Vijay Vishal News : సాధారణంగా చిత్రపరిశ్రమలో ఓ హీరో నటించాల్సిన కథలో మరో కథానాయకుడు నటించడం కామనే. డైరెక్టర్ ముందుగా ఫిక్స్ అయిన హీరో డేట్స్ సెట్ కాకపోవడం, ఆయన రాసుకున్న కథలో మార్పులు కోరితే దర్శకుడు దానికి ఓకే చెప్పకపోవడం వంటి కారణాల వల్ల అలా అప్పుడప్పుడు జరుగుతుంటుంది.
అయితే ఓ సినిమా విషయంలో కోలీవుడ్ స్టార్ హీరోలు విజయ్, విశాల్‌కు ఇదే పరిస్థితి ఎదురైందట. ఆ సినిమా ఏదో కాదు. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ సాధించిన సండకోళి (తెలుగులో పందెంకోడి). ఆ మూవీ దర్శకుడు లింగుస్వామి ఓ ఇంటర్వ్యూలో నాటి సంగతులు వివరిచారు. కథ మొత్తం వినకుండానే నటించేందుకు విజయ్ నో చెప్పారని అన్నారు.
"'సండకోళి' కోసం హీరో, హీరోయిన్లుగా విజయ్, జ్యోతికను అనుకున్నా. ఈ మేరకు ఓ రోజు విజయ్‌ను కలిశా. సగం కథ వినిపించా. అయితే కథానాయకుడి పాత్ర ఆయనకు అంతగా నచ్చినట్లు లేదు. కానీ నేను స్క్రిప్టు మొత్తం వినిపించాలనుకున్నా. విజయ్ సున్నితంగా తిరస్కరించారు. వేరే స్టోరీలు ఉంటే చెప్పమన్నారు. దాంతో, నేను అక్కడి నుంచి వెళ్లిపోయాను"
- లింగుస్వామి, దర్శకుడు
అయితే విజయ్ నో చెప్పాక తన సినిమాలో హీరోగా విశాలను సెలెక్ట్ చేశారు లింగుస్వామి. హీరోయిన్గా మీరాజాస్మిన్‌ను ఎంచుకున్నారు. యాక్షన్ నేపథ్యంలో రూ.10కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. రూ.30 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. 2005 డిసెంబరు 16న విడుదలైన ఈ సినిమా.. ఆ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా కోలీవుడ్‌లో రికార్డు నెలకొల్పింది. టాలీవుడ్‌లోనూ మంచి విజయం అందుకుంది. ఈ సినిమా సీక్వెల్ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ప్రస్తుతం విజయ్ దళపతి వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. దళపతి 68 పేరుతో ఈ మూవీ తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. వచ్చే ఏడాది(2024) జనవరి 1న టైటిల్ రివీల్ చేయనున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో విడుదల తేదీని కూడా ప్రకటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. ప్రశాంత్, ప్రభుదేవా, జయరామ్, యోగి బాబు, ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.