ETV Bharat / entertainment

పంత్ హెల్త్​పై ఊర్వశి రౌతేలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్​ - పంత్ హెల్త్​పై ఊర్వశి రౌతేలా

గతేడాది తీవ్ర రోడ్డు ప్రమాదానికి గురైన టీమ్‌ఇండియా యంగ్ వికెట్​ కీపర్​, బ్యాటర్​ రిషభ్ పంత్‌ ఆరోగ్య పరిస్థితిపై నటి ఊర్వశి రౌతేలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్​ చేసింది. ఆ సంగతులు..

Pant Urvasi rautela
పంత్ హెల్త్​పై ఊర్వశి రౌతేలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్​
author img

By

Published : Feb 18, 2023, 9:28 PM IST

గతేడాది తీవ్ర రోడ్డు ప్రమాదానికి గురైన టీమ్‌ఇండియా యంగ్ వికెట్​ కీపర్​, బ్యాటర్​ రిషభ్ పంత్‌ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. అభిమానులు, సహా క్రికెటర్లు, మాజీలు.. పంత్‌ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. అయితే కొద్ది కాలంగా ఇతడికి.. బాలీవుడ్‌ నటి ఊర్వశి రౌతేలా మధ్య వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఒకరినొకరు సోషల్​మీడియాలో విమర్శలు చేసుకుంటున్నారు. అయితే తాజాగా రిషభ్​పై ఆమె చేసిన కామెంట్స్​.. నెటిజన్లను ఆశ్చర్యపరుస్తున్నాయి. ఎందుకంటే ఆమె కూడా పంత్​ త్వరగా కోలుకోవాలని కోరుకుంది.

నేడు ముంబయి విమానాశ్రయంలో ఊర్వశి రౌతేలా కనిపించడంతో ఫొటోగ్రాఫర్లు ఆమెను రౌండప్​ చేసి ప్రశ్నల వర్షం కురిపించారు. సర్జరీ అనంతరం పంత్‌ నడుస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరలైన విషయం తెలిసిందే. ఆ వీడియో గురించి ఫొటోగ్రాఫర్లు ఆమె వద్ద ప్రస్తావించారు. "అతడు మన దేశానికి పెద్ద ఆస్తి. భారత్‌కు గర్వకారణం" అని పేర్కొంది. అతడు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను అని చెప్పింది. దీంతో నెటిజన్లు రౌతేలాకు సంబంధించిన వీడియోను ట్రెండ్ చేశారు.

కాగా, న్యూ ఇయర్​ సందర్భంగా తన ఫ్యామిలీకి సర్‌ప్రైజ్‌ ఇద్దామని ఒంటరిగా దిల్లీ నుంచి సొంత గ్రామానికి కారులో వెళ్లిన పంత్​.. దిల్లీ-దెహ్రాదూన్ హైవేపై రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. దీంతో వెంటనే అక్కడి స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించారు. దెహ్రాదూన్‌లోని మ్యాక్స్‌ హాస్పిటల్​లో అతడికి చికిత్స అందించారు. ఈ క్రమంలోనే అతడి కాలికి సర్జరీ కూడా చేశారు.

ప్రస్తుతం పంత్​ బీసీసీఐ వైద్య బృందం సారథ్యంలో ముంబయిలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడు కోలుకునేందుకు ఆరు నుంచి తొమ్మిది నెలలు పట్టే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. దీంతో పంత్‌ ఈ ఏడాది పాడు క్రికెట్​కు దూరమయ్యాడు. ఐపీఎల్​ కూడా అందుబాటులో ఉండట్లేదు. అయినా బీసీసీఐ అతడి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. అతడికి కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తోంది. అలాగే అతడు ఐపీఎల్ ఆడకపోయినా తన మెగా లీగ్ వేతం రూ.16 కోట్లు చెల్లించనుంది. అంతేకాదు సెంట్రల్ కాంట్రాక్ట్ శ్యాలరీ కూడా చెల్లించనుంది.

ఇదీ చూడండి: 'అంపైర్​ను అరెస్టు చేయండి'.. కోహ్లీ LBWపై నెటిజన్ల ఆగ్రహం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.