ETV Bharat / entertainment

Vijay Devarakonda 100 Fans : మాట నిలబెట్టుకున్న విజయ్​.. ఆ 100 కుటుంబాలకు రూ.కోటి రూపాయలు.. లిస్ట్ ఇదే - మాట నిలబెట్టుకున్న విజయ్ దేవరకొండ

Vijay Devarakonda 100 Fans 1 Crores : ది విజయ్‌ దేవరకొండ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. వంద కుటుంబాల జాబితాను తాజాగా ప్రకటించారు. ఆ వివరాలు..

Vijay Devarakonda 100 Fans : మాట నిలబెట్టుకున్న విజయ్​.. రూ.కోటి ఇచ్చేందుకు రెడీ.. ఆ 100 కుటుంబాల జాబితా ఇదే

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 14, 2023, 3:45 PM IST

Updated : Sep 14, 2023, 3:52 PM IST

Vijay Devarakonda 100 Fans 1 Crores : ఎంతో కొంత తిరిగిచ్చేయాలి, లేదంటే లావైపోతాం.. ఈ సినిమా డైలాగ్‌ చాలా మందికి తెలిసిందే. కానీ దీన్ని ది విజయ్‌ దేవరకొండ తన రియల్ లైఫ్​లో పాటిస్తున్నట్లే కనిపిస్తారు. ఫ్యాన్స్​ వల్ల తనకు కలిగి సక్సెస్‌ను, సంతోషాన్ని.. ఎప్పుడూ వారితో కలిసి పంచుకుంటుంటాడు. అయితే ఇప్పుడాయన మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. చెప్పిన మాటను నిలబెట్టుకున్నారు. 'ఖుషి' సక్సెస్‌ మీట్‌లో ఇచ్చిన మాట ప్రకారం.. వంద కుటుంబాలను సెలెక్ట్​ చేశారు.. ప్రతి కుటుంబానికి రూ.లక్ష చొప్పున చెక్కులను ఇవ్వనున్నారు. ఈ మేరకు ఆ వంద కుటుంబాల లిస్ట్​ను ట్విటర్‌ వేదికగా షేర్‌ చేశారు. "ఈ సారి మేము 100 కుటుంబాలను సెలెక్ట్ చేశాం. నేను చేసే చిరు సాయం మీ ఫ్యామిలీలో ఆనందాన్ని నింపుతుందని భావిస్తున్నాను" అని విజయ్​ ట్వీట్‌ చేశారు. అయితే ఈ లిస్ట్​లో రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ జిల్లాల నుంచి మాత్రమే కాకుండా కర్ణాటక, తమిళనాడులోని ప్రాంతాల నుంచి కూడా కుటుంబాలను ఎంపిక చేశారు విజయ్​. త్వరలోనే వీరందరికీ హైదరాబాద్‌లో జరిగే ఖుషి గ్రాండ్ ఈవెంట్‌లో చెక్​లు అందజేయనున్నట్లు తెలుస్తోంది.

కాగా, సేవా కార్యక్రమాలు చేయడంలో విజయ్‌ దేవరకొండ ఎప్పుడూ ముందుంటారన్న సంగతి తెలిసిందే. ప్రతి ఏడాది తన పుట్టిన రోజు నాడు కూడా చిన్నారుల కోసం ఏదో ఒక ప్రత్యేక కార్యక్రమం చేస్తుంటారు. అలాగే దేవర శాంతా పేరుతో క్రిస్మస్‌కు సర్‌ప్రైజ్‌ గిఫ్టులు పంచుతుంటారు. రీసెంట్​గా తన ఖర్చులతో కొంతమందిని వెకేషన్‌కు కూడా పంపించారు. కరోనా సమయంలోనూ రెండు ఛారిటీ ట్రస్ట్​లను ఏర్పాటు చేసి విరాళాలు సేకరించి.. ఎంతో మందిని ఆదుకున్నారు.

ఇకపోతే, ఖుషి సినిమా విషయానికి వస్తే.. చిత్రంలో విజయ్ దేవరకొండ, సమంత రొమాంటిక్ లవ్ కెమిస్ట్రీ అభిమానులను బాగా ఆకట్టుకుంది. సాంగ్స్​ బాగా హిట్​ అయ్యాయి. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఈ నెల 1న రిలీజై హిట్‌ టాక్​తో పాటు చెప్పుకోదగ్గ వసూళ్లను అందుకుంది.

Vijay Devarkonda VD 12 : కానిస్టేబుల్​గా విజయ్ దేవరకొండ.. గ్యాంగ్​ స్టర్​ బ్యాక్​డ్రాప్​లో స్టోరీ!

Rashmika Mandanna Latest Instagram Post : విజయ్ దేవరకొండ ఇంట్లో రష్మిక​.. స్పెషల్​ ఏంటో?

Last Updated : Sep 14, 2023, 3:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.