ETV Bharat / entertainment

Comedian Sunil Tamil movie offers : సునీల్ వెంటపడుతున్న కోలీవుడ్ బ్యాచ్​.. వామ్మో ఎన్ని సినిమాలు చేస్తున్నారో? - రజనీకాంత్​ జైలర్ సినిమా ఆఫర్స్​

Comedian Sunil Tamil movie offers : టాలీవుడ్ సీనియర్ స్టార్ కమెడియన్​ సునీల్​కు కోలీవుడ్​లో క్రేజ్ పెరుగుతోంది. ఆయనకు వరుసగా తమిళ సినిమా ఆఫర్స్ వస్తున్నాయి. ఆయన చేతిలో ఎన్ని తమిళ చిత్రాలు ఉన్నాయంటే?

Comedian Sunil Tamil movie offers
సునీల్ వెంట కోలీవుడ్ దర్శకనిర్మాతలు
author img

By

Published : Aug 15, 2023, 7:56 PM IST

Comedian Sunil Tamil movie offers : హాస్య నటుడిగా కెరీర్ ప్రారంభించి స్టార్ కమెడియన్​గా ఎదిగిన సునీల్​.. ఆ మధ్య హీరోగా ఒకట్రెండు విజయాలను అందుకున్నారు. ఆ తర్వాత మళ్లీ క్యారెక్టర్ ఆర్టిస్ట్​గా, విలన్​గా రాణిస్తూ విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా ఇప్పుడు ఆయన కెరీర్​ మంచి స్పీడ్​లో దూసుకెళ్తోంది. చిన్న సినిమాలతో పాటు పాన్ ఇండియా సినిమాల్లోనూ నటిస్తున్నారు.

ముఖ్యంగా తెలుగు సినిమాలతో పాటు సునీల్​ ఎక్కువగా కోలీవుడ్ ఇండస్ట్రీలోనూ జోరు చూపిస్తున్నారు. ఆయనకు ఎక్కువగా తమిళ సినిమా ఆఫర్స్​ వస్తున్నాయి. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్​హిట్​తో దూసుకెళ్తున్న 'జైలర్'లో సునీల్(jailer movie sunil) వేసిన డంబ్ హీరో రోల్​ బాగా క్లిక్ అయింది. సెకండాఫ్ ఆయన కామెడీ బాగుందని అంటున్నారు. ఆయన పాత్రను ఆడియెన్స్​ బాగా ఎంజాయ్ చేస్తున్నారట.

ఇకపోతే జైలర్ కన్నా ముందు వచ్చిన శివకార్తికేయన్ మహావీరుడులో ఓ మంత్రికి సెక్రెటరిగా కనిపించి ఆకట్టుకున్నారు. అందులో కూడా ఆయన నటన బానే ఉందని చెబుతున్నారు. కాస్త కామెడీ నెగటివ్​ టచ్​ ఉన్న పాత్రలో కనిపించారు. ఇక త్వరలోనే సెప్టెంబర్ 15న రిలీజ్ కాబోతున్న విశాల్ మార్క్ ఆంటోనీలో ఆయన నటించారు. ఇది కూడా మంచి పాత్ర అని చెన్నై టాక్ వినిపిస్తోంది.

అలానే మరిన్ని తమిళ సినిమాల్లో సునీల్ నటిస్తున్నారు. లారెన్స్ తమ్ముడు ఎల్విస్ హీరోగా రూపొందనున్న బుల్లెట్ చిత్రంలోనూ సునీల్​కు మంచి క్రేజీ ఆఫర్ వచ్చింది. ఈ చిత్రంతో తెలుగమ్మాయి వైశాలి రాజ్ హీరోయిన్​గా పరిచయం అవుతోంది. ఇన్నసి పాండియన్ దర్శకత్వంలో రానున్న ఈ సినిమాలో లారెన్స్​ కూడా క్యామియో రోల్​ పోషిస్తున్నారు. లా కాలేజీ బ్యాక్ డ్రాప్​లో ఇది రూపొందనుందట. ఇంకా హీరో కార్తీ దొంగగా నటిస్తున్న కొత్త సినిమా 'జపాన్'లోనూ సునీల్ నటిస్తున్నారు. దీంతోపాటే ఈగై అనే మరో తమిళ చిత్రంలోనూ కనిపించనున్నారు. అలాగే శంకర్ తీసున్న గేమ్​ ఛేంజర్​లోనూ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇలా వరసుగా తమిళ సినిమాల్లో నటిస్తూ అక్కడి ప్రేక్షకులకు దగ్గరవుతున్నారు.

మాస్​ మహారాజా ర‌వితేజ రుణం తీర్చుకున్న సునీల్!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్​కు సునీల్‌ కండీషన్‌. ఏంటంటే..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.