ETV Bharat / entertainment

Thalapathy 68 Movie Shooting : 'దళపతి 68' షూటింగ్​ షురూ.. విజయ్​తో మరోసారి స్క్రీన్​ షేర్​ చేసుకోనున్న ఆ ఇద్దరు స్టార్​ హీరోయిన్స్​.. - విజయ్​ కొత్త సినిమా యాక్టర్లు

Thalapathy 68 Movie Shooting : కోలీవుడ్ స్టార్​ దళపతి విజయ్​ హీరోగా వచ్చిన 'లియో' చిత్రం విడుదలైన ఐదు రోజులకే తన తదుపరి మూవీ షూటింగ్​ మొదలు పెట్టారు. సోమవారం విజయ్​ 68వ చిత్రాన్ని చెన్నైలో పూజా కార్యక్రమాలతో షూటింగ్​ను ప్రారంభించారు. ప్రస్తుతం పూజాకు సంబంధించిన వీడియోలు ట్రెండ్​ అవుతున్నాయి.

Vijay68 Movie Shooting : దళపతి 68 సినిమా షూటింగ్​ షూర్​..

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 24, 2023, 7:34 PM IST

Thalapathy 68 Movie Shooting : తమిళ నటుడు విజయ్​ నటించిన లేటెస్ట్ మూవీ 'లియో'. అక్టోబర్ 19న విడుదలైన ఈ సినిమా .. టాక్​ ఎలా ఉన్నా.. ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను అందుకుంటోంది. ఇక ఈ సినిమా తర్వాత విజయ్​ తన తరువాత ప్రాజెక్టు షూటింగ్​ పనుల్లో బిజీ అయిపోయారు. 'దళపతి 68' అనే వర్కింగ్​ టైటిల్​తో మొదలైన ఈ సినిమా సోమవారం చెన్నైలో పూజా కార్యక్రమాలతో మొదలైంది. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాను ఏజీఎస్​ బ్యానర్​లో కల్పాతి అఘోరామ్​ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.యాక్షన్​ ఎమోషన్స్ ప్రధానంగా రూపొందుతున్న ఈ మూవీకి వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. యువన్​ శంకర్ రాజా ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు.

విజయ్​తో ఆ ఇద్దరూ..
మరోవైపు ఈ సినిమాలో విజయ్​తో పాటు మీనాక్షి చౌదరి,​ ప్రభుదేవా, హీరో ప్రశాంత్, జయరాం, యోగిబాబు, వైభవ్​ నటిస్తున్నారు. అయితే వీరితో పాటు సీనియర్​ నటీమణులు స్నేహ, లైలా కూడా ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా లైలా, స్నేహా గతంలో విజయ్​తో స్క్రీన్ షేర్​ చేసుకున్నారు. 2004లో తెరకెక్కిన 'ఉన్నై నినైత్తు' అనే తమిళ సినిమాలో లైలా- విజయ్​ నటించగా.. 2003లో విడుదలైన తమిళ చిత్రం 'వశీగర' అనే సినిమాలో స్నేహాతో కలిసి విజయ్​ స్క్రీన్ షేర్​ చేసుకున్నారు. ఇక ఈ ముగ్గురూ ఈ సారి ఒకేసారి స్కీన్స్​పై కనిపించడం పట్ల ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Leo Movie Collections : దర్శకుడు లోకేశ్​ కనగరాజ్ కాంబోలో తెరకెక్కిన భారీ యాక్షన్​​ మూవీ 'లియో'. అక్టోబర్ 19న రిలీజైన ఈ సినిమా మిక్స్​డ్​ టాక్​ సొంతం చేసుకుంది. అయితే పబ్లిక్ టాక్​, రివ్యూలతో సంబంధం లేకుండా.. మొదటి రోజు నుంచే ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల విషయంలో ఓ రేంజ్​లో దూసుకెళ్తోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా నాలుగు రోజుల్లోనే ఈ సినిమా రూ. 400 కోట్ల క్లబ్​లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు రూ. 500 కోట్ల వైపు పరుగులు పెడుతోంది. ఈ సినిమాలో కథానాయికగా త్రిష నటించారు. బాలీవుడ్​ స్టార్ యాక్టర్ సంజయ్​దత్​ యాక్షన్​ కింగ్ అర్జున్​​ కీలక పాత్రలో నటించారు. సినిమాకు అనిరుధ్​ సంగీతాన్ని అందించారు. థియేటర్లలోకి వచ్చిన నాలుగు వారాల తరువాత ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్​ఫిక్స్​ల్లో స్ట్రీమింగ్​ అవుతుందని సమాచారం.

Bhagavanth Kesari Vs LeO Vs Tiger Nageswarao Collections : దసరా రోజు దుమ్ములేపిన కలెక్షన్స్​.. ఎంతొచ్చాయంటే?

Lokesh Kanagaraj Injured : 'లియో' ప్రమోషన్స్​లో తొక్కిసలాట.. లోకేశ్​ కనగరాజ్​కు గాయం.. అన్నీ వాయిదా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.