ETV Bharat / entertainment

మరో పాన్​ ఇండియా మూవీలో 'లెజెండ్​ శరవణన్​'!.. ఈ సారి బడ్జెట్​ ఎంతో? - అరుళ్ శరవణన్ కొత్త సినిమా

ఐదు పదుల వయసులోనూ స్టార్​ హీరోలకు ఏమాత్రం తగ్గనంటూ 'లెజెండ్​' సినిమాలో నటించారు బిజినెస్​ మ్యాన్​ శరవణన్​. అయితే ఈ మూవీ తర్వాత ఎన్నో ట్రోల్స్​ ఆయనపై వచ్చినప్పటికి అవన్నీ లెక్కచేయకుండా మరో సినిమాకు ​ సిద్దమవుతున్నారని తెలిసింది. ఆ వివరాలు..

Saravanan Arul New Movie
Saravanan Arul New Movie
author img

By

Published : Sep 18, 2022, 2:07 PM IST

Saravanan Arul New Movie : తమిళనాడుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అరుళ్ శరవణన్..'లెజెండ్'​ అనే చిత్రంతో వెండితెరపైకి అరంగేట్రం చేశారు. ఐదు పదుల వయసులోనూ స్టార్​ హీరోలకు ఏమాత్రం తగ్గనంటూ ఆ సినిమాలో నటించారు. దాదాపు రూ.60 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఆ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద బోల్తా కొట్టింది. ఈ సినిమా తర్వాత శరవణన్‌పై ఎన్నో ట్రోల్స్‌ సైతం నెట్టింట్లో హల్​చల్​ చేశాయి. భారీ నష్టాలతో పాటు విమర్శలను ఎదుర్కొన్న శరవణన్‌ ఇక తెరపైకి రారని అందరూ భావించారు. కానీ ఆ అంచనాలను తిప్పికొడుతూ తాజాగా శరవరణన్​ మరో సినిమాకు సిద్దమవుతున్నట్లు సమాచారం.

కోలీవుడ్‌ వర్గాల ప్రకారం.. త్వరలోనే ఆయన కొత్త సినిమా అప్డేట్ ఇవ్వనున్నారని, ఈ సారి ఏకంగా రొమాంటిక్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కించనున్నారని తెలిసింది. ఇప్పటికే ఓ కొత్త దర్శకుడితో చర్చలు జరిపి, కథను ఫైనల్‌ చేశారట. త్వరలోనే గ్రాండ్‌గా అనౌన్స్‌ చేయబోతున్నారని సమాచారం. అన్నట్లు.. ఇది కూడా పాన్‌ ఇండియా చిత్రమేనట.

ఇదీ చదవండి: 'హీరో అంటే అబ్బాయేనా? ఒక అమ్మాయి ఉండటం సాధ్యం కాదా?'

సామ్​కు జోడీగా 'శాకుంతలం'లో ఆ స్టార్​ హీరో.. ఫస్ట్​ లుక్​ చూశారా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.