ETV Bharat / entertainment

పాలిటిక్స్​పై దళపతి విజయ్ కీలక వ్యాఖ్యలు.. ఆ స్టూడెంట్​కు గిఫ్ట్​గా గోల్డెన్​ నెక్లెస్​

Thalapathy Vijay politics : కోలీవుడ్‌ స్టార్‌ విజయ్‌.. చెన్నై వేదికగా జరిగిన ఓ కార్యక్రమంలో రాజకీయాల గురించి మాట్లాడారు. ఆ వ్యాఖ్యలు అంతటా చర్చకు దారి తీశాయి. అలాగే ఈ కార్యక్రమంలో ఓ స్టూడెంట్​కు గోల్డెన్ నెక్లెస్​ను గిఫ్ట్​గా ఇచ్చారు.

Thalapathy Vijay golden necklace
పాలిటిక్స్​పై దళపతి విజయ్ కీలక వ్యాఖ్యలు.. ఆ స్టూడెంట్​కు గిఫ్ట్​గా గోల్డెన్​ నెక్లెస్​
author img

By

Published : Jun 17, 2023, 6:49 PM IST

Thalapathy Vijay politics : కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ ఫ్యాన్ ఫాలోయింగ్​ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన రాజకీయాల్లోకి రావాలని చాలా మంది అభిమానులు ఆశిస్తుంటారు. అయితే తాజాగా ఆయన రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. కొంతమంది వ్యక్తులు డబ్బు తీసుకుని ఓటు వేయడాన్ని తప్పుబట్టారు. డబ్బు తీసుకుని ఓటు వేయడం తప్పని.. అది అర్థమయ్యేలా తమ తల్లిదండ్రులకు విద్యార్థులు చెప్పాలన్నారు. చెన్నై వేదికగా జరిగిన ఓ కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

"ఆడియో, ప్రీ రిలీజ్‌ ఫంక్షన్స్​లో ఇప్పటివరకూ చాలా సార్లు మాట్లాడాను. కానీ, ఇలా తొలిసారి విద్యార్థులతో మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది. భవిష్యత్తు ఓటర్లు మీరే అని గుర్తించాలి. మీరే భవిష్యత్తు నాయకులను ఎన్నుకోవాలి. ఇప్పుడున్న రోజుల్లో వ్యవస్థ దారుణంగా మారిపోయింది. డబ్బు ఇచ్చినవాళ్లకే ఓట్లు వేస్తున్నారు. ఓ వ్యక్తి ఓటు కోసం ఎక్కువ డబ్బు ఇస్తున్నాడంటే.. అతడు ఎంత డబ్బు సంపాదించి ఉంటాడో అర్థం చేసుకోండి. కాబట్టి, డబ్బు తీసుకుని ఓటు వెయ్యకూడదని.. విద్యార్థులందరూ తమ తల్లిదండ్రులకు చెప్పాలి. అలా జరిగితేనే ప్రతిఒక్కరికీ ఉన్నత విద్య దక్కుతుంది. ఇక, ఇప్పుడున్న జనరేషన్​లో సోషల్‌మీడియాలో కొంతమంది అబద్ధపు ప్రచారాలు చేస్తుంటారు. ఫేక్‌ న్యూస్‌లు సృష్టిస్తుంటారు. వాటి వెనుక కొన్ని అజెండాలు ఉంటాయి. అందుకే వాటిని అర్థం చేసుకోవడం కోసం అంబేడ్కర్‌, పెరియార్‌ వంటి గ్రేట్ లీడర్స్​ పుస్తకాలు చదవండి" అని విజయ్‌ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో విజయ్‌ పాలిటిక్స్​లోకి ఎంట్రీ ఇస్తారా అని పలువురు నెటిజన్లు తెగ మాట్లాడుకుంటున్నారు.

స్టూడెంట్​కు గోల్డెన్​ నెక్లెస్​ : తమిళనాడు నియోజకవర్గాల వారీగా పదో తరగతి, ఇంటర్‌లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను సన్మానిస్తూ ఆల్‌ ఇండియా దళపతి విజయ్‌ మక్కల్‌ ఇయక్కం ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. చెన్నై వేదికగా ఇది జరిగింది. ఇందులో పాల్గొన్న విజయ్.. విద్యార్థులకు సర్టిఫికేట్స్‌, ప్రైజ్​ మనీ ఇచ్చి అభినందించారు. అలా ఇంటర్​లో 600కు 600 మార్కులు తెచ్చుకున్న ఓ స్టూడెంట్​కు గోల్డెన్​ నెక్లెస్​ ఇచ్చి ప్రత్యేకంగా అభినందించారు. ఇదే కార్యక్రమంలో విజయ్‌ ఓటర్ల గురించి మాట్లాడారు. అలా విజయ్ వ్యాఖ్యలు, నెక్లెస్​ను ఇవ్వడం ప్రస్తుతం హాట్​టాపిక్​గా మారాయి. దీంతో తెలుగు ఆడియెన్స్​ కూడా ఆయన్ను ప్రశంసిస్తున్నారు.

Thalapathy Vijay upcoming movies : ప్రస్తుతం విజయ్​.. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో 'లియో' అనే భారీ బడ్జెట్​ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దసరా సందర్భంగా అక్టోబరు 19న థియేటర్లలో రిలీజ్ కానుంది. అనిరుధ్‌ స్వరాలందిస్తున్నారు. త్రిష హీరోయిన్​. సంజయ్‌ దత్‌, ప్రియాఆనంద్‌, అర్జున్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఇదీ చూడండి :

రిలీజ్​కు ముందే రూ.400 కోట్ల బిజినెస్.. 'లియో' లెక్కలు చూస్తే మతి పోవాల్సిందే!

అవును.. దళపతి విజయ్​ కోసమే అలా చేశా.. ఇప్పుడేమంటారు: రష్మిక

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.