ETV Bharat / entertainment

Vijay Devarakonda Kushi : 'థియేటర్​ నుంచి బయటకు ఖుషీగా వస్తారు.. ఆ విజువల్‌ కోసం వెయిటింగ్​' - Vijay Deverakonda twitter video

Vijay Devarakonda Kushi : అర్జున్ రెడ్డి ఫేమ్ హీరో విజయ్ దేవరకొండ లేటెస్ట్ చిత్రం 'ఖుషి'. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఈ సినిమాలో హీరోయిన్​గా నటించారు. ఇక ఫీల్ గుడ్ లవ్​ ఎంటర్​టైనర్​గా తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం నుంచి థియేటర్లలో సందడి చేయనుంది. సినిమా రిలీజ్ సందర్భంగా.. హీరో విజయ్ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. మరి అదేంటంటే.

Vijay Devarakonda Kushi
Vijay Devarakonda Kushi
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 31, 2023, 10:58 PM IST

Vijay Devarakonda Kushi : టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ అగ్ర కథానాయిక సమంత జంటగా నటించిన సినిమా 'ఖుషి'. 'మజిలీ' ఫేమ్​ దర్శకుడు శివ నిర్వాణ.. లవ్​ అండ్ ఫ్యామిలీ ఎంటర్​టైనర్​గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్​పై నవీన్ యెర్నేని, రవి శంకర్ నిర్మించిన ఈ సినిమా.. సెప్టెంబర్ 1న గ్రాండ్​గా రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా విడుదలను పురస్కరించుకొని.. హీరో విజయ్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. ఇంతకీ ఆయన ఆ వీడియోలో ఎం మాట్లాడారంటే..

ఫ్రెండ్స్, ఫ్యామిలీస్​తో కలిసి సినిమా చూసిన ప్రేక్షకులు నవ్వుతూ బయటకు వస్తారని విజయ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆడియెన్స్ నుంచి శుక్రవారం వచ్చే ఈ రెస్పాన్స్​ గురించి ఎన్నో రోజలుగా ఎదురు చూస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇక ఈ వీడియో చూసిన విజయ్ ఫ్యాన్స్ అండ్ నెటిజన్లు మూవీ టీమ్​కు 'ఆల్​ ది బెస్ట్' అంటూ కామెంట్లు పెడుతున్నారు.

  • Thoughts before #Kushi❤️ release tomorrow!

    Cannot believe it is already here. It feels so sudden even though its been a year since you saw me on the big screen last.

    I believe you will all have a great fun time at the cinema. I cannot tell you how much i look forward to big… pic.twitter.com/DXJKWdorGH

    — Vijay Deverakonda (@TheDeverakonda) August 31, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Shiva Nirvana Movies : డైరెక్టర్ శివ నిర్వాణ.. ఇదివరకే 'నిన్ను కోరి', 'మజిలీ' వంటి ఫీల్ గుడ్ లవ్​ స్టోరీస్​తో ఇండస్ట్రీలో మంచి ఇమేజ్ సంపాదించుకున్నారు. ఇక సినిమా విడుదలకు ముందే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శకుడు.. ఈ చిత్రంలో హిందూ- ముస్లిం మధ్య గొడవల ప్రస్తావన ఉండదని స్పష్టం చేశారు. అలాగే ఈ సినిమాకు హీరోయిన్ సమంత పర్సనల్ లైఫ్​కు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు.

Kushi Cast : ఇక ఖుషి అడ్వాన్స్ బుకింగ్స్​ (Advance Booking) జోరుగా సాగుతున్నాయని ఇప్పటికే పలు కథనాలు వెలువడ్డాయి. ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ వస్తాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే రిలీజైన పాటలు, ట్రైలర్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటున్నాయి. సినిమాలో జయరామ్​, మురళి శర్మ, సచిన్ ఖేడాకర్, అలీ, లక్ష్మి, వెన్నెల కిశోర్, రోహిణి, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్​ అయ్యంగర్​ తదితరులు నటించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Kushi Bookings: ఇక 'ఖుషి' వంతు.. బుకింగ్స్​ షురూ.. సెప్టెంబర్​ బాక్సాఫీస్​కు సవాల్​!

ఏం నడుము భయ్యా.. చీరలో సమంత-అనుపమ గ్లామర్​ బ్లాస్ట్​​.. చూస్తే నిద్రపట్టదంటే!

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.