Tom cruise Mission Impossible 7 OTT Streaming : హాలీవుడ్ యాక్షన్ హీరో టామ్ క్రూజ్ అంటే దాదాపు సినీ ప్రియులకు అందరికీ తెలిసిన పేరే. యాక్షన్ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్. వరల్డ్ వైడ్‌గా భారీ సంఖ్యలో ఫ్యాన్స్‌ను సంపాదించుకున్న ఆయన 61 ఏళ్ల వయసులోనూ కళ్లు చెదిరే యాక్షన్ సీన్స్, అడ్వెంచర్స్‌తో అదరగొడుతుంటారు.
అయితే ఆయన నచించిన స్పెషల్ సిరీస్ మిషన్ ఇంపాజిబుల్ 7 డెడ్ రెకొనింగ్ : పార్ట్ 1 గతేడాది విడుదలై మంచి ఆదరణను దక్కించుకుంది. జులై 14, 2023న విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను అందుకుంది. రూ. 2389 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా రూ. 4600 కోట్లకు పైగా వసూళ్లను అందుకున్నట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. అంటే నిర్మాతలకు దాదాపుగా రూ. 2,333 కోట్ల లాభం వచ్చింది.
అయితే ఇప్పుడు యాక్షన్ ప్రియులను అమితంగా అలరించిన ఈ మిషన్ ఇంపాజిబుల్ 7 ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. వాస్తవానికి ఎప్పుడో ఓటీటీలోకి వచ్చిన ఈ భారీ చిత్రం ఇప్పటివరకు రెంటల్ విధానంలో మాత్రమే స్ట్రీమింగ్ అయింది. అంటే ఈ సినిమా చూడాలంటే కొంత డబ్బు చెల్లించాల్సి ఉండేది. కానీ ఇప్పుడు ఉచితంగా స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చింది.
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ మిషన్ ఇంపాజిబుల్ 7 సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను దక్కించుకుంది. శుక్రవారం (జనవరి 12) అర్ధరాత్రి నుంచే ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. ఇంగ్లిష్‌తో పాటు తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషలతో సహా మొత్తం 16 భాషల్లో స్ట్రీమింగ్ స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో టాప్ 10 స్థానంలో ట్రెండింగ్‌లో ఉంది. క్రిస్టోఫర్ మెక్ క్వారీ ఈ సినిమాను తెరకెక్కించారు. రెబెక్కా, సైమన్ పెగ్, వనేసా కొర్బీ, హెన్రీ చెర్నీ, ఇసై మోరల్స్, పోమ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. టామ్ క్రూజ్, దర్శకుడు క్రిస్టోఫర్ మెక్ క్వారీలే ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
'సైంధవ్' రివ్యూ - వెంకటేశ్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
'గుంటూరు కారం' ఓపెనింగ్స్ - ఆల్ టైమ్ రికార్డ్ - ఎన్ని కోట్లు వసూలు చేసిందంటే?