Thangalaan Vikram Comments : కోలీవుడ్ దర్శకుడు పా రంజిత్, హీరో విక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'తంగలాన్'. భారీ అంచనాల నడుమ రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా ఈ చిత్ర టీజర్‌ను హైదరాబాద్‌లో ఓ ఈవెంట్ వేదికగా రిలీజ్ చేశారు. ఇక ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న హీరో విక్రమ్ సినిమాలో తన రోల్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
విక్రమ్.. మరో ఎక్స్పెరిమెంట్..
'ఈ సినిమా టీజర్ రిలీజ్ ఈవెంట్‌కు ఇంత పెద్ద స్థాయిలో యువత రావడం ఇదే తొలిసారి. ముందెప్పుడూ ఇంతమంది యూత్‌ను నేను నా సినిమా ఈవెంట్స్‌లో చూడలేదు. ఎప్పుడూ పెద్దవారు మాత్రమే వచ్చి ఆశీర్వదించేవారు. ఇక 'తొమ్మిది నెలలు' అనే సినిమా కోసం ఇదే టీమ్‌తో కలిసి పని చేశాను. ఆ తర్వాత మళ్లీ ఈ చిత్రంతో మరోసారి కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. 'తంగలాన్' లాంటి గొప్ప చిత్రంలో నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నన్నెంతో ఆదరిస్తున్నందుకు అభిమానులందరికీ కృతజ్ఞతలు. 'నాన్న', 'అపరిచితుడు', 'శివపుత్రుడు' లాంటి చిత్రాల్లాగే 'తంగలాన్' కూడా విభిన్నంగా ఉండబోతోంది. ఈ కథ మీ అందరికీ కచ్చితంగా నచ్చుతుంది. అయితే ఈ సినిమాలో నాకు అస్సలు డైలాగులే లేవు. అచ్చం 'శివపుత్రుడు' తరహాలోనే 'తంగలాన్' కూడా ఉండనుంది' అని విక్రమ్ టీజర్ ఈవెంట్లో చెప్పుకొచ్చారు.
-
A Fight for Liberty 🌋#ThangalaanTeaser soaring high with over 2.5+ million views
— Neelam Productions (@officialneelam) November 1, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Trending tall and strong at #1 🔥 Watch Now https://t.co/xwZHZ2QP8Q #Thangalaan #ThangalaanFromJan26@Thangalaan @chiyaan @beemji @kegvraja @StudioGreen2 @parvatweets @MalavikaM_… pic.twitter.com/7SHdxuUrlI
">A Fight for Liberty 🌋#ThangalaanTeaser soaring high with over 2.5+ million views
— Neelam Productions (@officialneelam) November 1, 2023
Trending tall and strong at #1 🔥 Watch Now https://t.co/xwZHZ2QP8Q #Thangalaan #ThangalaanFromJan26@Thangalaan @chiyaan @beemji @kegvraja @StudioGreen2 @parvatweets @MalavikaM_… pic.twitter.com/7SHdxuUrlIA Fight for Liberty 🌋#ThangalaanTeaser soaring high with over 2.5+ million views
— Neelam Productions (@officialneelam) November 1, 2023
Trending tall and strong at #1 🔥 Watch Now https://t.co/xwZHZ2QP8Q #Thangalaan #ThangalaanFromJan26@Thangalaan @chiyaan @beemji @kegvraja @StudioGreen2 @parvatweets @MalavikaM_… pic.twitter.com/7SHdxuUrlI
ఎమోషనల్ టచ్.. ఈ సినిమాతో మరో ప్రపంచం..
ఈ సినిమా కోసం టీమ్ అంతా ఎంతో కష్టపడిందని విక్రమ్ అన్నారు. అసలు ఈ సినిమాలో గ్లామర్ అనేదే కనిపించదని.. ఆడియన్స్ మాత్రం ఎమోషనల్‌గా బాగా కనెక్ట్ అవుతారని ఆయన చెప్పారు. 'ఈ సినిమా రోటీన్‌కు భిన్నంగా ఉంటుంది. సినిమా అంతా లైవ్ సౌండ్‌లో చేశారు. అలా చేయడం అంత సులువేమీ కాదు. విశ్రాంతి తీసుకోకుండా రాత్రింబవళ్లు కష్టపడి పనిచేశాం. 'తంగలాన్' అనేది ఒక గిరిజన తెగ. ఆ తెగవారి జీవన విధానం ఎలా ఉంటుందో అనే దాన్ని ఈ చిత్రంలో చూపించే ప్రయత్నం చేశాం. నా కెరీర్లో ఇలాంటి సినిమా చేయడం ఇదే తొలిసారి. నా మీద నమ్మకంతో ఇంత గొప్ప పాత్రలో నటించే అవకాశం కల్పించారు దర్శకనిర్మాతలు. ఈ సినిమా హిట్‌తో దర్శకుడు మరో స్థాయికి వెళ్తారని నేను కచ్చితంగా చెప్పగలను. మీరు టీజర్‌లో చూసింది కొంచం మాత్రమే. థియేటర్లకు వెళ్లి ఈ సినిమాను చూస్తే ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి వెళ్లడం మాత్రం ఖాయం' అని విక్రమ్ తన మనసులోని మాటలను పంచుకున్నారు. ఇక 'తంగలాన్' వచ్చే ఏడాది జనవరి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.
-
The son of Gold rises🔥⚔️
— Studio Green (@StudioGreen2) November 1, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Unveiling the spine-chilling #ThangalaanTeaser✨
▶️https://t.co/Oxbmf5LuoG#Thangalaan #ThangalaanFromJan26@Thangalaan @chiyaan @beemji @kegvraja @officialneelam @parvatweets @MalavikaM_ @DanCaltagirone @gvprakash @NehaGnanavel @agrajaofficial… pic.twitter.com/LxuXmV6psC
">The son of Gold rises🔥⚔️
— Studio Green (@StudioGreen2) November 1, 2023
Unveiling the spine-chilling #ThangalaanTeaser✨
▶️https://t.co/Oxbmf5LuoG#Thangalaan #ThangalaanFromJan26@Thangalaan @chiyaan @beemji @kegvraja @officialneelam @parvatweets @MalavikaM_ @DanCaltagirone @gvprakash @NehaGnanavel @agrajaofficial… pic.twitter.com/LxuXmV6psCThe son of Gold rises🔥⚔️
— Studio Green (@StudioGreen2) November 1, 2023
Unveiling the spine-chilling #ThangalaanTeaser✨
▶️https://t.co/Oxbmf5LuoG#Thangalaan #ThangalaanFromJan26@Thangalaan @chiyaan @beemji @kegvraja @officialneelam @parvatweets @MalavikaM_ @DanCaltagirone @gvprakash @NehaGnanavel @agrajaofficial… pic.twitter.com/LxuXmV6psC
"ప్రస్తుతం దక్షిణాది సినిమాలు ప్రపంచస్థాయిలో మంచి గుర్తింపును తెచ్చుకుంటున్నాయి. గతంలో ఇండియన్ యాక్టర్ అని చెప్పగానే 'బాలీవుడ్' నుంచి వచ్చారా అని అడిగేవారు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు చర్చంతా సౌత్ ఇండస్ట్రీ గురించే. మన సినిమాల గురించే అంతా మాట్లాడుకుంటున్నారు. మన దగ్గర ఎంతో మంది ప్రతిభావంతులున్నారు. ప్రస్తుతం దర్శకుడు అట్లీ పేరు వరల్డ్‌వైడ్‌గా మారుమోగుతోంది. 'కేజీఎఫ్', 'ఆర్‌ఆర్‌ఆర్', 'బాహుబలి' లాంటి గొప్ప చిత్రాలు సౌత్ నుంచే వచ్చాయి. ముఖ్యంగా 'ఆర్‌ఆర్‌ఆర్'తో మన ఖ్యాతిని మరింత పెంచి ఆస్కార్ వచ్చేలా చేశారు దర్శకులు రాజమౌళి. మా అందరికీ ఆయన ఒక మార్గదర్శి."
- విక్రమ్, తమిళ నటుడు
Thangalam Teaser : విక్రమ్ ఇంత వైల్డ్‌గా ఉన్నాడేంట్రా.. పామును చేత్తోనే రెండు ముక్కలు చేసి..
Thangalaan Malavika Poster : యోధురాలిగా మాళవిక.. సయామీకి గురువుగా అభిషేక్ ..