ETV Bharat / entertainment

Lust stories 2 Review : తమన్నా, మృణాల్​ ఠాకూర్​కు వర్కౌట్​ అయినట్టేనా? - లస్ట్ స్టోరీస్​ 2 మృణాల్ ఠాకూర్ రివ్యూ

Lust Stories 2 Review : మిల్కీ బ్యూటీ తమన్నా, సీతారామం బ్యూటీ మృణాల్‌ ఠాకూర్‌, సీనియర్ హీరోయిన్​ కాజోల్‌ నటించిన లస్ట్ స్టోరీస్​ 2 సిరీస్​ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇంతకీ ఎలా ఉందంటే?

Lust stories  2 Review
Lust stories 2 Review : తమన్నా, మృణాల్​ ఠాకూర్​కు వర్కౌట్​ అయినట్టేనా?
author img

By

Published : Jun 29, 2023, 5:36 PM IST

Updated : Jun 29, 2023, 6:03 PM IST

Lust Stories 2 Review : 'లస్ట్‌ స్టోరీస్‌'.. 2018లో విడుదలైన ఈ ఆంథాలజీ సిరీస్​ ఎంతటి ప్రేక్షకాదరణ పొందిందో తెలిసిన విషయమే. ఇప్పుడు దానికి కొనసాగింపుగా తాజాగా వచ్చిన ఆంథాలజీ సిరీస్‌ 'లస్ట్‌ స్టోరీస్‌ 2'. మిల్కీ బ్యూటీ తమన్నా, సీతారామం బ్యూటీ మృణాల్‌ ఠాకూర్‌, సీనియర్ హీరోయిన్​ కాజోల్‌ వంటి వారు నటించడం, అలాగే ప్రచార చిత్రాలు ఆకర్షించేలా ఉండటం వల్ల.. సినీ ప్రియులకు సిరీస్‌పై ఆసక్తిని పెంచింది. తాజాగా ఈ సిరీస్​ గురువారం(జూన్​ 29) నెట్​ఫ్లిక్స్​లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇంతకీ ఈ సిరీస్​ ఎలా ఉందంటే?

ముచ్చటైన జంట, అద్దం, మాజీ ప్రేయసితో శృంగారం, బొద్దింక అనే నాలుగు ఎపిసోడ్లతో ఈ రెండో సీజన్​ను రూపొందించారు. వాటి కథేంటంటే..

మొదటి ఎపిసోడ్​.. వేద (మృణాల్‌ ఠాకూర్‌) అర్జున్‌ (అంగద్‌ బేడీ) పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. అయితే వేద బామ్మ (నీనా గుప్త) మధ్యలో ఎంట్రీ ఇచ్చి.. కొత్త జంట లైఫ్​ లాంగ్ హ్యాపీగా ఉండాలంటే పెళ్లికి ముందు శృంగార జీవితాన్ని రుచి చూడాలని అడ్వైస్​ ఇస్తుంది. ఒకరి కోసం ఒకరు జీవితాంతం కలిసి ఉంటారా? లేదా? అన్నది ఈ అనుభవం ద్వారానే తెలుస్తుందని అంటుంది. మరి బామ్మ చెప్పిన మాటలను వేద, అర్జున్‌ విన్నారా? ఈ జంటకు చెందిన ఇరు కుటుంబాలు బామ్మ మాటను అంగీకరించారా? చివరిగా వీరి పెళ్లి జరిగిందా? లేదా? అన్నది మిగతా కథ.

రెండో ఎపిసోడ్​.. ఇషిత (తిలోత్తమ షోమీ) ముంబయిలో ఉద్యోగం చేస్తూ ఉంటుంది. ఒక రోజు మైగ్రేన్‌ కారణంగా తీవ్రమైన తలనొప్పి రావడం వల్ల కాస్త ముందుగానే ఇంటికి చేరుకుంటుంది. అదే సమయంలో ఇంటి పనిమనిషితో తన భర్తతో కలిసి శృంగారం చేస్తుండగా చూసి షాక్​ అవుతుంది. మరి ఆ తర్వాత ఇషిత ఏం చేసిందనేదే మిగతా కథ.

మూడో ఎపిసోడ్​.. విజయ్‌ చౌహాన్‌ (విజయ్‌ వర్మ) అమ్మాయిల పిచ్చి. అనిత (ముక్తి మోహన్‌)ను పెళ్లి చేసుకుంటాడు. వీరికి ఇద్దరు పిల్లలు . ఒక రోజు అతడికి తన మాజీ ప్రేయసి శాంతి (తమన్నా) కనిపిస్తుంది. వీరిద్దరి మధ్య సెక్స్​ జరుగుతుంది. మరి ఆ తర్వాత శాంతితో అతడు ఎలా విడిపోయాడు అనేదే కథ.

నాలుగో ఎపిసోడ్.. రాజ కుటుంబానికి చెందిన కుముద్‌ మిశ్రా.. తన భార్య దేవయాని (కాజోల్‌).. కొడుకు అంకుర్‌తో కలిసి నివసిస్తుంటాడు. అతడికి ఇంటి పనిమనిషి బిటోరి (పాయల్‌ పాండే) పై మనసు ఉంటుంది. ఒక రోజు బిటోరి స్థానంలో రేఖ (అనుష్క కౌశిక్‌) ఇంట్లో పనిచేయడానికి రాగా, ఆమెతో కలిసి శృంగారంలో పాల్గొంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఈ విషయాలన్నీ భార్య దేవయానికి తెలుసా? లేదా? అనేది మిగతా కథ.

మొత్తంగా మొదటి సీజన్​ 'లస్ట్‌ స్టోరీస్‌' భిన్న మనస్తత్వాలు కలిగిన వ్యక్తుల భావోద్వేగాలను చూపించే ప్రయత్నం చేస్తే.. ఈ రెండో సీజన్​లో మాత్రం కథ కన్నా కూడా ఎక్కువగా 'లస్ట్‌'పైనే ఎక్కువ దృష్టి పెట్టారట. ఎక్కువగా శృంగారాన్నే చూపించారట. అయితే కొంకణ్‌ సేన్‌ శర్మ తెరకెక్కించిన 'అద్దం' ఎపిసోడ్‌ మాత్రమే భావోద్వేగాల కలబోతగా సాగిందట. ఫైనల్​గా కోరికలు, కోపాలు అనేవి క్షణికాలే అన్నట్లుగా చూపించారట. కెమెరా వర్క్ బాగున్నప్పటికీ.. మొత్తంగా చూస్తే నిర్మాణ విలువలు హై స్టాండర్డ్స్​ మేయింటెయిన్​ చేయలేదట. లస్ట్ స్టోరీస్ బ్రాండ్​ను ఉపయోగించుకుని అర్థం లేని ఎపిసోడ్స్​ను రూపొందించారని అంటున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి :

'అతడు నాకు ఎంతో స్పెషల్​'.. డేటింగ్ రూమర్స్​పై తమన్నా క్లారిటీ!

'లస్ట్​ స్టోరీస్​ 2' బ్యూటీస్​ స్టైలిష్​ ఫొటోషూట్​.. మృణాల్​ ఓపెన్​ హార్ట్​ షో హైలైట్​!

Last Updated : Jun 29, 2023, 6:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.