ETV Bharat / entertainment

Tiger Nageswara Rao Release : పాన్ఇండియా రేంజ్​లో టైగర్.. కానీ అక్కడ తక్కువైన సపోర్ట్? - tiger nageswara rao trailer

Tiger Nageswara Rao Release : మాస్ మహారాజ రవితేజ కొత్త చిత్రం 'టైగర్ నాగేశ్వరరావు'. దర్శకుడు వంశీ కృష్ణ ఈ సినిమాను పాన్​ఇండియా రేంజ్​లో తెరకెక్కించారు. ఇక ఈ సినిమా అక్టోబర్ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tiger Nageswara Rao Release
Tiger Nageswara Rao Release
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 9, 2023, 9:55 AM IST

Updated : Oct 9, 2023, 11:09 AM IST

Tiger Nageswara Rao Release : టాలీవుడ్​లో ఏ భాష సినిమాకైనా కొంచెం పాజిటివ్ టాక్ వస్తే ఆదరణ లభిస్తుంది. తెలుగు ప్రేక్షకులు అన్ని భాషల సినిమాలను ప్రోత్సహిస్తారు. ఇతర భాషల సినిమాలు తెలుగులో సాధించిన కలెక్షన్లు మరే ఇండస్ట్రీలో రాబట్టలేవు. కానీ తెలుగు సినిమా స్థాయి పాన్ఇండియా వరకు వెళ్లినా.. కొన్ని ఇండస్ట్రీల్లో సరైన ఆదరణ లభించడం లేదు. కేవలం 'బాహుబలి', 'ఆర్​ఆర్​ఆర్'​, 'పుష్ప' వంటి సినిమాలు మినహా.. ఇతర చిత్రాలకు తగినంత సపోర్ట్ రావడం లేదు. అయితే ఇప్పుడు తాజాగా 'టైగర్ నాగేశ్వరరావు' సినిమాకు కూడా ఇదే పరిస్థితి ఎదురవుతున్నట్లు టాక్.

టాలీవుడ్​ స్టార్ హీరో మాస్ మహారాజ రవితేజ కొత్త చిత్రం 'టైగర్ నాగేశ్వరరావు'. ఈ సినిమాను డైరెక్టర్ వంశీ కృష్ణ.. పాన్​ఇండియా రేంజ్​లో తెరకెక్కించారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్​ బ్యానర్​పై ప్రముఖ నిర్మాత అభిషేక్ రూపొందించారు. రీసెంట్​గా ట్రైలర్​ విడుదల చేసిన చిత్రబృందం.. దసరా కానుకగా అక్టోబర్ 20న గ్రాండ్​గా సినిమాను విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో సినిమాకు బాలీవుడ్​లో మంచి సపోర్ట్​తోపాటు.. పెద్ద ఎత్తున థియేటర్లు కూడా లభిస్తున్నాయి. కానీ తమిళ ఇండస్ట్రీ కోలీవుడ్​లో మాత్రం.. టైగర్ నాగేశ్వర రావుకు సరైన మద్ధతు కరవైనట్లు తెలుస్తోంది.

తమిళ్​లో కూడా విడుదలౌతున్న ఈ సినిమాకు అక్కడ థియేటర్లు లభించడం సమస్యగా మారిందట. డిస్ట్రిబ్యూట్ చేయడానికి బడా సంస్థల సపోర్ట్ దక్కడం లేదని టాక్. అయితే ఈ సినిమా కంటే ఒకరోజు ముందు విజయ్ 'లియో' రావడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. అక్కడ మెజారిటీ థియేటర్లలో 'లియో' నే ప్రదర్శితం కానుందట. దీంతో తమిళ్​లో నామమాత్రంగానే విడుదల కావచ్చునని సినీ విశ్లేషకులు అంటున్నారు.

Tiger Nageswara Rao Cast : ఇక సినిమా విషయానికి వస్తే.. ఇటీవల రిలీజైన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇందులో హీరో రవితేజ లుక్స్​ సూపర్​గా ఉన్నాయంటూ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. ఇక ఈ సినిమాలో నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్, రేణు దేశాయ్, అనుకృతి వాస్​, అనుపమ్ ఖేర్, నాజర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్​ స్వరాలు సమకూరుస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Raviteja Rashmika : రవితేజతో రష్మిక.. సూపర్​ హిట్ డైరెక్టర్​తో సినిమా!

Raviteja Tiger Nageswarao Teaser : 'టైగర్‌ నాగేశ్వరరావు' వచ్చేశాడు.. 8 ఏళ్లకే రక్తం తాగిన క్రిమినల్​గా..

Last Updated : Oct 9, 2023, 11:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.