ETV Bharat / entertainment

'కేజీఎఫ్'​, 'కాంతార' స్ఫూర్తి.. కన్నడ నుంచి తొమ్మిది పాన్​ ఇండియా సినిమాలు!

author img

By

Published : Oct 26, 2022, 12:52 PM IST

కేజీఎఫ్..​ కన్నడ సినిమాపై ఉన్న కోణాన్ని పూర్తిగా మార్చేసింది. ఇటీవల విడుదలైన కాంతార కూడా కన్నడ సినిమాలపై ఆసక్తి పెంచుతోంది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి రాబోయే కన్నడ సినిమాలపైనే. ఈ క్రమంలోనే కన్నడ నుంచి పలు భారీ ప్రాజెక్టులు తెరకెక్కుతున్నాయి. వాటి విశేషాలు ఇవే..

up coming pan india kannada films
up coming pan india kannada films

ఒకప్పుడు భారతీయ సినిమా అంటే బాలీవుడ్​ వైపే చుసేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇండియన్ సినిమా అంటే రీజినల్​ భాషల్లో తెరకెక్కుతున్న భారీ సినిమాల వైపే చూస్తోంది సినీ జగత్తు. బాహుబలి దెబ్బతో రీజినల్​ సినిమా కాస్త ఇండియన్​ సినిమాగా మారిపోయింది. తెలుగు రేంజ్​ను బాహుబలి ఎలా మార్చిందో.. ​కన్నడ సినిమాల రేంజ్​ను 'కేజీఎఫ్'​ అలాగే చేసింది. తాజాగా వచ్చిన 'కాంతార' అద్భుత విజయం సాధించింది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి రాబోయే కన్నడ సినిమాలపైనే ఉంది. అయితే కన్నడలో భారీ స్థాయిలో తెరకెక్కుతున్న సినిమాలు ఇవే. ఓ లుక్కేయండి.

ప్రొడక్షన్ నంబర్​1

production number 1
ప్రొడక్షన్​ నంబర్ 1

కన్నడ సూపర్ స్టార్ శివరాజ్​ కుమార్ కథానాయకుడిగా యాక్షన్ థ్రిల్లర్​ తెరకెక్కుతోంది. ఈ సినిమాకు కార్తిక్ అద్వైత్​ దర్శకత్వం వహిస్తున్నారు. పాన్​ ఇండియా చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ వచ్చే ఏడాదిలో ప్రారంభం కానుంది. సుధీర్ చంద్ర పదిరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఏఏ04

aa04
ఏఏ04

కన్నడ నుంచి రాబోతున్న మరో పాన్ ఇండియా చిత్రం ఏఏ04. అభిషేక్​ అంబరీశ్ కథానాయకుడిగా మంచి యాక్షన్​ ఎంటర్​టైనర్​ జోనర్​లో ఈ చిత్రం రూపొందుతోంది. రాక్​లైన్ వెంకటేశ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రాఘవేంద్ర వి స్వరాలు సమకూర్చుతున్నారు.

వేధ

vedha
వేధ

కన్నడ సూపర్ స్టార్ శివరాజ్​ కుమార్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం 'వేధ'. పీరియాడికల్​ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో శివరాజ్​ కుమార్ సరసన గనవి లక్షణ్ లీడ్​ రోల్​లో నటిస్తోంది. ఉమశ్రీ, అధితి సాగర్, రఘు శివమొగ్గ, జగ్గప్ప, చెలువరాజ్. భరత్​ సాగర్, ప్రసన్న, వినయ్, సంజీవ్ తదితరులు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి అర్జున్ జన్య సంగీతం అందిస్తున్నారు. గీత శివరాజ్ కుమార్, జీ స్టుడియోస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

సప్తసాగరచ్చే ఎల్లో

saptasagarache ello
సప్తసాగరచ్చే ఎల్లో

కన్నడ నుంచి వస్తున్న మరో చిత్రం 'సప్తసాగరచ్చె ఎల్లో'. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను హేమంత్ ఎమ్ రావు డైరెక్ట్​ చేస్తున్నారు. రక్షిత్ శెట్టి, రుక్మిణి వసంత్ లీడ్ రోల్స్​ పోషిస్తున్నారు. ఈ సినిమాకు చరణ్ రాజ్ సంగీతం అందిస్తున్నారు. పుష్కర్ ఫిల్మ్స్​ బ్యానర్​పై పుష్కర మల్లికార్జునయ్య తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా 18 నవంబర్ 2022న విడుదలకు సిద్ధంగా ఉంది.

మార్టిన్

martin
మార్టిన్

మార్టిన్.. మంచి యాక్షన్ ఎంటర్​టైనర్​గా రూపొందుతున్న చిత్రం. ధ్రువ్​ సర్జా లీడ్ రోల్​ పోషిస్తున్న ఈ చిత్రానికి ఏపీ అర్జున్ దర్శకత్వం వహిస్తున్నారు. వైభవి షందిల్య లీడ్ రోల్ పోషిస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ సినిమాను ఉదయ్ కే మెహతా నిర్మిస్తున్నారు. ఈ సినిమా 18 నవంబర్ 2022 విడుదల అయ్యే అవకాశాలున్నాయి.

కాబ్జా

kanzaa
కాబ్జా

కన్నడతో పాటు తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఉపేంద్ర. అతడు లీడ్​ రోల్ పోషిస్తున్న చిత్రం కాబ్జా. ఈ సినిమాకు ఆర్​ చంద్రు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రియ శరన్, మురళి శర్మ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా 25 డిసెంబర్ 2022న విడుదలయ్యే అవకాసం ఉంది.

బిల్లా రంగా బాషా

billa ranga bhasha
బిల్లా రంగా బాషా

విలక్షణ నటుడు కిచ్చా సుదీప్​ నటిస్తున్న సినిమా బిల్లా రంగా బాషా. విక్రాంత్​ రోణ సినిమాకు దర్శకత్వ వహించిన దర్శకుడు అనూప్​ భండారి ఈ చిత్రానికి కూడా దర్శకత్వం వహిస్తున్నాడు.

క్రాంతి

kranthi
క్రాంతి

'క్రాంతి'.. యాక్షన్​ డ్రామాగా తెరకెక్కుతోంది. వి హరికృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. దర్శన్ లీడ్​ రోల్​లో నటిస్తున్న ఈ చిత్రానికి శైలజా నాగ్​ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ సినిమాను 25 డిసెంబర్ 2022న విడుదల చేయబోతున్నారని సమాచారం.

కేజీఎఫ్​-3

kgf 3
కేజీఎఫ్​ 3

సాధారణ చిత్రంగా విడుదలై.. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది కేజీఎఫ్​ చిత్రం. దీంతో కేజీఎఫ్​ పార్డ్​ 2పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగా పార్ట్​ 2 కూడా మంచి విజయం సాధించింది. అయితే కేజీఎఫ్​ ఫ్రాంచైజీ నుంచి వస్తున్న మరో పాన్ ఇండియా చిత్రం కేజీఎఫ్ 3. ఈ చిత్రం గురించి ఇంతవరకు అధికారికంగా సమాచారం లేదు. అయితే ఇంతకుముందు ఈ సినిమా షూటింగ్ ఆ ఏడాది డిసెంబర్​లో ప్రారంభవుతుందని కథనాలు వచ్చాయి. అధికారికంగా ఇంకా ఏ సమాచారం లేదు.

ఇవీ చదవండి : మేం డబ్బున్నోళ్లం కాదు ప్రతిభ ఉంటేనే అవకాశాలు వస్తాయి

'జల్లికట్టు' దర్శకుడితో మోహన్​లాల్.. ధనుష్‌ చిత్రంలో శివరాజ్​కుమార్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.