ETV Bharat / entertainment

Venkatesh About Rana Naidu : 'అందరినీ మెప్పించడం కూడా కష్టమే' - అహింస మూవీ లేటెస్ట్ అప్డేట్స్

ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్​ఫ్లిక్స్​లో స్ట్రీమ్​ అవుతున్న రానా నాయుడు వెబ్​సిరీస్​ పై వస్తున్న కాంట్రవర్సీలపై స్పందించారు విక్టరీ వెంకటేశ్​ తాజాగా 'అహింస' మూవీకి సంబంధించిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న ఆయన.. ఈ వెబ్‌సిరీస్‌పై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

Rana Naidu web series Controversy
venkatesh First Response To Rana Naidu web series Controversy
author img

By

Published : May 31, 2023, 7:08 AM IST

Venkatesh About Rana Naidu : ఇటీవలే ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్​ఫ్లిక్స్​లో విడుదలైన పాపులర్​ వెబ్​సిరీస్​ రానా నాయుడు పై ప్రేక్షకుల నుంచి వస్తున్న విమర్శల పై టాలీవుడ్​ స్టార్ హీరో​ విక్టరీ వెంకటేశ్​ స్పందించారు. ఈ సీరిస్ ​లోని కొన్ని సన్నివేశాలు, తీసిన విధానం కొందరిపై ప్రభావం చూపిన మాట వాస్తవమేనని ఆయన అన్నారు. రానాతో కలిసి ఆయన నటించిన యాక్షన్‌ క్రైమ్‌ డ్రామా ఇది. ఈ సిరీస్‌ చూసి, చాలా మంది అవాక్కయ్యారు. కుటుంబ కథానాయకుడిగా వెంకటేశ్‌ను చూసిన అభిమానులు ఒక్కసారిగా షాక్​కు గురైయ్యారు.

ఇందులోని చాలా సన్నివేశాల్లో అసభ్యపదజాలం, శ్రుతిమించిన శృంగార సన్నివేశాలు ఉండటం వల్ల సామాజిక మాధ్యమాల వేదికగా విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఈ వ్యవహారంపై ఇప్పటికే రానా స్పందించగా.. తాజాగా వెంకటేశ్‌ తొలిసారి మాట్లాడారు. దగ్గుబాటి ఇంటి వారసుడైన అభిరామ్‌ దగ్గుబాటి హీరోగా తెరకెక్కుతున్న 'అహింస' మూవీ ప్రమోషన్స్​లో పాల్గొన్న ఆయన.. అందులో భాగంగా జరిగిన విలేకరుల సమావేశంలో ఈ విషయంపై స్పందించారు.

Rana Naidu Web Series : 'రానా నాయుడు'పై వచ్చిన నెగెటివ్‌ ఫీడ్‌ బ్యాక్‌పై మీ స్పందన ఏంటి? అని ఓ విలేకరి అడగ్గా.. అందుకు సమాధానం చెప్పేందుకు మొదట వెంకటేశ్‌ ఆసక్తి చూపలేదు. ఇది సరైన వేదిక కాదని, దీని గురించి ఇంకొకసారి మాట్లాడుకుందామని దాటవేసేందుకు ప్రయత్నించారు. అయితే మరొకసారి విలేకరి ప్రశ్నించగా.. ఇక తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

"రానా నాయుడు సిరీస్‌పై నెట్‌ఫ్లిక్స్‌ చాలా సంతోషంగా ఉంది. చాలా మంది ప్రేక్షకుల నుంచి ఫీడ్‌ బ్యాక్‌ కూడా వచ్చింది. జరిగిన దాని గురించి ఆలోచిస్తూ కూర్చోవడం కన్నా ముందుకు వెళ్లిపోవడమే మంచిదని నేను ఎంతగానో నమ్ముతాను. తర్వాతి సీజన్‌ అందరికీ నచ్చేలా తప్పకుండా తీర్చిదిద్దుతాం. అలాగని అందరినీ మెప్పించడం కూడా కష్టమే అని చెప్పలి. ఒక విషయమైతే చెప్పగలను. ఫస్ట్‌ సీజన్‌లో కొన్ని సన్నివేశాలు, వాటిని తీసిన విధానం ప్రభావం చూపిన మాట వాస్తవం. అయితే, మొదటి సీజన్‌తో పోలిస్తే రెండో సీజన్‌కు కచ్చితంగా ప్రేక్షకులు పెరుగుతారు. ఈ సిరీస్​ను ఎంతగానో ఆదరిస్తారు. చూద్దాం అందరికీ నచ్చేలా ఉత్తమమైన కంటెంట్‌ ఇవ్వడానికి మేము కూడా ప్రయత్నిస్తాం" అని వెంకటేశ్‌ అన్నారు.

అలాగే నంది అవార్డుల పైనా కూడా ఆయన ఈ వేదికగా స్పందించారు. అవార్డుల గురించి తాను ఎక్కువ ఆలోచించనని అన్నారు. అయితే, అవార్డులు ఇస్తే ప్రతి నటుడికీ ప్రోత్సాహంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. అభిరామ్‌ నటించిన 'అహింస' సినిమా మంచి విజయాన్ని అందుకోవాలని ఈ సందర్భంగా వెంకటేశ్‌ ఆకాంక్షించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.