ETV Bharat / entertainment

లెక్కలు మార్చేసి.. కొత్త ప్రాజెక్టులపై స్టార్స్ దృష్టి.. - ram charan latest news

కొవిడ్‌ విరామం కథానాయకులకు బాగా కలిసొచ్చింది. ఈ విరామంలో ప్రతి కథానాయకుడు రెండు మూడేళ్లకు సరిపడా కథలను ఓకే చేసి పెట్టుకున్నారు. వాటిలో కొన్ని ఇప్పటికే సెట్స్‌పైకి వెళ్లిపోయాయి. మరికొన్ని త్వరలో పట్టాలెక్కేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇక ఇప్పట్లో ఏ హీరోకీ కథల అవసరం లేదేమో అనిపించింది మొన్నటిదాకా. కానీ, ఇప్పుడు చిత్రసీమలో పలువురు కథానాయకుల సినీ ప్రణాళికలో మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన కొన్ని ప్రాజెక్ట్‌లపై అనిశ్చితి నెలకొన్నట్లు సమాచారం. దీంతో ఇప్పుడు వారి నుంచి మరో కొత్త కబురు వినపడనున్నట్లు వార్తలు జోరందుకున్నాయి. మరి లెక్క మార్చుకొని కొత్త కబురుతో కవ్విస్తున్న ఆ నాయకులు ఎవరు? వారి చిత్ర విశేషాలేంటి? చూసేద్దాం పదండి..

tollywood stars about their new project
tollywood stars about their new project
author img

By

Published : Sep 5, 2022, 7:49 AM IST

tollywood stars about their new project : సినిమా పట్టాలెక్కింది మొదలుకుని.. విడుదలయ్యే వరకు చిత్రసీమలో ప్రతి వ్యవహారం గొలుసుకట్టులా సాగుతుంటుంది. వీటిలో ఏ దశలోనైనా సరే.. ఒక్క చిత్రం అటు ఇటు అయినా మిగతా ప్రాజెక్ట్‌లపైన ఆ ప్రభావం గట్టిగా పడుతుంది. కొన్నిసార్లు పట్టాలెక్కించిన చిత్రాల్ని కూడా పక్కకు పెట్టెయ్యాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ సినీ ప్రణాళికలో ఇలాంటి మార్పులే కనిపిస్తున్నాయి. 'లైగర్‌' విడుదలకు ముందే పూరి జగన్నాథ్‌తో రెండో సినిమాగా 'జనగణమన'ను పట్టాలెక్కించారు విజయ్‌. కానీ, ఇటీవల విడుదలైన 'లైగర్‌' దారుణ ఫలితాన్ని అందుకోవడంతో.. 'జనగణమన'ను ప్రస్తుతానికి పూర్తిగా పక్కకు పెట్టినట్లు సమాచారం.

దీంతో ఇప్పుడు విజయ్‌ తర్వాతి చిత్రం కోసం కథా చర్చలు మళ్లీ షురూ అయినట్లు తెలిసింది. విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో 'ఖుషి' చిత్రం చేస్తున్నారు. ఇది ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీని తర్వాత ఆయన సుకుమార్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది. అయితే సుకుమార్‌ 'పుష్ప2' పూర్తి చేశాక కానీ విజయ్‌తో రంగంలోకి దిగే పరిస్థితి లేదు. దీనికి మరింత సమయం పట్టే అవకాశముంది. కాబట్టి ఈ గ్యాప్‌లో విజయ్‌ దేవరకొండతో దిల్‌రాజు ఓ సినిమా నిర్మించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు సమాచారం. ఇప్పుడీ ప్రాజెక్ట్‌ కోసం మోహనకృష్ణ ఇంద్రగంటి, గౌతమ్‌ తిన్ననూరి వంటి దర్శకుల పేర్లు పరిశీలిస్తున్నట్లు ప్రచారం వినిపిస్తోంది. మరి వీరిలో ఎవరితో ప్రాజెక్ట్‌ సెట్టవుతుందో వేచి చూడాలి.

చిరు పునరాలోచన..
మునుపెన్నడూ లేనంత వేగంగా వరుస సినిమాలతో జోరు చూపిస్తున్నారు చిరంజీవి. ప్రస్తుతం ఆయన నటించిన 'గాడ్‌ ఫాదర్‌' విడుదలకు సిద్ధమవుతుండగా.. 'భోళా శంకర్‌', బాబీ దర్శకత్వంలో చేస్తున్న సినిమా సెట్స్‌పై ముస్తాబవుతున్నాయి. వీటి తర్వాత యువ దర్శకుడు వెంకీ కుడుములతో ఓ చిత్రం చేయనున్నట్లు చిరు ఇది వరకే ప్రకటించారు. అయితే ఇప్పుడీ ప్రాజెక్ట్‌ను పక్కకు పెట్టారని సమాచారం. 'ఆచార్య' ఇచ్చిన చేదు ఫలితంతో చిరు కథల ఎంపికలో పునరాలోచనలో పడ్డారని, ప్రస్తుతం చేతిలో ఉన్న మూడు చిత్రాలు పూర్తి చేశాకే తదుపరి సినిమాపై దృష్టి సారించాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఇప్పటికైతే చిరు కోసం కథలు సిద్ధం చేసి పెట్టుకున్న దర్శకుల జాబితా చాలా పెద్దదే ఉంది. చిరంజీవి కూడా ఇప్పటికే తాను ఓ అరడజను కథలు ఓకే చేసి పెట్టుకున్నట్లు గతంలో ప్రకటించారు. మరి వీటిని తెరకెక్కించనున్న ఆ దర్శకులెవరు? ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తాయి? అన్నది తేలాల్సి ఉంది.

బన్నీ ఆలోచన ఏంటి?
'పుష్ప'తో పాన్‌ ఇండియా స్టార్‌గా మారిపోయారు కథానాయకుడు అల్లు అర్జున్‌. ఈ చిత్ర విజయంతో ఆయన క్రేజ్‌ జాతీయ స్థాయిలో అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడాయన 'పుష్ప2' కోసం రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. వచ్చే నెల నుంచి రెగ్యులర్‌ చిత్రీకరణ మొదలు కానున్నట్లు ప్రచారం వినిపిస్తోంది. అయితే ఈ సినిమా పూర్తయిన వెంటనే బన్నీ చేయనున్న చిత్రమేదన్నది ఇంత వరకు తేలలేదు. ప్రస్తుతం ఆయనతో సినిమా చేసేందుకు పలువురు దర్శకులు కథలు సిద్ధం చేసి పెట్టుకున్నట్లు తెలిసింది. వేణు శ్రీరామ్‌ 'ఐకాన్‌'తో పాటు కొరటాల శివ చిత్రాలపై గతంలోనే ప్రకటనలు వచ్చేశాయి. ఇప్పుడీ జాబితాలో బోయపాటి శ్రీను, మురుగదాస్‌, ప్రశాంత్‌ నీల్‌తో పాటు పలువురు బాలీవుడ్‌ దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి. మరి వీళ్లలో బన్నీ తొలుత ఎవరికి అవకాశమిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అల్లు అర్జున్‌ ప్రస్తుతం పాన్‌ ఇండియా ఇమేజ్‌కు తగ్గ కథల్ని వెతికి పట్టుకునే పనిలో ఉన్నారని.. తన కొత్త ప్రాజెక్ట్‌పై దసరా నాటికి స్పష్టత ఇచ్చే అవకాశముందని సమాచారం.

చరణ్‌కూ తప్పదా?
ఇటీవలే 'ఆర్‌ఆర్‌ఆర్‌', 'ఆచార్య' చిత్రాలతో బాక్సాఫీస్‌ ముందు సందడి చేశారు రామ్‌చరణ్‌. ప్రస్తుతం ఆయన శంకర్‌ దర్శకత్వంలో ఓ పాన్‌ ఇండియా చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది పూర్తయిన వెంటనే చరణ్‌.. గౌతమ్‌ తిన్ననూరితో ఓ సినిమా చేయాల్సి ఉంది. దీన్ని ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. కానీ, ఇప్పుడీ సినిమా ఆగిపోయిందని టాక్‌. ఇదే సమయంలో చరణ్‌ నుంచి మరో కొత్త కబురు బయటకు రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం యువీ క్రియేషన్స్‌ సంస్థ చరణ్‌ కోసం తమిళ దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌తో ఓ సినిమా సెట్‌ చేసే పనిలో ఉందని ప్రచారం వినిపిస్తోంది. ఈ విషయమై ఇప్పటికే చర్చలు మొదలయ్యాయని.. త్వరలో మరింత స్పష్టత వచ్చే అవకాశముందని కోలీవుడ్‌ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.

ఇదీ చదవండి:
'బ్రహ్మాస్త్ర' మేకింగ్​ వీడియో విడుదల.. తెర వెనక కష్టమిదీ

'లైగర్‌' మూవీ ఎఫెక్ట్‌.. నిర్మాత ఛార్మి షాకింగ్‌ నిర్ణయం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.