ETV Bharat / entertainment

KGF 2: 'కేజీయఫ్‌' తెరవెనుక హీరోలెవరో మీకు తెలుసా?

యశ్‌ ప్రధాన పాత్ర పోషించిన పాన్‌ ఇండియా చిత్రం 'కేజీయఫ్'​. తొలిభాగం ఘన విజయం అందుకుని.. శుక్రవారం రెండో భాగం విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమా కోసం తెర వెనుక ఎందరో కష్టపడ్డారు. వారి కష్టం వల్లే సినిమా థియేటర్లలోకి వస్తుంది. మరి ‘కేజీయఫ్​ ఛాప్టర్‌ 2’లోని అలాంటి కొందరి తెర వెెనుక హీరోల గురించి తెలుసుకుందామా?

కేజీయఫ్​
KGF
author img

By

Published : Apr 13, 2022, 7:34 PM IST

Updated : Apr 13, 2022, 11:14 PM IST

చాలా సినిమాలు తెరపై కనిపించిన పాత్రల గురించే మాట్లాడుకునేలా చేస్తాయి. కొన్ని మాత్రం తెర వెనక ఉండి కథను రక్తి కట్టించిన వారి గురించీ తెలుసుకునేలా ఆసక్తిని పెంచుతాయి. వీటిల్లో ‘కేజీయఫ్‌’ ఒకటి. యశ్‌ ప్రధాన పాత్ర పోషించిన ఈ పాన్‌ ఇండియా చిత్రం తొలిభాగం ‘ఛాప్టర్‌ 1’ ఘన విజయం అందుకుని, ఇప్పుడు రెండో భాగం విడుదలకు సిద్ధంగా ఉంది. ‘కేజీయఫ్‌ 2’ ఏప్రిల్‌ 14న ప్రేక్షకుల ముందుకొస్తున్న నేపథ్యంలో ఈ సినిమాకు పనిచేసిన కొందరు సాంకేతిక నిపుణుల గురించి చూద్దాం..

మ్యూజిక్‌ హీరో

KGF 2
మ్యూజిక్​ డైరెక్టర్​

సినిమా విజయంలో కీలక పాత్ర పోషించే విభాగాల్లో సంగీతం ఒకటి. కేవలం పాటలతోనే కాకుండా నేపథ్య సంగీతంతోనూ ప్రేక్షకులకు కొత్త అనుభూతినిచ్చి, ‘కేజీయఫ్‌ 1’ను మరో స్థాయికి తీసుకెళ్లారు మ్యూజిక్‌ డైరెక్టర్‌ రవి బస్రూర్‌. స్వతహాగా ఆయనా సినీ దర్శకుడు కావడంతో ‘కేజీయఫ్‌’లాంటి పవర్‌ఫుల్‌ కథకు, హీరోను ఎలివేట్‌ చేసే సన్నివేశాలకు ఎలాంటి బీజీఎం ఇస్తే ప్రేక్షకులు ఫిదా అవుతారో అలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఇచ్చి తనను అందరూ గుర్తుపెట్టుకునేలా చేశారు. ఉత్తమ సంగీత దర్శకుడిగా ‘కన్నడ స్టేట్‌ ఫిల్మ్‌ అవార్డు’, ‘జీ కన్నడిగ’, ‘సైమా’ అవార్డులు అందుకున్నారు. ట్రైలర్‌ను, ఇప్పటికే విడుదలైన పాటలను బట్టి ‘ఛాప్టర్‌ 2’తోనూ వావ్‌ అనిపించబోతున్నారని తెలుస్తోంది. ఉడుపి జిల్లాలోని కుండపుర అనే పట్టణం (కర్ణాటక)లో జన్మించిన రవి 60కుపైగా కన్నడ చిత్రాలకు సౌండింగ్‌ విభాగంలో ప్రోగ్రామర్‌గా పనిచేశారు. ‘ఉగ్రం’ (కన్నడ) సినిమా ఆయన్ను సంగీత దర్శకుడిని చేసింది. దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కించిన తొలి చిత్రమిది. ‘ఎక్కసక’, ‘అంజనీపుత్ర’, ‘మఫ్తీ’ తదితర చిత్రాలకు తన సంగీతంతో ప్రాణం పోశారు. ‘మార్షల్‌’ అనే తెలుగు సినిమాకు నేపథ్య సంగీతమిచ్చారు. ప్రశాంత్‌ నీల్‌- ప్రభాస్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘సలార్‌’కు ఈయనే మ్యూజిక్‌ అందిస్తున్నారు. సంగీత దర్శకుడిగానే కాకుండా గేయ రచయితగా, నటుడిగా, ‘గర్గర్‌ మండ్ల’, ‘కటక’ తదితర సినిమాలతో దర్శకుడిగానూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

సినిమాటోగ్రఫీ హీరో

KGF 2
సినిమాటోగ్రాఫర్‌ భువన్‌ గౌడ

దర్శకుడు ఓ సన్నివేశాన్ని ఊహిస్తే.. దాన్ని ‘కెమెరా’ ద్వారా నిజం చేస్తుంటారు ఛాయాగ్రాహకులు. అలా ప్రశాంత్‌ నీల్‌ ఊహించిన ‘కేజీయఫ్‌’ లొకేషన్లను, హీరోను ‘లెన్స్‌’తో బంధించి తెరపై ఆవిష్కరించి ప్రేక్షకులను మెప్పించిన సినిమాటోగ్రాఫర్‌ భువన్‌ గౌడ. అతని పనితనం ఎలాంటిదో కేజీయఫ్‌ 1లో అడుగడుగునా కనిపిస్తుంది. ఈ సినిమాకు గానూ ‘సైమా’, ‘జీ కన్నడిగ’ అవార్డులు పొందారు. ఛాప్టర్‌ 2కూ అదే స్థాయిలో శ్రమించారని ప్రచార చిత్రం చూస్తే అర్థమవుతోంది. ప్రశాంత్‌ నీల్‌ ‘ఉగ్రం’ సినిమాతోనే ఈయనా కన్నడ చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. ‘రథావర’, ‘పుష్పక విమానం’లతో సినిమాటోగ్రాఫర్‌గా విమర్శకుల ప్రశంసల్ని సైతం అందుకున్నారు.

ఎడిటింగ్‌ హీరోలు

దర్శకుడు ఓ సినిమా ద్వారా చాలా చెప్పాలనుకుంటాడు. కానీ, నిడివి ఎక్కువగా ఉంటే ప్రేక్షకులకు కథ రుచించకపోవచ్చు. అందుకే వారికి ఎప్పుడు? ఎంత? ఎలా చెప్పాలో, చూపించాలో ఎడిటరే నిర్ణయిస్తాడు. సినిమా జయపజయాల విషయంలో కీలక బాధ్యత తీసుకుంటాడు. ఛాప్టర్‌ 1కు శ్రీకాంత్‌ గౌడ ఆ పనిచేయగా.. ఛాప్టర్‌ 2ను ఉజ్వల్‌ కులకర్ణి ఎడిట్‌ చేశారు. ‘విజన్‌ వరల్డ్‌’ అనే సంస్థలో ఆఫీస్‌ బాయ్‌గా చేరిన శ్రీకాంత్‌.. ఎడిటింగ్‌పై ఉన్న ఆసక్తితో పలు కన్నడ ధారావాహికలు, డాక్యుమెంటరీలు, వాణిజ్య ప్రకటనలు, పలు సినిమాలకు ఎడిటర్‌గా పనిచేసి, నిర్మాతగానూ మారాడు. ప్రశాంత్‌ నీల్‌ ‘ఉగ్రం’ సినిమాతో కన్నడ సినీ పరిశ్రమను ఆకర్షించిన శ్రీకాంత్‌ ‘కేజీయఫ్‌ 1’తో ఎడిటర్‌గా మరో మెట్టెక్కాడు. తెలుగులో రవితేజ హీరోగా సుధీర్‌ వర్మ తెరకెక్కిస్తున్న ‘రావణాసుర’ అవకాశం అందుకున్నాడు. కొత్త వారికి ప్రోత్సహమిచ్చేందుకు ముందుండే ప్రశాంత్‌ నీల్‌ ఛాప్టర్‌ 2 ఎడిటర్‌గా ఉజ్వల్‌ను తీసుకున్నారు. సుమారు 20ఏళ్ల వయసున్న అతడు.. భారీ ప్రాజెక్టుకు పనిచేయడంతో ఉజ్వల్‌ పేరు ప్రస్తుతం కన్నడ చిత్ర పరిశ్రమలో సంచలనంగా మారింది.

సెట్స్‌ హీరో

KGF 2
కేజీయఫ్​ సెట్​

సాధారణ కథలతో పోలిస్తే ఓ నిర్ణీత కాలానికి, ప్రాంతానికి సంబంధించిన కథలకు సెట్స్‌ రూపొందించడం చాలా కష్టం. ఏ చిన్న పొరపాటుకు తావివ్వకుండా అప్పట్లో.. ధరించే దుస్తుల దగ్గర నుంచి వాడే వస్తువుల వరకూ అన్నింటి గురించి పక్కాగా తెలుసుకోవాలి. నాటి వాతావరణం ఉట్టిపడేలా సెట్టింగులు వేయాలి. ‘కేజీయఫ్‌ (కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌) ఇలా ఉంటుంది, 90ల్లో అక్కడ జరిగింది ఇదీ’ అని ప్రొడక్షన్ డిజైనర్‌ శివ కుమార్‌ కళ్లకు కట్టినట్టు చూపించారు. కేజీయఫ్‌ రెండు అధ్యాయాలకు ఈయన ఆధ్వర్యంలోనే సెట్స్‌ రూపొందాయి. ప్రభాస్‌ ‘సలార్‌’కు తనే ప్రొడక్షన్‌ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు.

యాక్షన్‌ హీరోలు..

‘బెస్ట్‌ స్టంట్‌ కొరియోగ్రఫీ’ విభాగంలో కేజీయఫ్‌1కు గానూ విక్రమ్‌ మోర్‌, అన్బు- అరివు (అన్బరివు) జాతీయ స్థాయి పురస్కారం అందుకున్నారంటే వారి ‘పోరాట’ పటిమ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. చాలా స్టైలిష్‌గా ‘స్టంట్స్‌’ కొరియోగ్రఫీ చేసి ప్రేక్షకులతో చప్పట్లు కొట్టించారు, ఈలలు వేయించారు. ఛాప్టర్‌ 2కు అన్బరివు ద్వయం మాత్రమే పనిచేసింది.

మాటలు.. ఎఫెక్ట్‌లు..

ఛాప్టర్‌ 1కు చంద్రమౌళి, ఎం. వినయ్‌ శివగంగే సంభాషణలు రాయగా ఛాప్టర్‌కు చంద్రమౌళితో కలిసి డా. సూరి, ప్రశాంత్‌ నీల్‌ రాశారు. తొలిభాగానికి వీజీ రాజన్‌, రెండో భాగానికి జె. నందు సౌండ్‌ ఎఫెక్ట్స్‌ అందించారు. వి. నాగేంద్ర ప్రసాద్‌, కిన్నల్‌ రాజ్‌, రవి బస్రూర్‌ కన్నడ వెర్షన్‌ పాటలకు సాహిత్యం అందించగా తెలుగులో రామజోగయ్యశాస్త్రి రాశారు. కేజీయఫ్‌.. తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరవడానికి కారణం రామజోగయ్య శాస్త్రి లిరిక్స్‌తోపాటు ‘ఆనంద్‌ వాసిరాజ్‌’ పాత్రకు శుభలేఖ సుధాకర్‌ చేసిన గాత్రదానమనేది సినీ పండితుల మాట.

ది కెప్టెన్‌ ఆఫ్‌ కేజీయఫ్‌..

KGF 2
ప్రశాంత్​

భారతీయ చిత్ర పరిశ్రమ దృష్టి కన్నడపై నిలిపిన దర్శకుడిగా ప్రశాంత్‌ నీల్‌ను చెప్పుకొంటున్నారు. 2014లో శ్రీమురళి, తిలక్‌ శేఖర్‌, హరిప్రియ ప్రధాన పాత్రల్లో ‘ఉగ్రం’ అనే యాక్షన్‌ థ్రిల్లర్‌తోనే ఆయన ప్రయాణం మొదలైంది. తొలి ప్రయత్నంలోనే దర్శకుడిగా మంచి మార్కులు కొట్టేశారు. ‘సైమా’- ఉత్తమ పరిచయ దర్శకుడు అవార్డు అందుకున్నారు. ద్వితీయ యజ్ఞంగా ‘కేజీయఫ్‌’ను ఎంపిక చేసుకున్నారు. తన ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పడంతోపాటు ఉత్తమ దర్శకుడిగా ‘జీ కన్నడిగ’ అవార్డు సొంతం చేసుకున్నారు. ముందుగా ఈ చిత్రాన్ని రెండు భాగాల్లో తెరకెక్కించాలనుకోలేదు. కానీ, కథ నిడివి దృష్ట్యా రెండు ఛాప్టర్లుగా వివరిస్తున్నారు. ఈయన దర్శకత్వంలో పనిచేసేందుకు తెలుగు అగ్ర హీరోలూ ఆసక్తి చూపారు. ఇప్పటికే ప్రభాస్‌ ‘సలార్‌’ను పట్టాలెక్కించగా.. ఎన్టీఆర్‌ త్వరలోనే మొదలుపెట్టనున్నారు.

దర్శకుడు ఎంత బలమైన కథ రాసినా దాన్ని నమ్మి ‘సొమ్ము’ పెట్టాలంటే ఎన్నో తర్జనభర్జనలు. అందులోనూ రెండో సినిమాకే భారీ హంగులు, కోట్ల రూపాయలు అంటే మరీ కష్టం. అలాంటిది ప్రశాంత్‌ నీల్‌ కథపై ఎంతో నమ్మకం ఉంచి, కన్నడ సినీ పరిశ్రమకు ప్రపంచవ్యాప్త గుర్తింపు రావాలనే బలమైన ఆకాంక్షతో ముందుకొచ్చిన నిర్మాత విజయ్‌ కిరంగదూర్‌. హోంబలే ఫిల్మ్స్‌ పతాకంపై ఎప్పటికీ మరిచిపోలేని చిత్రాన్ని భారతీయ సినీ ప్రేక్షకులకు కానుకగా అందించారు.

ఇదీ చూడండి: ‘కేజీయఫ్‌-1'లో జరిగింది ఇది.. 'చాప్టర్​-2' ఆ సీన్​తోనే స్టార్ట్​ అవుతుందా?

Last Updated : Apr 13, 2022, 11:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.