ETV Bharat / entertainment

పుష్ప-2 ఆడియో రైట్స్​కు రికార్డు ధర.. పాటలకే అన్ని కోట్లా? - పుష్ప 2 ఆడియో హక్కులు 65 కోట్లు

'పుష్ప ది రూల్' కు సంబంధించి ఆడియో హక్కులను 'టీ సిరీస్' పోటీపడి మరీ కొనుగోలు చేసింది. ఇప్పుడు ఈ విషయం ఫిల్మ్​ ఇండస్ట్రీలో హాట్​ టాపిక్​గా మారింది. ఇంతకూ టీసిరీస్ ఎంతకు కొనుగోలు చేసిందంటే?

pushpa the rule audio rights
pushpa the rule audio rights
author img

By

Published : May 3, 2023, 10:06 PM IST

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 'పుష్ప ది రైజ్'​ బ్లాక్​బస్టర్​ హిట్​గా నిలిచింది. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. ఇక త్వరలో 'పుష్ప ది రూల్' థియేటర్లలోకి రానుంది. పుష్ప ది రైజ్ బ్లాక్​బస్టర్​ అయ్యేందుకు బ్యాక్​ గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్​​ ఎంతగానో తోడ్పడ్డాయి. ప్రస్తుతం పుష్ప ది రూల్ ఆడియో హక్కుల కోసం ఆయా ఫిల్మ్ ఇండిస్ట్రీల్లో పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో.. టీ సిరీస్‌ రూ.65కోట్లకు మూవీ ఆడియో రైట్స్‌ను దక్కించుకుందనే టాక్ వినిపిస్తోంది. అయితే ఈ లెక్కన దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి ది కంక్లూజన్​, ఆర్​ఆర్ఆర్​ల మ్యూజిక్​ రైట్స్​ కంటే ఇది అత్యధికం. దీంతో మరోసారి పుష్పరాజ్ ఫిల్మ్​ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యారు.

మ్యూజిక్ రైట్సే ఇంత ధరకు అమ్ముడైతే సినిమా ఏ రేంజ్​లో కలెక్షన్లు కొల్లగొడుతుందో అని నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. ఇక ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్​గా నటిస్తున్నారు. ఫహద్ ఫాసిల్, అనసూయ భరద్వాజ్​, సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది.

'పుష్ప ది రైజ్​' సినిమాతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్​కు పాన్ ఇండియా వైడ్​గా ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఈ సినిమా రాకముందు వరకు సౌత్ ఆడియెన్స్​ మాత్రమే ఆయన సినిమా అప్డేట్స్​ కోసం ఆసక్తిగా ఎదురుచూసేవారు. కానీ ఇప్పుడు అంతా మారిపోయింది. ఆయన సినిమాల అప్డేట్స్​ కోసం సౌత్​ టు నార్త్ ఆల్​ ఓవర్​ ఇండియాలోని​ ప్రతి ఒక్క సినీ అభిమాని ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా 'పుష్ప ది రైజ్​' సినిమా సంచలనం సాధించిడం వల్ల.. అభిమానులు ఈ చిత్ర సీక్వెల్​ కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. 'పుష్ప ది రూల్​​' హిందీ వెర్షన్​లో రిలీజైన గ్లింప్స్​ వీడియో ఏకంగా 69 మిలియన్ల వ్యూస్​ ​దాటేసింది.

గ్లింప్స్​ వీడియోలో ఏముంది...
'పుష్ప ది రూల్​​' మూడు నిమిషాల నిడివి ఉన్న సినిమా టీజర్‌లో గొడవలు, పుష్ప మాస్‌ మాత్రమే ఎంట్రీ ఉంది. దాన్ని చూస్తుంటే పోలీసుల చెర నుంచి తప్పించుకున్న పుష్పరాజ్‌ అజ్ఞాతంలోకి వెళ్లిపోయి తిరిగి వస్తాడన్న సంగతి తెలుస్తోంది. అయితే హీరోయిన్‌ శ్రీవల్లి ప్రస్తావన ఎక్కడా రాలేదు. ఆమెకు సంబంధించి కనీసం ఒక్క సన్నివేశం కూడా వీడియోలో లేదు. ఇకపోతే గతంలో సెకండ్​ పార్ట్​లో శ్రీవల్లి పాత్ర చనిపోతుందని, ఇక ఉండదని ప్రచారం సాగింది. అయితే ఇప్పుడు మళ్లీ ఆ ప్రచారం తెరపైకి వచ్చింది. ఈ సీక్వెల్​లో రష్మిక పాత్రను కాసేపు చూపించి తర్వాత చచ్చిపోయేలా చూపిస్తారని అంటున్నారు. అలా శ్రీవల్లి మరణానికి ప్రతీకారం తీర్చుకోవడం చుట్టే 'పుష్ప ది రూల్​​' సినిమా ఉండనుందని నెటిజన్లు ఎక్స్​పెక్ట్​ చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.