది. రమ్యకృష్ణ, గెటప్‌ శ్రీను, విష్ణురెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా ఈ నెల 25న విడుదల కానుంది.

ఇదీ చూడండి: విజయ్​ దేవరకొండ రికార్డ్​, ప్రభాస్​ మహేశ్ పవన్​ను మించేశాడుగా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.