Suriya kanguva released : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా తెరకెక్కిన బహుభాషా చిత్రం 'కంగువ'. శివ దర్శకుడు. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఆదివారం సూర్య పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్‌ను మూవీటీమ్ విడుదల చేసింది. ఈ ప్రచార చిత్రం ఆద్యం ఆకట్టుకునేలా ఉంది.
ఇప్పటివరకూ చేయని సరికొత్త పాత్రలో హీరో సూర్య కనిపించారు. కంగువ అంటే అగ్ని శక్తి కలిగిన వ్యక్తి అని అర్థం. అలాగే పరాక్రమవంతుడు అని కూడా అంటారు. గుట్టలు గుట్టలుగా ఉన్న శవాలపై నుంచి సూర్య ఎంట్రీ అదిరింది. సూర్యకు ఎలివేషన్ ఇస్తూ.. బ్యాక్‌గ్రౌండ్‌లో 'అఖిలాండం ఏలిన మారాక్రుని వంశకుడు...' అంటూ సాగే వాయిస్ ఓవర్ అదిరిపోయింది. దేవీ శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ ప్రచార చిత్రాన్ని హైలైట్‌గా నిలిచింది. ఆయన కెరీర్ ఇది బెస్ట్ అని చెపొచ్చు. ఇక ప్రచార చిత్రంలో 'కుశలమా' అనే డైలాగ్‌తో సూర్య ఇచ్చిన ఎక్స్ప్రెషన్ కూడా గూస్బంప్స్ తెప్పిస్తున్నాయి. ఆ వెంటనే.. వేలాది మంది సైన్యం కలిసి బాణాలు వేయడం.. సూర్య అరుస్తూ కనిపించడం అంతా ఓ విజువల్ ఫీస్ట్‌గా సూపర్‌గా అనిపించింది.
ఇకపోతే ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా త్రీడీలో ఏకంగా పది భాషల్లో నిర్మిస్తున్నారు. భారీ యాక్షన్ సన్నివేశాలు, విజువల్ ఎఫెక్ట్స్ ప్రధాన ఆకర్షణగా ఉండేలా ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నారని అర్థమవుతోంది. వచ్చే ఏడాది ఈ చిత్రం గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు.ఈ చిత్రాన్ని దాదాపు రూ.300 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారని తెలిసింది. సూర్య కెరీర్‌లో ఇదే భారీ బడ్జెట్ చిత్రం కావడం విశేషం. అయితే ఈ చిత్రం రెండు భాగాలుగా రానుందని తెలిసింది. మొదటి భాగంలో దిశాపటానీ హీరోయిన్. రెండో భాగంలో దీపికా పదుకొణె కోసం చర్చలు జరుపుతున్నారట.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇక దర్శకుడు శివ విషయానికొస్తే.. సినిమాటోగ్రాఫర్‌గా కెరీర్ ప్రారంభించిన ఆయన.. తెలుగులో గోపిచంద్ 'శౌర్యం'తో దర్శకుడిగా మారారు. ఆ తర్వాత గోపిచంద్‌తోనే 'శంఖం' తీయగా అది పర్వాలేదనిపించింది. అనంతరం తమిళంలో కార్తీ హీరోగా 'సిరుత్తై'(రవితేజ విక్రమార్కుడు) అనే సినిమాను తెరకెక్కించారు. ఆ తర్వాత రవితేజతో 'దరువు', అజిత్‌తో వరుసగా నాలుగు సినిమాలు తెరకెక్కించారు. 'వీరం'(కాటమరాయుడు), 'వేదాళం' (భోళా శంకర్), 'వివేగం', 'విశ్వాసం' చిత్రాలు చేశారు. ఈ నాలుగు చిత్రాలు మంచి హిట్‌ను అందుకున్నాయి. అయితే వివేగం మాత్రం ప్రత్యేకంగా కొంతమందిని మాత్రమే ఆకట్టుకుంది. ఈ సినిమాకు స్పెషల్ ఫ్యాన్స్ ఉంటారు. అనంతరం రజనీకాంత్‌తో 'అన్నాత్తే' ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. ప్రస్తుతం సూర్యతో 'కంగువ' సినిమా చేస్తున్నారు.
ఇదీ చూడండి :
సూర్య.. మళ్లీ ఆ డైరెక్టర్‌తోనే.. ఈ సారి ఎన్ని వందల కోట్లో!
Actor Surya Emotional tribute to Aishwarya : 'నువ్వు నిజమైన హీరో'.. ఫ్యాన్ మృతి పట్ల సూర్య ఎమోషనల్