Beast movie director Nelson Dileep kumar: 'కోలమావు కోకిల' చిత్రంతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు నెల్సన్ దిలీప్‌కుమార్. ఆ తర్వాత నుంచి ప్రతి సినిమాలో వైవిధ్యం చూపిస్తూ మరింత ఉన్నత స్థాయికి చేరుకున్నారు. ఆయన తాజాగా విజయ్‌తో తెరకెక్కించిన చిత్రం 'బీస్ట్'. పూజా హెగ్డే కథానాయిక. ఇటీవల విడుదలైన 'అరబిక్ కుత్తు..' పాట ప్రపంచ స్థాయిలో హిట్‌గా నిలిచింది. ఈనెల 14న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు నెల్సన్ చిత్ర సంగతులను తెలిపారు. ఆ విషయాలివీ..
"విజయ్‌తో సినిమాను తెరకెక్కించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. అది నా కోరిక. ఆయన అభిమానులను సంతృప్తి పరచాలని నిర్ణయించుకుని రాసుకున్న కథే 'బీస్ట్'. ఇది విజయ్ సార్ రొటీన్ చిత్రాలకు చాలా భిన్నంగా ఉంటుంది. ఆయన సినిమాలంటే నాలుగైదు పాటలు, మారే కాస్ట్యూం ఏవేవో ఉంటాయి. కానీ ఇందులో అలాంటి శైలి ఉండదు. వాస్తవానికి నా మిత్రులు పలువురు ఈ కథను విని 'విజయ్‌సార్ ఈ కథను ఒప్పుకుంటారా' అని ప్రశ్నించారు. కానీ నేను నమ్మకంతో ఆయనకు కథ వినిపించా. ఇందులో మిలిటరీ రా అధికారిగా విజయ్ కనిపిస్తారు. స్మగ్లింగ్ తరహా చిత్రాలనే ఎంచుకుంటున్నాని అందరూ ప్రశ్నిస్తున్నారు. పనిగట్టుకుని అలాంటి కథలే ఎంచుకోవడం లేదు. కానీ, అలాంటి కథలు ఆసక్తిగా ఉంటాయనే ఎంచుకుంటున్నా. అంతేకాకుండా, స్మగ్లింగ్ జోనర్‌లో తక్కువ సినిమాలే వస్తుంటాయి.. అందుకని! 'అరబిక్ కుత్తు..' పాట అనిరుధ్ శైలిలో ఉంటుంది. మేం అనుకున్న మధ్యవర్తి పాత్రకు సెల్వరాఘవన్ అయితేనే కరెక్టుగా ఉంటారని నిర్ణయించుకున్నాం. సినిమాలో ఆయన ప్రత్యేకత తెలుస్తుంది. ఇక 'గూర్కా' సినిమాను కాపీ కొట్టినట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి షాపింగ్‌మాల్ హైజాక్ నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి. బీస్ట్ అలాంటిదే కానీ, ఇది వేరే కోణంలో ఉంటుంది. దాదాపు 80 శాతం సన్నివేశాలు మాల్‌లోనే చిత్రీకరించాం. విజయ్‌సార్ అభిమానులకు 'బీస్ట్' కొత్త వినోదాన్ని పంచిపెడుతుంద"ని పేర్కొన్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సన్‌పిక్చర్స్ నిర్మించింది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. పూజా హెగ్డే హీరోయిన్. ఇప్పటికే విడుదలై ఈ చిత్రంలోని పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్ సినీప్రియుల్ని బాగా అలరిస్తూ సోషల్‌మీడియాలో రికార్డులు సృష్టిస్తున్నాయి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీచూడండి: 'గాడ్‌ఫాదర్' డబుల్ కాదు ట్రిపుల్ బొనాంజ.. 'కేజీఎఫ్ 2'లో 'సలార్' గ్లింప్స్!