ETV Bharat / entertainment

అలా చేసినందుకు ఆ ఇద్దరు స్టార్​ హీరోలపై కేసు నమోదు.. ఏం చేశారంటే?

author img

By

Published : Sep 14, 2022, 4:11 PM IST

Thank God Movie : ఓ సినిమా విషయంలో ఇద్దరు స్టార్ హీరోలు వివాదంలో చిక్కుకున్నారు. వారిపై కేసు నమోదైంది. వారిద్దరు ఏం చేశారంటే..

thank god movie release date
thank god movie: Case filed against Ajay Devgn, Sidharth Malhotra and Indra Kumar

Thank God Movie : బాలీవుడ్​ నటులు అజయ్‌ దేవ్‌గణ్‌​, సిద్ధార్థ్‌ మల్హోత్ర నటించిన కొత్త చిత్రం 'థ్యాంక్‌ గాడ్‌​'. అయితే ఈ చిత్రం ఇప్పుడు సమస్యల్లో చిక్కుకుంది. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్​లోని కొన్ని సంభాషణలు వల్ల హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయంటూ లాయర్​ హిమాన్షు శ్రీవాత్సవ.. ఉత్తరప్రదేశ్​లోని జౌన్​పూర్​​ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో అజయ్‌ దేవ్‌గణ్‌​, సిద్ధార్థ్‌ మల్హోత్ర, దర్శకుడు ఇంద్ర కుమార్‌పై కేసు నమోదైంది.

"అజయ్​ దేవ్​గణ్​ సూటు వేసుకుని, చిత్ర గుప్తుడి పాత్రలో అభ్యంతరకర భాషలో జోకులు వేశారు. చిత్ర గుప్తుడు అంటే పాప కర్మలు లెక్కించేవారు. మనుషుల మంచి చెడులను రికార్డు చేస్తారు. దేవుళ్లను అలా చూపిస్తే.. అది మతం మనోభావాలను దెబ్బతీసినట్టు అవుతుంది" అని హిమాన్షు తన పిటిషన్​లో పేర్కొన్నారు. పిటినషనర్​ స్టేట్​మెంట్​ను కోర్టు నవంబర్ 18న రికార్డు చేయనుంది.

కాగా, ఈ చిత్రంలో రకుల్‌ప్రీత్‌ సింగ్‌ కథానాయికగా నటిస్తోంది. ఇంద్ర కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ శుక్రవారం విడుదలైంది. సిద్ధార్థ్‌ కారు ప్రమాదానికి గురైన సన్నివేశంతో ప్రారంభమైన ఈ ట్రైలర్‌ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేలా ఉంది. ఎమోషన్‌ ప్లస్‌ కామెడీ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతున్నట్టు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది. దాదాపు 3 నిముషాలు ఉన్న ఈ ట్రైలర్​లో సూట్​లో వచ్చిన అజయ్​ దేవ్​గణ్.. సిద్ధార్థ్ బలహీనతలను వరుసగా చెబుతాడు. చివరలో ఓ జోక్ పేలుస్తాడు. ఈ సినిమా అక్టోబర్​ 25న విడుదల కానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి: స్టేజ్​పై 'మిర్చి' సాంగ్​కు కృష్ణంరాజు డ్యాన్స్​.. అదే చివరిసారిగా

నటి సంగీతపై దర్శకులు బాల, కృష్ణవంశీ ఫుల్​ ఫైర్.. మరీ ఇలా తిట్టేశారేంటి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.