ETV Bharat / entertainment

అనుష్క కొత్త ప్రయాణం.. మెల్​బోర్న్​లో తాప్సీ 'దోబారా' - మెల్‌బోర్న్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌

Movie News: హీరోయిన్​ తాప్సీ ప్రధాన పాత్రలో నటించిన 'దోబారా' చిత్రం.. వచ్చే నెలలో జరగనున్న మెల్​బోర్న్​ ఇండియన్​ ఫిల్మ్​ ఫెస్టివల్​లో ప్రదర్శితమవ్వనుంది. మరోవైపు, 'నిశ్శబ్దం' మూవీ తర్వాత కొన్నాళ్లపాటు విరామం తీసుకున్న అనుష్క.. ఇటీవలే కొత్త సినిమా కోసం కెమెరా ముందుకు వచ్చింది.

tapsee dobaara movie in melbourne movie festival and anushka starts her new movie

author img

By

Published : Jul 23, 2022, 6:46 AM IST

Tapsee Dobaara Movie: దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ తెరకెక్కించిన చిత్రం 'దోబారా'కు అరుదైన అవకాశం లభించింది. తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని మెల్‌బోర్న్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో తొలిచిత్రంగా ప్రదర్శించనున్నారు. ఆగస్టు 12 నుంచి 20 వరకూ సాగే ఈ చిత్రోత్సవాల్లో పాల్గొనడానికి తాప్సీ, అనురాగ్‌ వెళ్లనున్నారు. 2018లో విడుదలైన స్పానిష్‌ చిత్రం 'మిరేజ్‌'కు రీమేక్‌గా ఈ సినిమా రూపొందింది. ఈ సందర్భంగా తాప్సీ మాట్లాడుతూ.. "ఈ అరుదైన గౌరవానికి చాలా ఆనందంగా ఉంది. మా కష్టమేంటో మెల్‌బోర్న్‌లో ప్రదర్శించనున్నాం. నన్ను ఇందులో ముఖ్యపాత్రకు ఎంపిక చేసుకున్నందుకు అనురాగ్‌కు కృతజ్ఞతలు" అన్నారు.

https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15900331_teee.jpg
తాప్సీ

Anushka New Movie: అగ్ర కథానాయిక అనుష్క కొత్త సినిమా కోసం కెమెరా ముందుకొచ్చింది. యువ కథానాయకుడు నవీన్‌ పొలిశెట్టితో కలిసి ఆమె ఓ చిత్రంలో నటిస్తోంది. యు.వి.క్రియేషన్స్‌ నిర్మిస్తున్న ఆ సినిమాకి మహేష్‌.పి దర్శకత్వం వహిస్తున్నారు. 'నిశ్శబ్దం' తర్వాత కొన్నాళ్లపాటు విరామం తీసుకున్న అనుష్క.. ఇటీవలే దీనికోసం రంగంలోకి దిగింది. ఆమె నటిస్తున్న 48వ చిత్రమిది. తన సినీ ప్రయాణం మొదలై 17 ఏళ్లయిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ చిత్ర పరిశ్రమ, కుటుంబం, అభిమానులకు సామాజిక మాధ్యమాల ద్వారా కృతజ్ఞతలు చెప్పింది. 17 ఇయర్స్‌ ఇండస్ట్రీ ఇక్కడ అంటూ రాసున్న కేక్‌తో అనుష్క వేడుక చేసుకున్నారు.

అనుష్క

నవతరం ప్రేమకథతో..
శ్రీ ఆదిత్య కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం 'ఆదిత్య టీ 20 లవ్‌స్టోరి'. రమ్య, పవిత్ర, మాధురి కథానాయికలు. చిన్ని చరణ్‌ అడపా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ విడుదల చేశారు. "నవతరం ప్రేమకథ ఇది. ఇంటిల్లిపాదికీ వినోదం పంచుతుంది. శ్రీ ఆదిత్య స్టైలిష్‌గా కనిపిస్తారు. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాం" అన్నారు నిర్మాతలు. విజయ రంగరాజు, దత్తు, రాజనాల, అప్పారావు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: చినబాబు అడపా.

tapsee dobaara movie in melbourne movie festival and anushka starts her new movie
.

ఇవీ చదవండి: సూరారై పోట్రు, కలర్‌ ఫోటో, నాట్యం సినిమాలు ఎందుకు ప్రత్యేకమంటే?

జాతీయ ఉత్తమ మ్యూజిక్​ డైరెక్టర్​గా తమన్​.. బెస్ట్​ యాక్టర్స్​గా సూర్య, అజయ్​ దేవగణ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.