ETV Bharat / entertainment

కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ మరో సంచలన చిత్రం.. 'ది వ్యాక్సిన్ వార్' - ది వ్యాక్సిన్ వార్​ మూవీ అప్డేట్స్​

కశ్మీర్ ఫైల్స్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి.. తన కొత్త సినిమాను ప్రకటించారు. ఆ వివరాలు..

The Kashmir files director new movie
కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ మరో సంచలన చిత్రం.. 'ది వ్యాక్సిన్ వార్'
author img

By

Published : Nov 10, 2022, 12:51 PM IST

కశ్మీర్ ఫైల్స్ చిత్రంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి. తక్కువ బడ్జెట్‌తో నిర్మించిన ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. దీంతో ఆయన రూపొందించబోయే తర్వాతి సినిమాలపై సినీప్రియుల్లో భారీగా ఆసక్తి నెలకొంది. అలానే వివేక్​ ఓ ఆసక్తికర ప్రాజెక్టుతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు ఇటీవల ప్రకటించారు.

తాజాగా తన దర్శకత్వంలో 'ది వ్యాక్సిన్ వార్' సినిమా తీయబోతున్నట్లు తెలిపారు. పోస్టర్​ను కూడా రిలీజ్ చేశారు. కరోనా మహమ్మారి, లాక్‌డౌన్, ప్రజలు పడిన ఇబ్బందులు, వ్యాక్సిన్ కోసం పడిగాపులు ఇలా ప్రతి అంశాన్ని ఈ చిత్రంలో చూపించనున్నారు.

అంతే కాదు, భారతీయ సినిమా చరిత్రలో తొలిసారి 11 భాషల్లో దీనిని విడుదల చేయనున్నారు. వచ్చే ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఐ యామ్ బుద్ధ ప్రొడక్షన్ పతాకం పై పల్లవి జోషి ది వ్యాక్సిన్ వార్ నిర్మిస్తున్నారు. కశ్మీర్ ఫైల్స్ తీసిన అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకంపై ఈ సినిమాను దేశవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.

ఇదీ చూడండి: అర్జున్​ కపూర్​తో పెళ్లిపై ఒక్క పోస్ట్​తో క్లారిటీ ఇచ్చేసిన మలైకా అరోరా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.