ETV Bharat / entertainment

Raviteja Tiger Nageswarao Teaser : 'టైగర్‌ నాగేశ్వరరావు' వచ్చేశాడు.. 8 ఏళ్లకే రక్తం తాగిన క్రిమినల్​గా.. - రవితేజ టైగర్‌ నాగేశ్వరరావు టీజర్ రిలీజ్​

Raviteja Tiger Nageswarao Teaser : మాస్​ మహారాజా రవితేజ నటిస్తున్న సినిమా 'టైగర్‌ నాగేశ్వరరావు' టీజర్ విడుదలై ఆకట్టుకుంటోంది. మీరు చూశారా..

Raviteja Tiger Nageswarao Teaser
టైగర్ నాగేశ్వరరావు టీజర్ రిలీజ్​
author img

By

Published : Aug 17, 2023, 4:35 PM IST

Updated : Aug 17, 2023, 10:13 PM IST

Raviteja Tiger Nageswarao Teaser : మాస్​ మహారాజా రవితేజ నటిస్తున్న సినిమా 'టైగర్‌ నాగేశ్వరరావు'. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా మూవీ టీజర్‌ను మూవీ మేకర్స్.. గురువారం రిలీజ్ చేశారు. ఈ సినిమాలో టైగర్‌ నాగేశ్వరరావు చాలా తెలివైన వాడని చూపించారు. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు అభిమానులను విపరీతంగా ఆకట్టుకోగా.. ఇప్పుడు ఈ టీజర్‌ అంచనాలను రెట్టింపు చేసింది. కాగా ఈ చిత్రాన్ని దర్శకుడు వంశీ.. స్టువర్టుపురం టైగర్‌ నాగేశ్వరరావు బయోపిక్​ ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. అయితే డైరెక్టర్​గా వంశీకి ఇదే తొలి సినిమా కావడం విశేషం.

హైదరాబాద్, ముంబయి, దిల్లీ నగరాల్లో దారుణంగా దోపిడీలు చేసిన స్టువర్టుపురం దొంగ మద్రాస్​ సెంట్రల్ జైలు నుంచి తప్పించుకున్నాడు అంటూ టీజర్ ప్రారంభమౌతుంది. నాగేశ్వర్​రావు పాలిటిక్స్​లోకి వెళ్లి ఉంటే తెలివితేటలతో ఎలక్షన్ గెలిచేవాడు. స్టోర్ట్స్​లోకి వెళ్లి ఉంటే .. పరుగుతో ఇండియాకు మెడల్ తెచ్చెవాడు. ఆర్మీలోకి వెళ్లి ఉంటే వాడి ధైర్యంతో ఒక యుద్ధాన్ని గెలిచేవాడు. కానీ అన్​ఫార్య్చునేట్లీ వాడు ఒక దొంగ అయ్యాడంటూ.. మురళీ శర్మ ఇచ్చిన ఎలివేషన్ సినిమాపై అంచనాలు పెంచుతోంది. అలాగే పులి, సింహం లాంటి జంతువులు కూడా ఓ వయసు దాకా పాలు తాగుతాయి. కానీ వీడు (టైగర్ నాగేశ్వరరావు) ఎనిమిదేళ్లకే రక్తం తాగడం మొదలు పెట్టాడు అనే డైలాగ్ టీజర్​కు హైలైట్​గా నిలిచింది.

Raviteja Tiger Nageswarao Cast : అయితే ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ అభిషేక్ పిక్చర్స్ బ్యానర్​పై అభిషేక్​ అగర్వాల్ నిర్మిస్తున్నారు. రవితేజకు జంటగా గాయత్రీ భరద్వాజ్, నుపూర్ సనన్ కథానాయికలుగా నటిస్తున్నారు. కశ్మీర్ ఫైల్స్ ఫేమ్ సీనియర్ బాలీవుడ్ నటుడు అనుపమ్​ ఖేర్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. మురళీ శర్మ, రేణు దేశాయ్ కీలక పాత్రల్లో మెరవనున్నారు. కాగా తమిళంలో ఈ సినిమాకు హీరో కార్తీ తన వాయిస్ ఇచ్చారు. ఇక ఈ సినిమా ఆక్టోబర్ 20న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

సెట్​లో రవితేజకు గాయాలు.. 10 కుట్లు.. ఆ సీన్​ షూటింగ్​లో..!

టైగర్‌ నాగేశ్వరరావు బయోపిక్​లో రవితేజ

Last Updated : Aug 17, 2023, 10:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.