ETV Bharat / entertainment

Beast Trailer: రాజకీయ నాయకుడిని కాదు.. సైనికుడిని అంటున్న విజయ్​ - beast release date

Beast Trailer: తమిళ స్టార్ 'దళపతి' విజయ్‌, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం 'బీస్ట్‌'. ఈ సినిమా ట్రైల‌ర్‌ను ఉగాది సంద‌ర్భంగా విడుదల చేసింది చిత్రబృందం.

vijay in as beast trailer release
బీస్ట్​ ట్రైలర్​
author img

By

Published : Apr 2, 2022, 6:03 PM IST

Updated : Apr 2, 2022, 10:41 PM IST

Beast Trailer: అభిమానులు ఎంతోగానో ఎదురుచూస్తున్న తమిళస్టార్​ దళపతి విజయ్ 'బీస్ట్​' ట్రైలర్​ విడుదలైంది. ఉగాది పర్వదినం సందర్భంగా దాదాపు 2:56 నిమిషాల నిడివి ఉన్న ట్రైలర్​ను రిలీజ్​ చేశారు. ఆద్యంతం ఆసక్తిని రేకెత్తించేలా ఉన్న ట్రైలర్​లోని ప్రతి ఫ్రేమ్​ అదుర్స్​ అనిపించేలా ఉంది. విజయ్​ను మరో లెవల్​లో చూపించారు దర్శకుడు. ట్రైలర్​.. సినిమాపై అంచనాలు మరింత పెంచిందనే చెప్పాలి. డైలాగ్​ కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. 'రాజకీయ నాయకుడిని కాదు.. సైనికుడిని' అన్న డైలాగ్​ ట్రైలర్​కు హైలెట్​గా నిలిచింది.

ఉగ్రవాదం నేపథ్యం చుట్టూ ఈ సినిమా కథ ఉంటుందని ట్రైలర్​ను చూస్తే.. అర్థం అవుతుంది. గతంలో విజయ్​ స్లీపర్​ సెల్స్​ కథాంశంతో తెరకెక్కిన తుపాకీ సినిమాతో ఇండస్ట్రీ హిట్​ కొట్టారు విజయ్​. ఈ సినిమా కూడా అంతకుమించిన హిట్​గా నిలుస్తుందంటున్నారు అభిమానులు. నెల్సన్​ దిలీప్​ కుమార్​ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సన్​పిక్చర్స్​ నిర్మించింది. అనిరూధ్​ రవిచందర్​ సంగీతం అందించారు. పూజా హెగ్డే హీరోయిన్​. ఏప్రిల్‌ 13న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు ఇటీవలే ప్రకటించింది చిత్రబృందం.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Last Updated : Apr 2, 2022, 10:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.