ETV Bharat / entertainment

లెజెండరీ ​సింగర్​ కన్నుమూత.. ప్రధాని సహా ప్రముఖుల సంతాపం

Bhupinder Singh Death: ప్రముఖ బాలీవుడ్​ సింగర్​ భూపిందర్ సింగ్ (82) కన్నుమూశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్రమంలో పరిస్థితి విషమించి ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారని భూపిందర్ సింగ్ సతీమణి మిథాలీ సింగ్ తెలిపారు.

VETERAN SINGER BHUPINDER SINGH PASSES AWAY IN MUMBAI HOSPITAL
లెజండరీ ​సింగర్​ భూపిందర్ సింగ్ కన్నుమూత.. ప్రధాని మోదీ సంతాపం
author img

By

Published : Jul 19, 2022, 9:46 AM IST

Updated : Jul 19, 2022, 10:16 AM IST

Bhupinder Singh Death: భారత సినీ పరిశ్రమ మరో లెజెండరీ సింగర్​ను కోల్పోయింది. ఎన్నో మధుర గీతాలను ఆలపించిన భూపిందర్​ సింగ్​ సోమవారం రాత్రి కన్నుమూశారు. భూపిందర్​ సింగ్ మరణంతో బాలీవుడ్​లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ వార్త తెలిసిన ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

కొద్ది రోజులుగా భూపిందర్​ సింగ్​ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. యూరినరీ సమస్యల కారణంగా ఆస్పత్రిలో చేరారు. ఈ నేపథ్యంలో భూపిందర్​కు పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్​ అని తెలిసింది. ఈ క్రమంలో సోమవారం రాత్రి పరిస్థితి విషమించి మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయితే ఆయనకు పెద్ద పేగు క్యాన్సర్​ ఉన్నట్లు వైద్యులు అనుమానిస్తున్నారు.

భూపిందర్​ సింగ్.. ఐదు దశాబ్దాల పాటు బాలీవుడ్​లో ఎన్నో సుమధురమైన గీతాలను ఆలపించారు. అనేక మంది దిగ్గజ సంగీత దర్శకులతో ఆయన పనిచేశారు. 'నామ్ గమ్ జాయేగా', 'దిల్ ధూండతా హై', 'దో దివానే షెహర్ మే', 'ఏక్ అకేలా ఈజ్ షెహర్ మే', 'తోడి సి జమీన్ తోడా ఆస్మాన్', 'దునియా చూటే యార్ నా చూటే' వంటి అనేక క్లాసిక్​ పాటలు పాడారు భూపిందర్ సింగ్.

భూపిందర్ సింగ్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. ఆయన పాటలు ఎంతో మందికి కదిలించాయన్నారు. దశాబ్దాల పాటు చిరస్మరణీయమైన పాటలను అందించిన భూపిందర్ సింగ్​జీ మరణం బాధగిలిగిందన్నారు మోదీ. భూపిందర్ సింగ్ కుటుంబ సభ్యుల పట్ల ప్రధాని మోదీ.. ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవిస్​ సహా పలువురు ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: 'నా కెరీర్​లో అదే ఫస్ట్​.. చైతూ ఇచ్చిన ఆ జర్క్ అస్సలు​ మర్చిపోలేను'

Last Updated : Jul 19, 2022, 10:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.