ETV Bharat / entertainment

'వేగం ఎక్కువైతే ఆగం అవుతావు కాకా'.. 'మామా మశ్చీంద్ర'గా అదరగొట్టిన సుధీర్ బాబు​!​ - మామా మశ్చీంద్ర సినిమా రిలీజ్​ డేట్​

టాలీవుడ్​లో చాక్లెట్​బాయ్​ హీరో సుధీర్​ బాబు.. మామా మశ్చీంద్ర అనే ఎక్స్​పెరిమెంటల్​ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా టీజర్​ ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటోంది. మీరు కూడా చూసేయండి.

sudheer-babu-mama-mascheendra-movie-teaser

author img

By

Published : Apr 22, 2023, 12:47 PM IST

టాలీవుడ్​లో చాక్లెట్​బాయ్​గా పేరొందిన స్టార్ హీరో సుధీర్​ బాబు.. 'మామా మశ్చీంద్ర' అనే ఎక్స్​పెరిమెంటల్​ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. శనివారం ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదల అయ్యింది. ఆ టీజర్​ను సుధీర్​ బావ సూపర్​ స్టార్​ మహేశ్​ బాబు లాంఛ్​​ చేశారు. "దేవుడు అడిగాడట నన్ను చేరడానికి ఏడు జన్మలు భక్తుల్లా బతుకుతారా? లేక మూడు జన్మలు రాక్షసుల్లా బతుకుతారా? అని.. మీకు దూరంగా ఉండటం కన్నా మూడు జన్మలు రాక్షస జన్మే మిన్న అని దేవతలే కోరుకున్నారట" అనే డైలాగ్​తో స్టార్ట్​ అయిన ఈ టీజర్​ ఆద్యంతం వీక్షకులను తెగ ఆకట్టుకుంటోంది. హైవోల్టేజ్ యాక్షన్ సీన్స్​తో ఓ రేంజ్​లో ఉన్న ఈ టీజర్​లో అటు సీరియస్​తో పాటు ఇటు ఫన్నీ డైలాగ్స్ కూడా​ ఉన్నాయి. అంతే కాకుండా టీజర్​లోని పలు డైలాగ్స్​కు అభిమానులు బాగా కనెక్టయ్యారు.

గత కొంత కాలంగా వైవిధ్యభరితమైన స్టోరీలపై ఫోకస్​ చేస్తున్న ఈ స్టార్​ హీరో.. ఇప్పుడు ఈ సినిమాతో ఆడియన్స్​ ముందుకు రానున్నారు. హర్షవర్ధన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సుధీర్​ మూడు ఢిఫరెంట్​ లుక్స్​లో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఒకదాంట్లో సుధీర్ బాబు సిక్స్ ప్యాక్ లుక్​లో కనపడగా.. ఇంకోదాంట్లో ఊబకాయం ఉన్న దుర్గలా, వృద్ధుడైన పరశురామ్​గా కనిపించారు. ఈ పోస్టర్లన్నింటికీ మంచి రెస్పాన్స్​ వచ్చింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇక ఈ సినిమాలో సుధీర్ బాబుకు సరసన ఈషా రెబ్బా, మృణాళిని రవి నటిస్తున్నారు. శ్రీవెంకటేశ్వర సినిమాస్‌, ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై సునీల్‌ నారంగ్‌, పుస్కుర్ రామ్‌ మోహన్‌ రావు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చైతన్య భరద్వాజ్‌ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు.

ఇటీవలే 'హంట్ 2' సినిమాతో థియేటర్లలోకి వచ్చిన చాక్లెట్​ బాయ్​ సుధీర్​ బాబు ఈ సినిమాతో ఆశించిన స్థాయిలో హిట్​ను అందుకోలేకపోయారు. 'ప్రేమ కథా చిత్రమ్' సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈ స్టార్​ హీరో ఈ సినిమాతో మంచి హిట్​ను తన ఖాతాలో వేసుకున్నారు. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినప్పటికీ ఆ సినిమాలన్నీ బాక్సాఫీస్​ వద్ద మంచి టాక్​ను అందుకోలేకపోయాయి. అప్పట్లో వచ్చిన 'సమ్మోహనం' తర్వాత మళ్లీ ఆ రేంజ్​ హిట్​ను అయితే అందుకోలేకపోయారు. అయితే 'శ్రీదేవి సోడా సెంటర్' సినిమాతో మాత్రం కొంత మేర అభిమానులను ఆకర్షించారు. ఇప్పుడు ఈ మామ మశ్చీంద్ర సినిమాతో మళ్లీ ఫామ్​లోకి రావాలని ఆశిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.