Producer Narayan Das Narang died: తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు నారాయణదాస్ కె.నారంగ్ కన్నుమూశారు. 78 ఏళ్ల వయస్సున్న ఆయన కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని స్టార్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన తుదిశ్వాస విడిచారు. కాగా, టాలీవుడ్లో ఎనలేని గుర్తింపు తెచ్చుకున్న నారంగ్ హఠాన్మరణం పట్ల చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. పలువురు సినీ ప్రముఖులు, నిర్మాతలు, పంపిణీదారులు ఆయన కుటుంబానికి సానుభూతి తెలుపుతున్నారు.
ఏషియన్ సంస్థల అధినేతగా, నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా, ఫైనాన్షియర్‌గా సినీ పరిశ్రమతో సుదీర్ఘకాలంగా అనుబంధం ఉన్న నారాయణదాస్ నారంగ్... ఇటీవల శ్రీ వేంకటేశ్వర బ్యానర్‌లో నాగచైతన్యతో 'లవ్ స్టోరీ', నాగశౌర్యతో 'లక్ష్య' సినిమాలను నిర్మించారు. ప్రస్తుతం నాగార్జున కథానాయకుడిగా ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో 'ఘోస్ట్' అనే చిత్రంతోపాటు తమిళ నటుడు ధనూష్తో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో మరో చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇదీ చూడండి: ఈ వారం థియేటర్/ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాలివే!