ETV Bharat / entertainment

Vijay Devarkonda Upcoming Movies : దిల్​ రాజుతో రౌడీ హీరో మరో కొత్త సినిమా.. డైరెక్టర్​ ఎవరంటే? - దిల్​ రాజు విజయ్​ విద్యా సాగర్​ చింతా సినిమా

Vijay Devarkonda Upcoming Movies : రౌడీ హీరో విజయ్​ దేవరకొండ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో తెగ బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం SVC54/VD13 షూటింగ్​లో ఉన్న ఆయన టాలీవుడ్​లో పేరున్న ఓ డైరెక్టర్​తో కలిసి సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాని కూడా ప్రముఖ నిర్మాత దిల్​రాజునే ప్రొడ్యూస్​ చేయనున్నారట. ఆ సంగతులు..

Vijay Devarakonda Next Movie With Vidya Sagar Chinta Produced By Dil Raju
Vijay Devarakonda Next Movie With Vidya Sagar Chinta
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 8, 2023, 10:26 PM IST

Updated : Oct 9, 2023, 7:48 AM IST

Vijay Devarkonda Upcoming Movies : టాలీవుడ్​ యంగ్​ హీరో విజయ్​ దేవరకొండ తీరిక లేకుండా వరుస సినిమా షూటింగ్​లతో బిజీగా గడుపుతున్నారు. ఇటీవలే 'ఖుషి' సినిమాతో మంచి హిట్​ అందుకున్న ఈ రౌడీ హీరో ప్రస్తుతం ప్రముఖ నిర్మాత దిల్​రాజు నిర్మాణంలో SVC54/VD13 సినిమాలో నటిస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ ఇంకా షూటింగ్​ దశలో ఉండగానే 'అశోకవనంలో అర్జున కళ్యాణం' సినిమా దర్శకుడు విద్యా సాగర్​ చింతాతో కలిసి మరో ప్రాజెక్ట్​లో నటించేందుకు గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చారట. ప్రస్తుతం ఈ వార్తలు ఫిల్మ్​ నగర్​లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమాను కూడా దిల్​రాజునే ప్రొడ్యూస్​ చేయనున్నారట. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అఫీషియల్​ అనౌన్స్​మెంట్​ కూడా రానుందట.

అశోకవనంలో అర్జున కళ్యాణం'తో దర్శకుడిగా..
ఇక డైరెక్టర్​ విద్యా సాగర్​ చింతా సినిమాల విషయానికొస్తే.. ఈయన వెళ్లిపోమాకే (2017), ఫలక్​నామా దాస్​ (2019), అద్భుతం (2021) చిత్రాలకు సినిమాటోగ్రాఫర్​గా పని చేశారు. ఆ తర్వాత విశ్వక్​ సేన్​ హీరోగా నటించిన 'అశోకవనంలో అర్జున కళ్యాణం'తో దర్శకుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. కరోనా లాక్​డౌన్​ నేపథ్యంలో కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్​టైనర్​గా ఈ సినిమా తెరకెక్కింది. గతేడాది మేలో రిలీజైన ఈ సినిమా పాజిటివ్​ రెస్పాన్స్​ను దక్కించుకుంది.

Vijay Devarkonda Movies : ఇకపోతే ప్రస్తుతం విజయ్ దేవరకొండ దర్శకుడు పరుశురామ్‌ డైరెక్షన్​లో ఫ్యామిలీ అండ్ లవ్​ ఎంటర్​టైనర్​ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా ఆడియెన్స్​ ముందుకు తేనున్నట్లు నిర్మాత దిల్​రాజు ఇప్పటికే అనౌన్స్​ చేశారు. ఇందుకు సంబంధించి ఇటీవలే అధికారికంగా ప్రీ-లుక్​ రూపంలో ఉన్న ఓ పోస్టర్​ను కూడా రిలీజ్​ చేసింది మూవీ టీం. ఈ పోస్టర్​కు కూడా మంచి స్పందన లభించింది. అలాగే డైరెక్టర్​ గౌతమ్‌ తిన్ననూరి డైరెక్షన్‌లో కూడా ఓ మూవీ చేస్తున్నారు విజయ్ దేవరకొండ​. ఈ సినిమాలో విజయ్​ ఓ పోలీస్​ ఆఫీసర్​ రోల్​లో కనిపించనున్నారట. గ్యాంగ్​ స్టర్​ బ్యాక్​ డ్రాప్​లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.

బీచ్​లో బ్యాక్​లెస్​ టాప్​తో అషూ హాట్​ షో.. గ్రాండ్​ లుక్​లో ఫరియా

Samantha Ruth Prabhu New Pics : పింక్​ శారీలో సమంత గుబాళింపు.. ఈ మార్పులు చూశారా?

Last Updated : Oct 9, 2023, 7:48 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.