ETV Bharat / entertainment

'ఆస్కార్‌ పట్టుకోనివ్వలేదు.. రూ.లక్ష ఇంకా ఇవ్వలేదు'.. డైరెక్టర్​పై బెల్లీ- బొమ్మన్‌ దంపతుల ఆరోపణలు - Kartiki Gonsalves of The Elephant Whisperers

The Elephant Whisperers Bomman And Bellie : ఆస్కార్‌ విజేత కార్తికి గోంజాల్వెస్‌పై బెల్లీ, బొమ్మన్‌ దంపతులు తీవ్ర ఆరోపణలు చేశారు. డాక్యుమెంటరీ చిత్రీకరించే సమయంలో తమతో ఆత్మీయంగా ఉన్న కార్తికి.. ఆస్కార్‌ గెలుపొందిన తర్వాత ఎంతో మారిపోయారని ఆరోపించారు. ఈ డాక్యుమెంటరీ తర్వాత తమకు ఉన్న ప్రశాంతత మొత్తం పోయిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

Bellie, Bomman allege exploitation by director Kartiki Gonsalves of 'The Elephant Whisperers' fame

author img

By

Published : Aug 7, 2023, 12:38 PM IST

The Elephant Whisperers Bomman And Bellie : ఆస్కార్‌ విజేత, ది ఎలిఫెంట్‌ విష్పరర్స్‌ డాక్యుమెంటరీ దర్శకురాలు కార్తికి గోంజాల్వెస్​పై బెల్లీ, బొమ్మన్‌ దంపతులు తీవ్ర ఆరోపణలు చేశారు. డాక్యుమెంటరీ చిత్రీకరించే సమయంలో తమతో ఆత్మీయంగా ఉన్న కార్తికి.. ఆస్కార్‌ గెలుపొందిన తర్వాత ఎంతో మారిపోయారని ఆరోపించారు. తమ ఫోన్‌ కాల్స్‌ కూడా లిఫ్ట్‌ చేయడం లేదని తెలిపారు. ఇప్పటివరకూ తమకు డబ్బులు ఇవ్వలేదని చెప్పారు. ఈ డాక్యుమెంటరీ తర్వాత తమకు ఉన్న ప్రశాంతత మొత్తం పోయిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

'లక్ష ఇస్తానని చెప్పి.. ఫోన్​ లిఫ్ట్​ చేయట్లేదు..'
Bomman And Bellie Controversy : డాక్యుమెంటరీ చిత్రీకరించిన సమయంలో దర్శకురాలు కార్తికి గోంజాల్వెస్‌ మాతో చక్కగా ఉండేవారని బెల్లీ, బొమ్మన్‌ దంపతులు తెలిపారు. "షూటింగ్​ జరుగుతున్న సమయంలో ఓరోజు ఆమె మావద్దకు వచ్చి పెళ్లి సీన్‌ షూట్‌ చేయాలనుకుంటున్నట్లు చెప్పింది. ఆమె వద్ద డబ్బు లేదని తెలిపింది. మమ్మల్నే ఖర్చు పెట్టమని అడిగింది. సరే అని చెప్పి.. బెల్లీ తన మనవరాలి చదువు కోసం దాచిన డబ్బు తీసి ఆమెకు ఇచ్చాం. పెళ్లి సీన్​ కోసం దాదాపు రూ.1 లక్ష ఖర్చు పెట్టాం. ఆ మొత్తాన్ని తిరిగి ఇచ్చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. ఇప్పటివరకూ తిరిగి ఇవ్వలేదు. ఫోన్‌ చేసినా బిజీగా ఉంటున్నానని.. తర్వాత చేస్తానంటూ కాల్‌ కట్‌ చేస్తున్నారు" అంటూ ఆరోపణలు చేశారు.

'సభలో ఆస్కార్​ పట్టుకోనివ్వలేదు'
"మా వల్లే ఆమెకు ఆస్కార్‌ వచ్చింది. సన్మాన సభలో ఆమె మమ్మల్ని ఆస్కార్‌ పట్టుకోనివ్వలేదు. ఈ డాక్యుమెంటరీ తర్వాత మా ప్రశాంతత కోల్పోయాం" అని తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో బెల్లీ, బొమ్మన్‌ దంపతులు ఆరోపించారు. మరోవైపు, బెల్లీ- బొమ్మన్​ దంపతుల ఆరోపణలపై చిత్ర నిర్మాణ సంస్థ స్పందించింది. వాళ్ల మాటల్లో నిజం లేదని చెప్పింది. వన్య ప్రాణుల సంరక్షణ, అటవీ శాఖ పనితీరును ప్రశంసించడానికే తాము ఈ ప్రాజెక్ట్‌ తెరకెక్కించామని తెలిపింది.

ముదుమలై రిజర్వ్‌ ఫారెస్ట్‌లో..
The Elephant Whisperers Documentary : తమిళనాడులోని ముదుమలై రిజర్వ్‌ ఫారెస్ట్‌లో మావటిగా పనిచేస్తున్న బెల్లీ, బొమ్మన్‌ దంపతుల వాస్తవ జీవనం ఆధారంగా ది ఎలిఫెంట్‌ విష్పరర్స్‌ అనే లఘుచిత్రం రూపొందింది. రఘు, అమ్ము అనే రెండు అనాథ ఏనుగు పిల్లలు, వాటిని ఆదరించిన ఈ దంపతులే పాత్రధారులుగా ఈ కథ రూపుదిద్దుకుంది. నిర్మాత గునీత్‌ మోగ్న నేతృత్వంలో దర్శకురాలు కార్తికి గోంజాల్వెస్‌ ఈ కథను తెరకెక్కించారు. 42 నిమిషాల నిడివి గల ఈ చిత్రం ఆస్కార్‌ 2023లో ఉత్తమ లఘు చిత్రంగా అవార్డు సొంతం చేసుకుంది. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఇది సినీ ప్రియులకు అందుబాటులో ఉంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.