Lust Stories 2 Trailer : 2018లో విడుదలై ప్రేక్షకాదరణ పొందిన 'లస్ట్‌స్టోరీస్' వెబ్‌సిరీస్ ఇప్పుడు రెండో భాగంగా మన ముందుకు రానుంది. 'లస్ట్ స్టోరీస్ 2' గా తెరకెక్కనున్న ఈ సిరీస్ జూన్ 29 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ వేదికగా ప్రసారం కానుంది. ఈ క్రమంలో తాజాగా ఈ సీజన్‌కు సంబంధించిన ట్రైలర్‌ను విడుదుల చేసింది మూవీ టీమ్. ఇందులో మిల్కీ బ్యూటీ తమన్నా, మృణాల్, కాజోల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది.
ఈ సిరీస్‌లో రూమర్డ్ కపుల్ తమన్నా, విజయ్ వర్మ కలిసి నటించారు. దీంతో ఈ సిరీస్‌పై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి నెలకొంది. ఇక ఈ లస్ట్ స్టోరీస్ 2 కూడా తొలి పార్ట్ లాగే మొత్తం లస్ట్ చుట్టే తిరిగుతుంది. బాలీవుడ్ లో సీనియర్ నటులైన నీనా గుప్తా లాంటి స్టార్స్ ఈ లస్ట్ స్టోరీస్ 2లో ఉన్నారు. ప్రతి మనిషిలో మౌంట్ ఫుజి అగ్ని పర్వతంలో ఉన్నంత వేడి ఉంటుందని, దానిని చల్లార్చుకోవాలంటూ నీనా గుప్తా చెప్పే డైలాగుతో ఈ లస్ట్ స్టోరీస్ 2 ట్రైలర్ మొదలవుతుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
Lust Stories 2 Cast : 'ఓ చిన్న కారు కొనే ముందు ఏలా అయితే టెస్ట్ డ్రైవ్ చేస్తామో.. పెళ్లికి ముందు కూడా అలానే టెస్ట్ డ్రైవ్ చేయాలంటూ' నీనా గుప్తా అంటుంటారు. ఇలాంటి డైలాగ్స్ విన్న అభిమానులు.. ' ట్రైలరే ఇలా ఉందంటే.. ఇక సిరీస్ ఏ రేంజ్లో ఉండనుందో' అంటూ నెట్టింట తెగ గుసగుసలాడేస్తున్నారు. ఇక 'లస్ట్ స్టోరీస్' విషయానికి వస్తే.. ఈ సిరీస్ భిన్నమైన కథల ఆంథాలజీ. తొలి పార్ట్‌లోని ఎపిసోడ్స్‌ను కరణ్ జోహార్, జోయా అక్తర్, అనురాగ్ కశ్యప్ లాంటి సీనియర్ డైరెక్టర్లు ఒక్కో ఎపిసోడ్ ను డైరెక్ట్ చేశారు. ఫస్ట్ సీజన్లో కియారా అద్వానీ, భూమి ఫెడ్నేకర్, విక్కీ కౌశల్ లాంటి స్టార్స్ నటించారు.
అయితే 2018లో మొదటి సీజన్ వచ్చినపుడు ఓటీటీలకు అంత ప్యాచుర్యం లేదు. లాక్డౌన్ తర్వాత ఇప్పుడు అంతా మారిపోయింది. ప్రతీ ఒక్కరూ ఓటీటీల్లోని సినిమాలను సిరీస్‌లను చూస్తున్నారు. దీంతో ఈ 'లస్ట్ స్టోరీస్ 2'పై ప్రేక్షకుల్లో ఆసక్తి మొదలైంది. అంతే కాకుండా ఈ సీజన్లో కాజోల్, మృణాల్,తమన్న లాంటి స్టార్స్ ఉండటం వల్ల ఈ సీజన్‌పై అభిమానుల్లో మరింత ఉత్కంఠ పెరిగింది.