Telugu Local Heroines : టాలీవుడ్లో ఎన్నో ఏళ్లుగా నాన్‌లోకల్ భామలదే హవా నడుస్తోంది. తెలుగులో లోకల్ తారలు హీరోయిన్లుగా చేసిన సినిమాలు చాలా తక్కువ. కానీ ఇందతా ఒకప్పటి మాట. ప్రస్తుతం పొరుగు భాషల ముద్దుగుమ్మలకు మన తెలుగమ్మాయిలు కూడా సత్తా చాటుతున్నారు. నటనతోపాటు భాష కూడా తెలిస్తే.. ఆయా పాత్రల్లో ఎంతగా రాణించవచ్చో తెరపై చేసి చూపుతున్నారు. మరి ప్రస్తుతం వెండితెరపై మెరుస్తున్న మన తెలుగు భామలు ఎవరో తెలుసుకుందాం..
Actress Sreeleela : ప్రస్తుతం టాలీవుడ్లో మోస్ట్ బిజీయెస్ట్ హీరోయిన్ శ్రీలీల. శ్రీకాంత్ కుమారుడు రోషన్ 'పెళ్లి సందడి' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. తర్వాత మాస్ మహారాజ్ రవితేజ 'ధమాకా'తో బ్లాక్‌బస్టర్ అందుకొని ఇప్పుడు చేతినిండా సినిమాలతో షూటింగుల్లో బిజీగా గడిపేస్తుంది. శ్రీలీల తెలుగు కుటుంబంలో జన్మించి.. బెంగళూరులో పెరిగింది. కాగా ఈమె భారతీయ సంతతికి చెందిన అమెరికన్.
Actress Vaishnavi Chaitanya : ఇటీవలె బేబీ సినిమాతో యూత్‌ను అట్రాక్ట్ చేసింది వైష్ణవి చైతన్య. ఆమె నటనతో సినిమాకు ప్రాణం పోసింది. హైదారాబాద్‌కు చెందిన వైష్ణవి.. యూట్యూబ్‌లో జర్నీని ప్రారంభించి తనదైన శైలిలో నటిస్తూ, అందర్నీ మెప్పిస్తూ.. వెండితెరపై అరంగేట్ర సినిమాతోనే బ్లాక్‌బస్టర్ కొట్టింది.
Actress Kavya Kalyanram : అల్లుఅర్జున్ గంగోత్రి సినిమాలో బాల నటిగా తెరపై కనిపించిన ఈ తెలుగమ్మాయి.. తాజాగా వెండితెరపై దూసుకుపోతోంది. 'బలగం', 'మసూద' తో కెరీర్లో హిట్ ఈ అందుకున్న చిన్నది.. ప్రస్తుతం 'ఉస్తాద్' సినిమాతో థియేటర్లలో సందడి చేస్తోంది.
Pranavi Manukonda : పూర్తి తెలుగు నేపథ్యం ఉన్న ఈ భామ కూడా చైల్డ్ ఆర్టిస్ట్‌గా తెరంగేట్రం చేసి.. ప్రస్తుతం 'స్లమ్ డాగ్ హస్బెండ్' సినిమాతో హీరోయిన్గా పరిచయం అయ్యింది.
Shivani Rajashekar, Shivathmika : వీరిద్దరూ సీనియర్ నటులు రాజశేఖర్ - జీవిత కుమార్తెలు. అవకాశం దొరికినప్పుడల్లా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో ఒదిగిపోతూ.. తమదైన ముద్ర వేస్తున్నారు ఈ బ్యూటిఫుల్ సిస్టర్స్. ప్రస్తుతం శివాని.. 'కోట బొమ్మాళి పీఎస్' అనే సినిమాలో నటిస్తున్నారు. కాగా ఈమె సోదరి శివాత్మిక.. ఇటీవలె 'రంగమార్తాండ' సినిమాతో తెరపై మెరిశారు.