1987లో కె.మురళీ మోహనరావు దర్శకత్వంలో మల్టీస్టారర్‌గా విక్టరీ వెంకటేష్, యాక్షన్ కింగ్ అర్జున్, నటకిరీటి రాజేంద్రప్రసాద్ హీరోలుగా కలిసి నటించిన చిత్రం త్రిమూర్తులు. శోభన, ఖుష్బు, అశ్వినీ హీరోయిన్స్. 1981లో విడుదలైన హిందీ చిత్రం నసీబ్‌కు రీమేక్‌గా 1987లో త్రిమూర్తులు విడుదలైంది యావరేజ్ టాక్‌ను దక్కించుకుంది.
అయితే నసీబ్ సినిమాలోని ఓ పాటలో బాలీవుడ్‌కు చెందిన టాప్ హీరోస్ అందరూ గెస్ట్ అప్పియరెన్స్‌లో కనిపించి ఫ్యాన్స్‌ను అలరించారు. అదే తరహాలోనే తెలుగు రీమేక్‌లోనూ టాలీవుడ్ టాప్ హీరోస్ ఓ సాంగ్‌లో కనిపించాలని నిర్మాత సుబ్బిరామిరెడ్డి భావించి 7 మంది హీరోలు, నలుగురు హీరోయిన్స్‌తో మాట్లాడి ఒప్పించారు. అలా 'త్రిమూర్తులు' చిత్రంలో ఒకే పాటలో ప్రముఖ స్టార్స్ అందరూ కనిపించిన ఆ పాటే.. 'ఒకే మాట, ఒకే బాట.. మతం లేదు.. కులం లేదు..'
ఈ పాటలో వెంకటేష్ తోపాటు శోభన్‌బాబు, విజయశాంతి, కృష్ణ, విజయనిర్మల, చిరంజీవి, రాధిక, కృష్ణం రాజు, రాధ, మురళీ మోహన్, శారద, బాలకృష్ణ, భానుప్రియ, నాగార్జున, సుమలత, చంద్రమోహన్, జయమాలిని లు కనిపిస్తారు. మొదటగా ఈ చిత్రంలో గెస్ట్ అప్పియరెన్స్ కోసం ఎన్టీఆర్, ఏఎన్ఆర్లను సంప్రదించారట. కానీ అది కుదరక వారి స్థానాల్లో బాలకృష్ణ, నాగార్జున కనిపించి అందరినీ ఆకట్టుకున్నారు. అప్పట్లో కేవలం ఈ పాటను చూడడానికే ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టేవారట.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: మహేశ్ బాబును పరామర్శించిన బాలయ్య