సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ అక్కినేని నటిస్తున్న సినిమా 'ఏజెంట్'. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ ప్రాజెక్ట్‌లో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి కీలక పాత్ర పోషిస్తున్నారు. నిర్మాత అనిల్ సుంకరతో కలిసి దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాతోనే సురేందర్‌రెడ్డి నిర్మాతగా మారబోతున్నారు. వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు ఏప్రిల్ 28న రిలీజ్ కాబోతుంది.
విడుదల సమయం దగ్గర పడిన నేపథ్యంలో.. భారీ హంగులతో రూపొందిన ఈ చిత్ర బడ్జెట్ ఎంత అయ్యిందనే విషయమై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా అందిన సమాచారం ప్రకారం .. ఈ సినిమా కోసం రూ.80-రూ.90 కోట్లు వరకు ఖర్చు చేశారని తెలిసింది. షూటింగ్ ప్రారంభానికి ముందు ఒక రేటు అనుకోగా ఇప్పుడది రెట్టింపు బడ్జెట్‌కు చేరుకుందట. మరి ఇంత బడ్జెట్ పెట్టి తీసిన సినిమా అఖిల్ మీద వర్కౌట్ అవుతుందా? అని అనుమానాలు ప్రస్తుతం మెదులుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే మరో ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. అదేంటంటే.. బడ్జెట్ పెరిగిపోతూ వెళ్లడం వల్ల.. నిర్మాత అనిల్‌పై భారం పడకుండా ఉండేందుకు.. అఖిల్, సురేందర్ రెడ్డి కలిసి ఓ కీలక నిర్ణయం తీసుకున్నారట. ఒక్క రూపాయి రెమ్యునరేషన్ కూడా తీసుకోకూడదని నిర్ణయించుకున్నారని తెలిసింది. సినిమా విడుదైన తర్వాతే ఫలితంగా ఆధారంగా పారితోషికం గురించి ఆలోచించాలని ఫిక్స్ అయ్యారని టాక్ వినిపిస్తోంది. ఇక పోతే ఏజెంట్ సినిమా బ్యానర్లోనే మరో సినిమా చేస్తానని అఖిల్ మాట ఇచ్చారట. చూడాలి మరి ఏం జరుగుతుందో.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇకపోతే ప్రస్తుతం ఈ సినిమా హైదరాబాదులో షూటింగ్ జరుపుకుంటుందని తెలుస్తోంది. ఈ షెడ్యూల్ పూర్తయ్యాక ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ కోసం చిత్రబృందం మస్కట్ వెళ్లనుందట. ఈ నెల చివర్లో దాదాపు వారం పాటు అక్కడే చిత్రీకరించనున్నరట. ఆ తర్వాత త్వరగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి ఏప్రిల్ 28నాటికి విడుదల చేయనుంది. కాగా, ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన గ్లిమ్స్, పోస్టర్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
ఇదీ చూడండి: ఈ వారమే ధనుశ్ 'సార్', హిందీ 'అల వైకుంఠపురములో'.. ఇంకా ఏ చిత్రాలు వస్తున్నాయంటే?