ETV Bharat / entertainment

బాక్సాఫీస్​ వద్ద బాలయ్య జోరు.. తొలి రోజు కలెక్షన్ ఎంతంటే.. - వీరసింహారెడ్డి సినిమా అప్డేట్స్

నట సింహం నందమూరి బాలకృష్ణ మరోసారి తెరపై విజృంభించారు. గురువారం వీరసింహారెడ్డి సినిమా రిలీజైన వేళ తొలిరోజు వచ్చిన బాక్సాఫీస్​ కలెక్షన్ల వివరాలు ఓ సారి చూసేద్దాం.

veera simha reddy movie collection
veera simha reddy
author img

By

Published : Jan 13, 2023, 12:52 PM IST

Updated : Jan 13, 2023, 3:03 PM IST

Veera Simha Reddy first day collections : 'అఖండ' తర్వాత అదే రేంజ్​లో ఫుల్​జోష్​తో వచ్చిన బాలయ్య సినిమా 'వీరసింహా రెడ్డి'. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నందమూరి బాలకృష్ణ అభిమానుల సందడి మధ్య సంక్రాంతి పండుగ జోరును కొనసాగించేందుకు 'వీరసింహారెడ్డి' గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ల వద్ద ఊరమాస్​ సెలబ్రేషన్స్‌ షురూ అయ్యాయి. తమ అభిమాన హీరో సినిమా చూసేందుకు చలిని సైతం లెక్కచేయకుండా తెల్లవారుజాము నుంచే నందమూరి అభిమానులు థియేటర్ల వద్ద బారులు తీరారు.

థియేటర్ల బయట భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు. పాలాభిషేకాలు, టపాసులు కాల్చుతూ, తీన్‌మార్‌ డ్యాన్స్‌లు చేస్తూ హంగామా చేశారు. చిత్ర ప్రదర్శన మొదలయ్యాక కూడా ఇదే తరహా సందడి కనిపించింది. బాలయ్య ఎంట్రీ సీన్స్‌, జై బాలయ్య పాట, పంచ్‌ డైలాగ్‌లు వచ్చినప్పుడు. కాగితాలు ఎగురవేస్తూ సంబరాలు చేసుకొన్నారు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

అలా ఇప్పటికే ఎన్నో అంచనాలతో రిలీజైన ఈ సినిమా తొలి రోజు రూ.54 కోట్ల గ్రాస్​ వసూలు చేసిందని నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్​ అధికారికంగా తెలిపింది. 'బాలయ్య బాబు బాక్సాఫీస్ ఊచకోత' అని క్యాప్షన్ జోడించింది. కాగా ఇటీవలే రిలీజైన రెండు తమిళ సినిమాల కలెక్షన్లను 'వీరసింహారెడ్డి' అధిగమించిందని సినీ వర్గాల టాక్​. తమిళంలో విజయ్​ 'వారసుడు' రూ.26.5 కోట్లు రాబట్టగా.. అజిత్​ 'తెగింపు' సినిమాకు రూ.26 కోట్ల కలెక్షన్ వచ్చింది.

ఇకపోతే గోపిచంద్​ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బాలయ్య రోర్​ మాములుగా లేదంటున్నారు అభిమానులు. జై బాలయ్య అన్న నినాదంతో థియేటర్లు దద్దరిల్లిపోయాయనే చెప్పాలి. ఇక బాలయ్య అటు యాక్షన్​తో పాట ఇటు సెంటిమెంట్​ను బ్యాలెన్స్​ చేసి ప్రేక్షకుల చేత కంటతడి పెట్టించారు.​ ఈ సినిమాలో నటించిన ఇతర తారలు సైతం తమదైన శైలిలో నటించి సీన్స్​ పండించారు.

Last Updated : Jan 13, 2023, 3:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.