ETV Bharat / entertainment

బాక్సాఫీస్​ను షేక్​ చేస్తున్న 'టైగర్​ 3'- మూడు రోజుల కలెక్షన్లు ఎంతంటే? - tiger 3 collections

Tiger 3 Movie 3 Days Collections : విడుదలైన మూడు రోజుల్లోనే కలెక్షన్స్​ పరంగా బాక్సాఫీస్​ వద్ద దూసుకుపోతోంది సల్మాన్​ ఖాన్​ టైగర్​ 3. ఇంతకీ ముడు రోజుల​ వసూళ్లు ఎంతంటే?

Tiger 3 Movie 3 Days Collections
Tiger 3 Cinema 3 Days Collections
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 15, 2023, 6:07 PM IST

Tiger 3 Movie 3 Days Collections : బాలీవుడ్​ కండల వీరుడు సల్మాన్​ ఖాన్​ నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్‌ చిత్రం 'టైగర్​ 3'. దీపావళి కానుకగా ఈ సినిమా ఈనెల 12న వరల్డ్​వైడ్​గా గ్రాండ్​గా రిలీజ్​ అయింది. ముఖ్యంగా సినిమాలో సల్లూభాయ్ యాక్షన్​ సీన్స్​ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. దీంతో మౌత్​ అడ్వర్టైజ్​మెంట్​తో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు క్యూ కడుతున్నారు. ఫలితంగా దీని ప్రభావం సినిమా వసూళ్లపై పడుతోంది. ఇంతకీ మూడు రోజుల(నవంబర్​ 12 నుంచి 14 వరకు) కలెక్షన్స్​ ఎంతంటే..

Tiger 3 Business Deals : టైగర్ జిందాహైకు సీక్వెల్‍గా వచ్చిన టైగర్​-3కి ముందు నుంచే మంచి డిమాండ్ ఏర్పడడం వల్ల.. దీని హక్కులను దక్కించుకునేందుకు అనేక థియేటర్లు, ప్లాట్​ఫామ్​లు పోటీ పడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 9 వేలకు పైగా థియేటర్లలో రిలీజ్​ అయిన ఈ యాక్షన్ మూవీకి ఏకంగా రూ.300 కోట్ల మేర బిజినెస్​ జరిగినట్లు సమాచారం.

వరల్డ్​వైడ్​గా..
Tiger 3 Worldwide Collections : ఇక కలెక్షన్స్​ విషయానికొస్తే.. విడుదలైన మూడు రోజుల్లోనే ఏకంగా రూ.240 కోట్ల గ్రాస్​ (వరల్డ్​వైడ్​) కలెక్షన్స్​ను కొల్లగొట్టింది టైగర్​ 3. ఫస్ట్​ డే- రూ.92 కోట్లు, రెండో రోజు- రూ.81.18 కోట్లు, మూడో రోజు- రూ.66.82 కోట్ల గ్రాస్​ను రాబట్టింది.

భారత్​లో నెట్​ కలెక్షన్స్​..
Tiger 3 India Collections : టైగర్-3 సినిమాకు మన దేశంలో తొలి మూడో రోజుల్లోనే ఏకంగా రూ.148.50 కోట్ల నెట్ కలెక్షన్లు వచ్చాయని ట్రేడ్​ వర్గాల అంచనా. తొలి రోజు- రూ.43.50 కోట్లు, రెండో రోజు- రూ.59.25 కోట్లు, మూడో రోజు- రూ.45.75 కోట్ల నెట్​ వసూళ్లను దక్కించుకుంది. ఇక దీని గ్రాస్​ విలువ రూ.180.50 కోట్లుగా ఉంది.

ఓవర్సీస్​లో గ్రాస్​​ రేట్​..
Tiger 3 Overseas Gross : ఫారిన్​లోనూ టైగర్​-3 దుమ్మురేపింది. రిలీజైన మూడు రోజుల్లోనే రూ.59.50 కోట్ల గ్రాస్​​ వసూళ్లు, రూ.59.41 కోట్ల నెట్​ కలెక్షన్స్​ను సాధించింది. ఇక ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు రూ.300 కోట్ల బడ్జెట్​(Tiger 3 Budget)ను ఖర్చు చేశారు ప్రొడ్యూసర్స్​. అంతకంటే ఎక్కువగానే ఈ సినిమాకు బిజినెస్​ డీల్స్​ రావడం విశేషం.

Tiger 3 Cast : యశ్​ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఆదిత్య చోప్రా నిర్మించారు. మనీశ్​ శర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ ఫిల్మ్‌కు ప్రీతమ్, తనూజ్​ టింకూ సంగీతం సమకూర్చారు. కత్రినా కైఫ్ హీరోయిన్​గా సల్లూభాయ్​కు జంటగా నటించగా ఇమ్రాన్​ హష్మీ విలన్‌ పాత్రలో కనిపించాడు. వీరితోపాటు సిమ్రన్, రిధి డోగ్రా, విశాల్ జెత్వా, కుముద్ మిశ్రా, రణ్‍వీర్​ షోలే కీలకపాత్రలు పోషించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

పెళ్లిపీటలెక్కనున్న 'జోష్' బ్యూటీ కార్తిక - ఫొటోలు చూశారా?

సంక్రాంతి రేసు నుంచి 'ఫ్యామిలీ స్టార్​' ఔట్​ - అదే కారణమా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.