Upasana Old Age Homes: మెగా ఇంటి కోడలిగా ఓ మంచి గుర్తింపును సంపాదించుకున్నారు ఉపాసన కొణెదల. అపోలో హాస్పిటల్స్ పనుల్లో ఎంత బిజీగా ఉన్నా కూడా మెగా ఈవెంట్లలో మెరుస్తుంటారు. ఇక అవే కాకుండా ఉపాసన సామాజిక కార్యక్రమాల్లో ముందుంటారు. మూగజీవాల పరిరక్షణకూ పాటు పడుతుంటారు. ఆ మధ్య సోషల్ మీడియా వేదికగా ఆరోగ్య చిట్కాలను చెప్పుకొచ్చారు. ఆ తరువాత కరోనా సమయంలోనూ ఎంతో మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా సాయం చేశారు. అయితే ఇప్పుడు మెగా కోడలు చేస్తున్న ఓ మంచి పని గురించి వార్త బయటకు వచ్చింది.
ఉపాసన దాదాపు 150 ఓల్డ్ ఏజ్ హోమ్‌లకు సాయం చేస్తున్నారని తెలుస్తోంది. 'బిలియన్ హార్ట్స్ బీటింగ్' అనే ఫౌండేషన్‌తో కలిసి ఉపాసన ఈ గొప్ప కార్యక్రమాన్ని చేస్తున్నారు. తాజాగా వృద్ధులతో కలిసి సంతోషంగా సమయాన్ని గడుపుతున్న ఉపాసన ఫొటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఉపాసన అలవాట్ల విషయానికొస్తే.. ఆమె ఎక్కువగా సినిమాలు చూడరు. కాకపోతే తన భర్త రామ్‌చరణ్ చిత్రాలను ఓ అభిమానిలా ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తుంటారు. ఇక అప్పుడప్పుడు చెర్రీ షూటింగ్స్‌కు కూడా వెళ్తుంటారు. ఇక 'ఆర్ఆర్ఆర్' సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షోలో ఉపాసన చేసిన హంగామా అంతా ఇంతా కాదు. గాల్లోకి పేపర్లు ఎగిరేస్తూ రామ్‌చరణ్‌ను చూస్తూ మురిసిపోయారు.
ఇదీ చదవండి: మళ్లీ మొదలైన ప్రభాస్ 'ప్రాజెక్ట్ కె' షూటింగ్