ETV Bharat / entertainment

వరుణ్ తేజ్ - లావణ్యకు పవన్​ కల్యాణ్ ఏం గిఫ్ట్ ఇచ్చారో తెలుసా? ఇప్పుడు ఈ ఫొటోలే ఫుల్ ట్రెండింగ్​!

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 2, 2023, 8:48 AM IST

Updated : Nov 2, 2023, 9:33 AM IST

Varun Tej Lavanya Wedding Pawankalyan : మెగా ప్రిన్స్​ వరుణ్‌ తేజ్‌ - నటి లావణ్య త్రిపాఠి వివాహం వేడుకగా జరిగింది. కుటుంబసభ్యుల సమక్షంలో వరుణ్‌-లావణ్య ఏడడుగులు వేశారు. అయితే ఈ వేడుకలో పవన్ ఉన్నట్లు ఎక్కడా ఫొటోలు బయటకు రాలేదు. కానీ తాజాగా ఓ రెండు మూడు ఫొటోలు బయటకు వచ్చాయి. అలానే ఆయన కొత్త పెళ్లి కొడుకు వరుణ్​కు​ ఓ భారీ గిఫ్ట్​ను ఇచ్చినట్లు తెలిసింది. ఆ వివరాలు..

వరుణ్ తేజ్ - లావణ్యకు పవన్​ కల్యాణ్ ఏం గిఫ్ట్ ఇచ్చారో తెలుసా?.. ఇప్పుడు ఈ ఫొటోలే ఫుల్ ట్రెండింగ్​!

Varun Tej Lavanya Wedding Pawankalyan : మెగా ప్రిన్స్​ హీరో వరుణ్ తేజ్ - హీరోయిన్ లావణ్య త్రిపాఠి పెళ్లి తంతు ముగిసింది. ఇటలీలో గ్రాండ్​గా పెళ్లి చేసుకున్నారు. ఇరు కుటుంబ సభ్యులు, అతి తక్కువ మంది సన్నిహితుల సమక్షంలో మూడు ముళ్ల బంధంతో వివాహ జీవితంలోకి అడుగుపెట్టారు. దీంతో సోషల్ మీడియాలో వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి ట్రెండ్ అవుతున్నారు. కానీ వీళ్లిద్దరి పేరుతో పాటు అంతకన్నా ఎక్కువగా పవన్ కల్యాణ్ హ్యాష్ ట్యాగ్​ కూడా ట్రెండ్ అవుతోంది.

వరుణ్ తేజ్ - లావణ్య పెళ్లి వేడుకకు మెగా ఫ్యామిలీ మొత్తం వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఏపీ రాజకీయ పరిస్థితుల కారణంగా.. పవన్ కల్యాణ్ ఈ వివాహ వేడుకకు హాజరవుతారా లేదా అనే అనుమానం వచ్చింది. కానీ పవన్.. సతీసమేతంగా శంషాబాద్ విమానాశ్రయంలో ఇటలీ వెళ్తునట్లుగా కనిపించారు. ఆ తర్వాత పూర్తిగా సీన్ మారిపోయింది. ఎయిర్​ పోర్టులో కనిపించిన ఆయన ఆ తర్వాత వివాహ వేదిక వద్ద ఉన్నట్లు ఒక్క స్టిల్ కూడా బయటకు రాలేదు.

కాక్ టైల్ పార్టీతో మొదలైన వరుణ్ తేజ్ పెళ్లి సందడిలో పవన్ తప్ప మిగతా మెగా ఫ్యామిలీ అంతా కనిపించింది. ఫొటోలు బయట చక్కర్లు కొట్టాయి. ఆ తర్వాత హల్దీ ఫంక్షన్ జరిగింది. మెహందీ ఫంక్షన్ కూడా గ్రాండ్​గా జరిగింది. ఈ మూడు ఈవెంట్లలో మెగా హీరోలంతా కనిపించారు కానీ పవన్ మొహం కనపడేలా మాత్రం ఒక్క ఫొటో రాలేదు. వరుణ్ తేజ్​ను ఓపెన్ టాప్ కారులో వివాహ వేదిక వద్దకు సంప్రదాయబద్దంగా తీసుకొచ్చే సమయంలోనూ పవన్ పిక్స్ లేవు.

దీంతో పవన్ అభిమానుల్లో క్యూరియాసిటీ పెరిగింది. అసలు పవన్ ఏమైపోయారా అని అంతా తెగ ఆలోచించారు. అయితే తాజాగా ఓ రెండు మూడు ఫొటోలు వరకు బయటకు వచ్చాయి. క్యాజువల్ టీషర్ట్​లో బిస్కట్​ కలర్ ప్యాంట్ ధరించి కనిపించారు. మరో ఫొటోలో ఆయన అక్కడ ఓ మ్యూజియంలో ఉన్నట్లు ఉంది. ఈ పిక్స్ ఇప్పుడు ఫుల్ ట్రెండ్ అవుతున్నాయి.

ఇక సినీ, సోషల్​ మీడియా వర్గాల్లో జరుగుతున్న చర్చ ప్రకారం.. వరుణ్ - లావణ్య దంపతుల కోసం పవన్​ భారీ బహుమతిని ఇచ్చేందుకు ప్లాన్ చేసినట్టు ప్రచారం సాగుతోంది. అయితే బాబాయ్ పెళ్లికి రావడమే వరుణ్​ పెద్ద గిఫ్ట్​గా భావిస్తున్నారట. మరి ఇంతకీ ఆ బహుమతి ఏంటో..

Varun Lavanya Marriage : కాక్​టెయిల్ పార్టీ గ్యాలరీ​.. రామ్​చరణ్​ - అల్లు అర్జున్​ ఫుల్​ ఆపోజిట్​గా!

Varun Lavanya Marriage : వరుణ్​- లావణ్య పెళ్లికి చిరంజీవి తల్లి దూరం.. కారణమిదే!

Last Updated : Nov 2, 2023, 9:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.