ETV Bharat / entertainment

బాలయ్య 'వీరసింహారెడ్డి'లో 11 ఫైట్స్‌.. ఫ్యాన్స్​కు పూనకాలే! - veerasimhareddy action scenees

'అఖండ' బ్లాక్‌బస్టర్‌ తర్వాత టాలీవుడ్​ స్టార్ హీరో బాలకృష్ణ నటిస్తోన్న తాజా సినిమా 'వీరసింహారెడ్డి'. ప్రస్తుతం ఈ సినిమా గురించి ఓ న్యూస్‌ వైరల్‌ అవుతోంది. అదేంటంటే?

Balakrishan Veerasimhareddy Movie
Balakrishan Veerasimhareddy Movie
author img

By

Published : Nov 17, 2022, 12:47 PM IST

Balakrishna Veerasimhareddy Movie: బాలకృష్ణ సినిమా వస్తుందంటేనే చాలు బాక్సాఫీస్‌ వద్ద సందడి వాతావరణం నెలకొంటుంది. గతేడాది రిలీజ్‌ అయిన 'అఖండ'సినిమా బాలకృష్ణ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. ఆ బ్లాక్‌బస్టర్‌ తర్వాత బాలయ్య చేస్తున్న సినిమా 'వీరసింహారెడ్డి'. ప్రస్తుతం ఫ్యాన్స్‌ అందరూ ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందుకే, ఈ సినిమాకు సంబంధించి ఏ చిన్న అప్‌డేట్‌ వచ్చిన క్షణాల్లో వైరల్‌గా మారుతోంది. తాజాగా ఈ చిత్రం గురించి ఓ క్రేజీ న్యూస్‌ నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది.

పల్నాడు ఫ్యాక్షన్‌ బ్యాక్‌ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో యాక్షన్‌ సన్నివేశాలు హైలెట్‌ అవ్వనున్నాయట. బాలకృష్ణ సినిమాలు అంటేనే యాక్షన్‌ సీన్లు ఎక్కువగా ఉంటాయి. ఈ సినిమాలో ఏకంగా 11 ఫైట్స్‌ ఉండనున్నాయని అంటున్నారు. ఇదే నిజమైతే బాలకృష్ణ కెరీర్‌లో అత్యధిక ఫైట్స్‌ ఉన్న సినిమాగా 'వీరసింహారెడ్డి' నిలిచిపోతుంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రాలేదు. కానీ, ఈ న్యూస్ మాత్రం పరిశ్రమ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.

గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్‌ ఇప్పటికే 80శాతం పూర్తయింది. ప్రస్తుతం అనంతపురంలో చిత్రీకరణ జరుగుతోంది. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలకృష్ణ సరసన శ్రుతిహాసన్‌ అలరించనుంది. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.