ETV Bharat / entertainment

బాలయ్య 'అన్​స్టాపబుల్'​ సీజన్-2​ రెడీ.. ఫ్యాన్స్​లో ఫుల్​ జోష్​ - అన్​స్టాపబుల్​ విత్​ ఎన్​బీకే రెండో సీజన్​

Unstoppable with NBK talk show: ఓటీటీ ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్​ సంపాదించుకుంది బాలకృష్ణ 'అన్‌ స్టాపబుల్‌ విత్​ ఎన్​బీకే' టాక్​ షో. ఇటీవలే తొలి సీజన్​ పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం రెండో సీజన్​కు సన్నద్ధమవుతోంది.​ అయితే తాజాగా ఈ రెండో సీజన్​ ప్రారంభంపై అప్డేట్​ ఇచ్చింది ఓటీటీ ప్లాట్​ఫామ్​ ఆహా. ఆ వివరాలు..

unstoppable second season
బాలయ్య అన్​స్టాపబుల్​ సెకండ్​ సీజన్​
author img

By

Published : Jun 20, 2022, 12:43 PM IST

Unstoppable with NBK talk show: "అనిపించింది అందాం.. అనుకున్నది చేద్దాం.. ఎవరు ఆపుతారో చూద్దాం" అంటూ నందమూరి నటసింహం బాలకృష్ణ... తొలిసారిగా వ్యాఖ్యాతగా వ్యవహరించిన సెలబ్రిటీ టాక్‌ షో 'అన్‌ స్టాపబుల్‌ విత్​ ఎన్​బీకే'. 'ఆహా' ఓటీటీ వేదికగా ప్రసారమైన ఈ కార్యక్రమం 'మోస్ట్‌ వాచ్డ్‌ షో'గా అద్భుతమైన ప్రేక్షకాదరణ పొందింది. టాక్​ షోలలో నెం.1గా నిలిచింది. కార్యక్రమంలో పాల్గొన్న తారల ముచ్చట్ల కన్నా.. బాలయ్య సందడే ప్రేక్షకుల్ని విపరీతంగా అలరించింది. సెలబ్రిటీలతో బాలయ్య సరదా సంభాషణలకు, టైమింగ్‌కి ఆయన అభిమానులతోపాటు సామాన్య ప్రేక్షకులు కూడా ఫిదా అయిపోయారు. దీంతో బాలయ్య హోస్ట్​గా సూపర్​ క్రేజ్​ సంపాదించుకున్నారు. అయితే ఈ షో తొలి సీజన్​ పూర్తయినప్పటి నుంచి రెండో సీజన్ ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు.

అయితే తాజాగా ఈ రెండో సీజన్​ ప్రారంభంపై అప్డేట్​ ఇచ్చింది ఆహా. తెలుగు ఇండియన్​ ఐడల్​లో బాలయ్య అన్​స్టాపబుల్​ గురించి మాట్లాడుతూ.. "మధుర క్షణాలకు ముగింపు ఉండదు.. కొనసాగింపే" అంటూ అన్నారు. తాజాగా ఆ వీడియోను ఆహా షేర్​ చేసింది. "మీ ఫెవరెట్​, ఇండియాస్​ నెం.1టాక్​ షో రెండో సీజన్ త్వరలోనే ప్రారంభంకానుంది. గెస్టులుగా ఎవరిని ఆహ్వానిద్దాం?" అంటూ వ్యాఖ్య రాసుకొచ్చింది. ఆగస్టు 15న షోకు సంబంధించిన వివరాలను తెలియజేస్తామని చెప్పింది. దీంతో బాలయ్య ఫ్యాన్స్​ తెగ సంబరపడిపోతున్నారు.

  • Bigger, Better and Crazier.
    Your favourite and India's No.1 talk show returns with Season 2 #UnstoppableWithNBK coming soon!
    Who should we have on the show as guests? Comment below.🥳
    P.S: Crazy comments only (Think Unstoppable) 😉😉 pic.twitter.com/RS4o15vT8I

    — ahavideoin (@ahavideoIN) June 20, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

కాగా, ఈ షో ఇటీవలే ఓ ఘనత కూడా సాధించింది. బెస్ట్​ రీజనల్​ టీవీ ప్రోగ్రామ్​, బెస్ట్​ రీజనల్​ టీవీ రియాలిటీ షో ప్రోమో కెటగిరీల్లో.. రెండు సిల్వర్​ ట్రోఫీలను ముద్దాడింది. ​గోవా ఫెస్ట్​ 2022లో భాగంగా ప్రతిష్టాత్మకమైన అడ్వర్టైజింగ్​ అండ్​ మార్కెటింగ్​ అవార్డ్స్​ షో-అబ్బి వన్​ షో అవార్డ్స్ కార్యక్రమంలో వీటిని సొంతం చేసుకుంది. ప్రముఖ రేటింగ్​ సంస్థ ఐఎమ్​డీబీలోనూ రెండో స్థానంలో నిలిచింది.

ఇదీ చూడండి: బాలయ్య 'అన్​స్టాపబుల్'​ క్రేజ్​.. రెండు ప్రతిష్టాత్మక అవార్డులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.