ETV Bharat / entertainment

SSMB 28 నుంచి సాలిడ్​ అప్డేట్​.. సినిమా రిలీజ్​ డేట్​ ఫిక్స్​ - ఎస్​ఎస్​ఎంబీ 28 మహేశ్​ బాబు న్యూ లుక్​

సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ కాంబోలో తెరకెక్కుతున్న SSMB 28కు సంబంధించిన ఓ సాలిడ్​ అప్డేట్​ను రిలీజ్​ చేసింది మూవీ టీమ్. ఇప్పటికే శరవేగంగా షూటింగ్​ జరుపుకుంటున్న ఈ సినిమా రిలీజ్​ డేట్​ను అనౌన్స్​ చేసి అభిమాలకు గుడ్​ న్యూస్​ తెలిపింది.

ssmb 28
mahesh babu
author img

By

Published : Mar 26, 2023, 8:32 PM IST

టాలీవుడ్​ సూపర్​ స్టార్​ మహేశ్​ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ SSMB28. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో దాదాపు 12 ఎళ్ల తర్వాత మహేశ్​ బాబు నటిస్తున్నారు. అయితే ఈ సినిమాపై అభిమానుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. కొంతమందేమో ఇది యాక్షన్ ఎంటర్టైనర్ అని అంటుంటే.. మరికొందరు ఈ మూవీ కచ్చితంగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని తేల్చి చెప్తున్నారు.

ఇక ఈ సినిమాలో మహేష్ ఈ సినిమాలో సాలిడ్ లుక్​లో కనిపించనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా కోసం భారీ అంచనాలతో ఎదురుచూస్తున్న ఫ్యాన్స్​ కోసం ఓ క్రేజీ అప్డేట్​తో ముందుకు వచ్చేసింది మూవీ టీమ్​. మూవీ రిలీజ్​ డేట్​ను ట్విట్టర్​ వేదికగా ఓ పోస్టర్​ ద్వారా ప్రకటించింది. ఆ పోస్టర్​లో అదిరిపోయే లుక్​లో కనిపించాడు మహేశ్​ బాబు. ఓ మిర్చి యార్డ్​లో సిగరెట్ తాగుతూ నడుచుకుంటూ స్టైలిష్​గా నడుస్తూ వస్తుంటారు. అందులోనే మూవీని వచ్చే ఏడాది సంక్రాంతికి అంటే జనవరి 13న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. అయితే మూవీ టీమ్​ ఈ సినిమాకు టైటిల్​ ఫిక్స్ చేయనట్లు తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం ఎస్ఎస్ఎంబీ 28 అనే వర్కింగ్ టైటిల్​తో రూపొందుతుంది. ఇక ఈ సినిమాలో మహేశ్​ బాబు సరసన పూజా హెగ్డే హీరోయిన్​గా నటిస్తున్నారు. మరోవైపు ఈ సినిమాలో యంగ్​ హీరోయిన్​ శ్రీ లీల ఓ కీలక పాత్రలో కనిపించనుంది. మ్యూజిక్​ డైరెక్టర్​ తమన్​ ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నారు.

అయితే ఈ సినిమాకు 'అడవిలో అర్జునుడు', 'ఆమె కథ', 'అమ్మ కథ' అనే టైటిల్స్​ను పరిశీలస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇక లేటెస్ట్​గా 'అమరావతికి అటు ఇటు' అనే టైటిల్​ను కూడా చూస్తున్నట్లు టాక్​. జూనియర్​ ఎన్టీఆర్​కు 'అర‌వింద స‌మేత'తో అల్లు అర్జున్‌కు 'అల వైకుంఠ‌పురం'తో క‌మ‌ర్షియ‌ల్ హిట్స్​ను అందించిన త్రివిక్ర‌మ్ ఇప్పుడు మ‌హేశ్​కు కూడా ఈ టైటిల్​తో మంచి హిట్​ ఇవ్వాలని భావిస్తున్నారట త్రివిక్రమ్​.

తాజాగా ఈ మూవీ టైటిల్​ను ఉగాది సందర్భంగా అధికారికంగా రిలీజ్‌ చేయనున్నారంటూ కూడా రూమర్స్​ స్ప్రెడ్​ అయ్యాయి. కానీ అదేం జరగలేదు. దీంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. మరో వైపు ఈ టైటిల్​ పోస్ట‌ర్‌ను శ్రీరామ న‌వ‌మి సందర్భంగా మార్చి 30న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోందట.అయితే ఈ తాజా అప్డేట్​ చూసిన ఫ్యాన్స్​ ప్రస్తుతం ఖుషీతో సంబరాలు చేసుకుంటున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.