ETV Bharat / entertainment

Varun Lavanya Wedding : ఇటలీకి పయనమైన సమంత​, చైతూ.. వారితో పాటు ఆ స్టార్​ హీరోయిన్ కూడా.. - వరుణ్​ తేజ్​ లావణ్య త్రిపాఠి పెళ్లిలో నాగచైతన్య

Varun Lavanya Wedding : టాలీవుడ్​ మెగా ప్రిన్స్​ వరుణ్​ తేజ్​- లావణ్య త్రిపాఠి పెళ్లి వేడుకలు గ్రాండ్​గా మొదలయ్యాయి. ఈ క్రమంలో ఈ స్టార్​ కపుల్​ను ఆశీర్వదించేందుకు పలువురు అతిథులు ఇటలీకి చేరుకున్నారు. తాజాగా ఆ లిస్ట్​లోకి మరో ముగ్గురు స్టార్స్​ వచ్చారు. ఇంతకీ వారెవరంటే ?

Varun Lavanya Wedding
Varun Lavanya Wedding
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 31, 2023, 6:30 PM IST

Updated : Nov 1, 2023, 6:47 AM IST

Varun Lavanya Wedding : ఇటలీలోనీ టస్కానీ వేదికగా టాలీవుడ్ మెగా ప్రిన్స్​ వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి వివాహ వేడుకలు గ్రాండ్​గా జరుగుతున్నాయి. ఇప్పటికే కాక్​టెయిల్​ పార్టీ ఘనం​గా జరగ్గా.. మరికొద్ది గంటల్లో సంగీత్​​, హల్దీ వేడుకలు కూడా మొదలుకానున్నాయి. అయితే అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో ఈ పెళ్లి జరగనుండగా.. పలువురు సినీ ప్రముఖులు, వరుణ్​ లావణ్య బంధువులు ఇటలీకి పయనమవుతున్నారు.

ఇప్పటికే మెగా, అల్లు ఫ్యామిలీలతో పాటు కామినేని ఫ్యామిలీ వివాహ వేదికకు చేరుకుంది. టాలీవుడ్​ హీరో నితిన్​ కూడా తన కుటుంబంతో అక్కడ సందడి చేస్తున్నారు. తాజాగా ఈ వివాహానికి సమంత, రష్మిక మందన్న, నాగ చైతన్య పయనమయ్యారు. మంగళవారం ఈ ముగ్గురూ వేర్వేరు సమయాల్లో హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కనిపించారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి.

మరోవైపు బుధవారం (నవంబర్ 1) మధ్యాహ్నం 2.48 గంటలకు వరుణ్- లావణ్య పెళ్లి బంధంతో ఒక్కటవనున్నారు. ఆ తర్వాత రాత్రికి అక్కడే ఓ వెడ్డింగ్ రిసెప్షన్ జరగనుంతి. ఇక ఈ వేడుకకు సుమారు 120 మందికిపైగా అతిథులు హాజరు కానున్నారని సమాచారం. ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత హైదరాబాద్​లో మరో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. పెళ్లికి హాజరుకాలేని సెలబ్రిటీలు ఈ ఫంక్షన్​కు రానున్నట్లు సమాచారం.

కాక్​టెయిల్​ పార్టీలో వారే హైలైట్​..
Varun Lavanya Cocktail Party : అక్టోబర్ 30 రాత్రి.. కాక్‌టెయిల్ పార్టీతో పెళ్లి వేడుకలు ప్రారంభమయ్యాయి. మెగా ఫ్యామిలీ, వారికి అత్యంత దగ్గరి బంధువులు ఈ కాక్​టెయిల్‌ పార్టీలో పాల్గొని సందడి చేశారు. తాజాగా దీనికి సంబంధించిన ఫొటోలు బయటకు వచ్చాయి. ఇందులో వరుణ్​, లావణ్య వైట్ కలర్ డ్రెస్​లో మెరవగా.. రామ్​చరణ్​ ఉపాసన వైట్ అండ్ బ్లాక్​ డ్రెస్​లో కనువిందు చేశారు. అల్లు అర్జున్, సాయిధరమ్​ తేజ్​ బ్లాక్​ కలర్ సూట్​లో స్టైలిష్​గా కనిపించారు. ఇక ఇవి చూసిన మెగా అభిమానులు వాటిని తెగ షేర్​ చేస్తూ #VarunLav హ్యాష్​ట్యాగ్​ను ఫుల్ ట్రెండ్ చేస్తున్నారు.

Varun Lavanya Marriage : మెగా హీరోస్ కాక్​టెయిల్ పార్టీ.. లుక్స్​ అదిరిపోయాయి.. మీరు చూశారా?

Varun Tej Lavanya Tripathi Wedding : ఆ ముహూర్తానికే వరుణ్​ - లావణ్య పెళ్లి ఎందుకో తెలుసా?.. ఇదే కారణం!

Last Updated : Nov 1, 2023, 6:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.